జూబ్లీహిల్స్: మానసిక స్థితి సరిగ్గా లేని ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ సమీపంలోని జవహర్‌నగర్ హనుమాన్ దేవాలయం సమీపంలో నివసించే బాల రాజు(45) సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాదిగా విపరీతమైన భయానికి గురవుతున్నాడు. కుటుంబ సభ్యులు ఏమైందని ప్రశ్నిస్తే తనను దెయ్యాలు, భూతాలు వెంబడిస్తున్నాయంటూ చెప్పేవాడు. సోమవారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. వేలాడుతూ కనిపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.