దేశాధ్యక్షుడికి దెయ్యాల భయం!
రియో డి జెనిరో :
బ్రెజిల్ అధ్యక్షుడు మైఖేల్ టెమర్‌కు దెయ్యాల భయం పట్టుకుంది. దీంతో వెంటనే తన అధికార నివాసాన్ని ఖాళీ చేసి దేశ ఉపాధ్యక్షుడి అధికార నివాసంలోకి మారారు. అధ్యక్ష భవనంలో అడుగు పెట్టినప్పటి నుంచి కంటి నిండా నిద్రలేకుండా పోయిందని, ఆ భవంతి ఎంత విలాసవంతంగా ఉన్నా అందులో అసాధారణమైనవి ఏమో ఉన్నట్టు మైఖేల్ టెమర్ పేర్కొన్నారు. ఆ ఇంట్లో దెయ్యాలున్నాయేమో అని అనుమానం వ్యక్తం చేశారు.
బ్రెజిల్ అధ్యక్షుడి అధికార నివాసమైన అల్వొరాడా ప్యాలెస్ భయానకంగా ఉండటంతో అక్కడి నుంచి దేశ ఉపాధ్యక్షుడి భవనమైన జబురు ప్యాలెస్కు మకాం మార్చారు. తన భార్య మార్సెలా కూడా అధ్యక్షభవంతి వింతగా అనిపిస్తోందని తెలిపినట్టు టెమర్ పేర్కొన్నారు. దిల్మారౌసెఫ్ రోసెఫ్ సస్పెండ్ అయిన తర్వాత మైఖేల్ టెమర్ బ్రెజిల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.