ఆత్మల వేటగాళ్లు షాక్‌ : థియేటర్‌లో దెయ్యాలు..! | Terrifying moment script flies across haunted stage in theatre where 25 people died | Sakshi
Sakshi News home page

ఆత్మల వేటగాళ్లు షాక్‌ : థియేటర్‌లో దెయ్యాలు..!

Published Thu, Nov 2 2017 10:48 AM | Last Updated on Thu, Nov 2 2017 10:49 AM

Terrifying moment script flies across haunted stage in theatre where 25 people died - Sakshi

లింకన్‌షైర్‌ : ఓ థియేటర్‌లో కొందరు ఘోస్ట్‌ హంటర్లు తీసిన ఫుటేజీ సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. లింకన్‌షైర్‌లోని ఓల్డ్‌ నిక్‌ థియేటర్‌లో హత్యకు గురైన పాతిక మంది కళాకారుల ఆత్మలు అక్కడే ఉన్నాయన్న అనుమానంతో ఘోస్ట్‌ హంటర్ల బృందం అక్కడికి వెళ్లింది. దెయ్యాలున్నాయనే అనుమానంతోనే థియేటర్‌ను ఇప్పటికే ఏళ్లుగా పాడుబెట్టారు.

దీంతో హంటర్లు అర్థరాత్రి తమ వెంట ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలను తీసుకుని థియేటర్‌లోకి వెళ్లారు. హత్యకు గురైన ప్రాంతంతో పాటు థియేటర్‌లో అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి చిన్నదాన్ని చిత్రీకరించుకుని వచ్చారు. మరుసటి రోజు ఆ వీడియోను చూసిన ఆత్మల వేటగాళ్లు షాక్‌కు గురయ్యారు.

ఎక్కడైతే హత్య జరిగిందో.. అదే ప్రదేశంలో ఆత్మలన్నీ కలిసి గుమిగూడి ఉండటం వీడియోలో ఉంది. అంతేకాదు.. ఆ సమయంలో ఏదో వస్తువు అటుగా ఎగురుకుంటూ వెళ్లింది. ఈ చిత్రాలను టిమ్‌ మాథ్యూస్‌ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. థియేటర్‌లో ఆత్మల ఉన్నాయా? లేదా? అన్న విషయాలను తెలుసుకునేందుకు ‘హ్యూమన్‌ పెండలం’  పరీక్ష కూడా చేసినట్లు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement