Mental status
-
పీడ ఫీలింగ్
పడుతుంటే పట్టుకోవాల్సిన పిల్లలను పడతొక్కేవాళ్లుంటారా? పీడకలలొస్తే లాలించే పెద్దలే ఓ పీడకలవుతారా? ఇక పిల్లల్ని ఎవరి అండకు వదలాలి? ఇక పిల్లల్ని ఏ భరోసాకి అప్పజెప్పాలి? చీదర పుడుతోంది... కాదు కాదు కంపరం పుడుతోంది... పట్టలేనంత కోపం వస్తోంది! గొంతు పట్టుకోవాలన్నంత ఆవేశం పొంగుతోంది!! కాని... చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. వీళ్లను మనం కొట్టకూడదు... చట్టమే తాట తీస్తుంది!! పెడోఫీలియా... పిల్లలను లైంగికంగా వేధించే ఉన్మాద ప్రవర్తన!! ఈ పీడ ఫీలింగ్ నుంచి సమాజాన్ని కడిగేయాలనే ఈ ప్రయత్నం!! పేరెంట్స్ నీడ్ టు నో! తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలను ‘పెద్దలకు ’ అప్పజెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లీజ్ బి కేర్‌ఫుల్!! చిన్నపిల్లలను లైంగికంగా వేధించే ప్రవృత్తిని ఒక మానసిక స్థితిగా కాకుండా దాన్నొక రాక్షస చర్యగా పరిగణించాలి. ‘హలో.. సరిత గారూ... నిహారిక క్లాస్ టీచర్ని మాట్లాడుతున్నానండీ..!’‘హలో.. చెప్పండి మామ్!’‘మీ పాపకు జ్వరం. ఒళ్లు కాలిపోతోంది. వచ్చి తీసుకెళ్తారా...’‘అయ్యో.. ఉదయం స్కూల్‌కి పంపేప్పుడు బాగానే ఉంది కదా..’ కంగారుగా బదులిచ్చింది సరిత.‘ఏమోనండీ మరీ.. అసెంబ్లీకి కూడా అటెండ్ అవకుండా క్లాస్ రూమ్‌లోనే పడుకుని ఉండిపోయింది. అటెండెన్స్ తీసుకుంటుంటే తన పక్కన ఉండే పిల్లలు చెప్పారు... నిహారికకు జ్వరమని. వెళ్లి చూస్తే ఒళ్లు కాలిపోతోంది. అందుకే వెంటనే కాల్ చేస్తున్నాను’ వివరించింది క్లాస్ టీచర్. ‘వచ్చేస్తున్నానండీ’.. ఇందాకటి కంగారే కంటిన్యూ అయింది సరిత గొంతులో. ‘సరిత గారూ.. ఇంకో విషయమండీ... రెండు రోజుల కిందటే మీకు ఫోన్ చేద్దామనుకున్నాను. ఎందుకో ఈ మధ్య నిహారిక చాలా డల్‌గా కనపడుతోంది. పిల్లలతో కలవట్లేదు. లంచ్ కూడా సరిగ్గా తినట్లేదల్లే ఉంది. ఏమైందో కనుక్కోవడానికి యాజ్ ఏ టీచర్ నా ప్రయత్నం నేను చేశాను. గమ్మున ఉంటోంది తప్ప పెదవి విప్పట్లేదు. మీరూ వర్కింగ్కదా.. బహుశా మిమ్మల్ని మిస్ అవుతుందేమో... చూడండి...’ అని టీచర్ సజెస్ట్ చేసింది. కూతురు కళ్లల్లో భయం ఫోన్ కాల్ కట్ అయ్యాక ఆఫీస్‌కి సగం దూరంలో ఉన్న సరిత స్కూల్‌కి రూట్ మార్చుకుంది. దారంతా నిహారిక గురించిన ఆలోచనలే చుట్టుముట్టాయి ఆమెను. నిజమే.. తనూ గమనిస్తోంది! తను సాయంకాలం ఇంటికి రాగానే గట్టిగా వాటేసుకుంటోంది. తన వెన్నంటే తిరుగుతోంది. రాత్రి స్నానానికి వెళితే కూడా బాత్రూమ్ డోర్ దగ్గరే నిలబడి ఉంటోంది. ఆరేళ్ల పిల్ల అంతలా అంటిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. పాపకు ఊహ తెలిసినప్పటి నుంచే తను, ప్రకాష్ ఇద్దరూ నిహారికను ప్రిపేర్చేశారు... వర్కింగ్ పేరెంట్స్ చైల్డ్‌గా ఎలా ఉండాలో... తన పని తాను ఎలా చేసుకోవాలో... ఇంట్లో ఎవరూ లేకపోతే భయపడకుండా ఎలా ఉండాలో... ఫోన్లో ఎలా మాట్లాడాలో... తన వివరాలు ఎలా చెప్పాలో... అన్నీ నేర్పించారు. సహజంగానే చురుకుదనం ఉన్న పిల్ల. ఇన్ని రోజులుగా దేనికీ భయపడలేదు. ఇప్పుడీ సడెన్ ఛేంజ్ ఏంటీ? నిజంగానే అమ్మానాన్న తనతో గడపట్లేదని దిగులు పడుతోందా? స్కూల్లో ఏమన్నా స్ట్రెస్ ఫీలవుతోందా? అన్నీ ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో ఒక్కర్ని కంటేనే చక్కగా పెంచగలమని నిహారిక ఒక్కతే చాలనుకున్నారు. బహుశా తనకు తోడులేక ఏమన్నా ఒంటరితనం ఫీలవుతోందా? విషయాన్ని ప్రకాశ్‌కి చెప్పి పాప దిగులు, భయం, డల్‌నెస్ వెనక కారణం కనుక్కోవాల్సిందే అని నిర్ణయించుకుంది సరిత. ఆ ఆలోచనలకు, తన ప్రయాణానికి బ్రేక్ వేసింది స్కూల్ రావడంతో! నానమ్మకు కబురు ‘ప్రకాశ్... దాన్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. సంభాళించడం నా వల్ల కాదు. మీ అమ్మను పిలువ్ ప్లీజ్’.. ఎంతో కష్టమ్మీద కూతుర్ని నిద్రపుచ్చి మంచం మీదే కూర్చున్న ప్రకాశ్ భుజమ్మీద తలవాల్చింది సరిత బేలగా. ‘ఏమయిందంటావ్?’ ఓ చేత్తో సరితను పొదివి పట్టుకుంటూ మరో చేత్తో కూతురి తల నిమురుతూ అన్నాడు ప్రకాశ్. ‘తెలియట్లేదు. ఎంత అడిగినా నోరు విప్పదు. చూస్తున్నావ్‌గా రెండు రోజుల్నుంచి నా ఒళ్లు దిగలేదు. గట్టిగా హత్తుకుని ఉంటోంది. ఏమైందమ్మా అంటే చెప్పదు. దాన్ని మామూలు పిల్లను ఎలా చేయాలో అర్థం కావట్లేదు. అత్తయ్యను పిలిపించు ప్రకాశ్’ అంటూ ఒక్కసారిగా ఏడ్చేసింది సరిత. కథలు... గోరుముద్దలు కొడుకు, కోడలి నుంచి ఫోన్ రాగానే హుటాహుటిన బయలుదేరింది వసంత. అత్తను చూడగానే బోరుమంది కోడలు. మనవరాలి మొహం చాటంతయింది. కూతురి మొహంలోని చిరునవ్వును చూసి అమ్మను పిలిపించడం మంచి పనే అయింది అనుకున్నాడు ప్రకాశ్. తెల్లవారి నుంచే ఆఫీస్‌లకు హాజరవ్వడం మొదలుపెట్టారు ఆ ఆలుమగలు. పాపకు ఇంకో వారం సెలవు పొడిగించారు. చక్కటి కథలతో కమ్మటి గోరుముద్దలు తినిపించసాగింది వసంత. ఆట, పాటతో రెండు రోజుల్లోనే మనవరాలి మనసులో బెరుకు పోగొట్టింది. ఆ పసిదాని భయానికి కారణమేమై ఉంటుందా అని ఆలోచించసాగింది. ఆమె దృష్టి ముందుగా నిహారిక స్కూల్‌కి వెళ్లే ట్రాన్స్‌పోర్టేషన్ మీద పడింది. స్కూల్ బస్‌లో వెళ్తుంది. 30 మంది పిల్లల మధ్య వెళ్తుంది. కొలిక్కిరాని ఆలోచనలు ‘ఏమ్మా..! స్కూల్ బస్‌లో వెళ్తుంటే పిల్లలతో నువ్వేమైనా గొడవ పడ్డావా?’ అడిగింది ఒకరోజు రాత్రి అన్నం తినిపిస్తూ! ‘ఉహూ’ చెప్పింది నిహారిక. ‘మరి స్కూల్లో టీచర్లు, నీ ఫ్రెండ్స్ ఏమన్నా అంటున్నారా?’ ప్రశ్నించింది. దానికి తల అడ్డంగా ఊపింది అమ్మాయి. అన్నం తినిపించడం అయిపోయాక మనవరాలి మూతి కడిగి పడుకోబెడుతూ ఇంటి పరిసరాల మీదకు తన ధ్యాసను మళ్లించింది నానమ్మ. ఇండిపెండెంట్ హౌజ్. కొడుకు, కోడలు, మనవరాలు, ఆ ఇంటిని ఇరవైనాలుగ్గంటలూ కాపలాకాసే వాచ్‌మన్. అతని వయసు యాభై ఏళ్లు. నమ్మకస్తుడే. ‘ఇంట్లోకి దోమను కూడా దూరనివ్వడు. పిల్లను కంటికి రెప్పలా కాచుకుంటాడు’ అని చెప్పారు కొడుకు, కోడలు. ఇక పనిమనిషి. ఈ పిల్ల వెళ్లిపోయాక వస్తుంది. దీన్ని బెదిరించి, భయపెట్టే ఆస్కారమే లేదు. ఆమె ఈ ఆలోచనల్లో సీరియస్‌గా ఉన్నప్పుడే... నిహారిక మూలుగు వినిపించింది. బాత్రూమ్లోంచి. ఎప్పుడు వెళ్లిందో బాత్రూమ్లోకి... ఆ మూలుగుతో ఈ లోకంలోకి వచ్చింది వసంత. గభాల్న బాత్రూమ్లోకి పరిగెత్తింది. వెక్కివెక్కి ఏడ్చిన చిన్నారి ‘నానమ్మా... నొప్పి’ అంటూ విలవిల్లాడసాగింది పిల్ల. ‘అయ్యో.. తల్లీ.. ఎక్కడే. కడుపునొప్పా?’ అంటూ పొట్ట చూసింది. ‘కాదు నానమ్మా.. ’ అంటూ నొప్పి ఎక్కడో చూపించింది. తొడల దగ్గర ఏ చీమ అయినా కుట్టిందేమో అంటూ కలవర పడింది వసంత. ‘నానమ్మా.. పాస్‌కి వెళ్లినప్పుడల్లా నొప్పెడుతోంది’ అంటూ కన్నీళ్లతో చెప్పింది నిహారిక. ఏమీ అర్థంకాక అయోమయంలో పడింది వసంత. చూద్దామని పరీక్షించి గాభరా పడిపోయింది. తొడల దగ్గర ప్రాంతం కందిపోయింది. వెనక భాగమంతా గాట్లు! వసంతకు వణుకు వచ్చేసింది. తను వచ్చిన దగ్గర్నుంచీ చూస్తోంది. బాత్రూమ్కి వెళ్లి వచ్చినప్పుడల్లా పిల్ల మొహం పాలిపోయి ఉంటోంది. కళ్లల్లో ఏదో బాధ. ఇప్పుడర్థమైంది. బెడ్రూమ్లోకి వచ్చి పాపను ఒళ్లోకి తీసుకొని హత్తుకుంది. ‘ఏమైంది నాన్నా.. ’ అంటూ అనునయించింది. అంతే ఆ పాప గట్టిగా నానమ్మను వాటేసుకొని వెక్కివెక్కి ఏడ్చింది. విషయమంతా చెప్పింది. ‘నేను వచ్చేసాను కదా.. నీకింకేం భయంలేదు. ఇంక అలా జరగదు’ అంటూ ఆ పిల్లకు అభయమిచ్చి పడుకోబెట్టింది. నిశ్చేష్టులైన తల్లిదండ్రులు! కొడుకు, కోడలి గది తలుపు కొట్టింది. సరిత తలుపు తీసింది. ఎదురుగా ఉన్న అత్తగారిని చూసి... ‘ఏమైందత్తయ్యా... పాప మళ్లీ ఏమైనా భయపడుతోందా?’ అడిగింది కంగారుగా. ‘కాదు, భయమేస్తోంది అంటూ... లోపలికి వెళ్లి మనవరాలు చెప్పిన విషయాన్ని వాళ్ల చెవిన వేసింది. హతాశులయ్యారు భార్య, భర్త. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు ప్రకాశ్. ఆవేశంగా వాకిట్లోకి నడిచాడు. వాచ్‌మన్ గదిలోకి వెళ్లి వాచ్‌మన్‌ను బరబరా బయటకు లాక్కొచ్చాడు. ‘రాస్కెల్ మా సొంత మనిషివని నమ్మి స్కూల్ నుంచి రాగానే పాప బాధ్యతను నీకు అప్పగిస్తే నువ్ చేసేది ఇదా?’ అంటూ కొట్టబోయాడు. వసంత అడ్డుకుంది. దుఃఖంతో కుంగిపోయాడు ప్రకాశ్. తేరుకొని పోలీస్కంప్లయింట్ ఇవ్వడానికి వెళ్లాడు. పెడోఫిలియా అంటే? అమ్మానాన్న ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడంతో పరిచితుల వికృతచేష్టలకు పిల్లలు బలికావడం ఎక్కువైంది. మన ఇంట్లో సొంత వ్యక్తులు మొదలు... బాగా తెలిసినవారు, ఇంట్లోకి చొరవగా చొచ్చుకుపోయేవారు, తరచుగా వచ్చే స్నేహితుల వరకు... ఎవరో ఒకరి నుంచి పిల్లలు లైగింక వేధింపులు ఎదుర్కొంటున్న ఘటనలు ఎక్కువయ్యాయి. కాబట్టి అపరిచితులనే కాదు, పరిచితులను కూడా బాగా గమనించాలి. వాళ్లలో కొంతమంది ‘పెడోఫిలియా’ అనే మానసిక రుగ్మతను కలిగి ఉండొచ్చు. అలాంటి వాళ్లు పసిపిల్లలను హింసిస్తూ లైంగికానందాన్ని పొందుతారు. పై కేస్‌లో వాచ్‌మన్ చేసింది ఇదే. ఇలాంటి హింస వల్ల పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతిని వాళ్ల ఎదుగుదల మీద ప్రభావం చూపెడుతుంది. అందుకే ఈ నేరాల నుంచి పిల్లలను సంరక్షించేందుకు 2012లో పోక్సో యాక్ట్ (లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం) తెచ్చారు. దీని ప్రకారం నేరస్తుడికి ఏడేళ్లు జైలు శిక్ష, కొన్నిసార్లు యావజ్జీవ కారాగారశిక్ష పడుతుంది. ఇంకొన్నిసార్లు ఈ శిక్షలతో పాటు జరిమానా కూడా విధించవచ్చు. – ఇ. పార్వతి, అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్, parvathiadvocate2015@ gmail.com – సరస్వతి రమ -
‘ప్రత్యేక’ విద్య డల్!
5 నెలలుగా జీతాలు రాక ఉపాధ్యాయుల అవస్థలు ఫిజియోథెరపిస్ట్‌లు, ఆయాల లేమితో నిర్వీర్యమవుతున్న వ్యవస్థ ఆందోళనలో ప్రత్యేక అవసరాలుగల చిన్నారుల తల్లిదండ్రులు ప్రత్యేక అవసరాలుగల చిన్నారుల మానసిక స్థితిని చక్కదిద్ది వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వనరుల విద్యా కేంద్రాలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రగతి పథకంలో సాగిన ఈ కేంద్రాలు టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పరిస్థితి దిగజారింది. – తాడికొండ రూరల్ తాడికొండలో ఉన్న ప్రత్యేక విద్యావనరుల కేంద్రంలో ప్రస్తుతం 19 మంది చిన్నారులు ఉన్నారు. ఫిజియోథెరపిస్టు, ఆయాల కాంట్రాక్టు కాలపరిమితి పూర్తవడంతో తొలగించారు. ఆ పోస్టుల్లో ఇంకా ఎవరినీ నియమించలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టు ఉపాధ్యాయులే అన్నీ తామే నడిపించాల్సివస్తోంది. గదులను శుభ్రం చేసేందుకు కూడా ఎవరూ లేకపోవడంతో కేంద్రం నిర్వహణ కష్టంగా మారిందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఫిజియోథెరపిస్ట్ లేకపోవడంతో తల్లిదండ్రులు కూడా చిన్నారులను కేంద్రానికి పంపించేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. నిర్వహణ లోపంతో ఫ్లోరింగ్ కుంగిపోవడంతో ఇబ్బందిగా మారింది. జిల్లాలో మొత్తం 57 మండలాల్లో ఈ పాఠశాలలు కొనసాగుతుండగా కేవలం 19 మండలాల్లో మాత్రమే గత ప్రభుత్వ హయాంలో పక్కా భవనాలు మంజూరయ్యాయి. జిల్లా అంతటికీ ఫిజియోధెరపిస్ట్లు 13 మంది ఉండగా కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకునే పద్ధతి పాటిస్తుండటంతో ఈ ఏడాది ఎక్కడా నియామకం చేయలేదు. ఆయాలను కూడా నియమించలేదు. ఫలితంగా ఉపాధ్యాయులే అన్నీ తామై నడిపిస్తున్నారు. ఐదు నెలలుగా అందని జీతాలు.. ప్రత్యేక విద్యావనరుల కేంద్రాల్లోని ఉపాధ్యాయులకు (శిక్షకులు) 5 నెలలుగా జీతాలు అందడంలేదు. దీంతో పలువురు శిక్షకులు విధుల నుంచి తప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రత్యేక విద్యావనరుల కేంద్రాలు మూతపడాల్సిన పరిస్థితి తలెత్తుతుందని పలువురు వికలాంగ బాలబాలికల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సత్వరమే జీతాలు విడుదల చేసి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నాం.. కొన్ని నెలలుగా జీతాలు లేకపోవడంతో కేంద్రాన్ని అప్పులు తెచ్చి కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు చొరవతో జీతాలు వెంటనే విడుదల చేయాలి. చాలా ఇబ్బందిగా ఉంది. – కత్తి నాగబాబు, ఉపాధ్యాయుడు, తాడికొండ ప్రజాప్రతినిధులు చొరవ చూపిస్తే మరింత అభివృద్ధి.. ఈ కేంద్రాల్లో సమస్యల పరిష్కారానికి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి. ఎంతో మంది ప్రత్యేక అవసరాలుగల చిన్నారుల జీవితాల్లో ఈ కేంద్రాలు వెలుగు నింపుతున్నాయి. జీతాలు రాక మేం ఎంతో ఇబ్బంది పడుతున్నాం. – మండ్ల యలమంద, ఉపాధ్యాయుడు, తాడికొండ -
దెయ్యాలు వెంబడిస్తున్నాయంటూ..
జూబ్లీహిల్స్: మానసిక స్థితి సరిగ్గా లేని ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ సమీపంలోని జవహర్‌నగర్ హనుమాన్ దేవాలయం సమీపంలో నివసించే బాల రాజు(45) సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాదిగా విపరీతమైన భయానికి గురవుతున్నాడు. కుటుంబ సభ్యులు ఏమైందని ప్రశ్నిస్తే తనను దెయ్యాలు, భూతాలు వెంబడిస్తున్నాయంటూ చెప్పేవాడు. సోమవారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. వేలాడుతూ కనిపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మామను హతమార్చిన అల్లుడు
► కిరాయి రౌడీలతో ఘాతుకం ► కుటుంబ కలహాలే కారణం ► విప్పర్ల గ్రామంలో ఘటన ► పరారీలో నిందితులు క్రోసూరు: కుటుంబ కలహాలతో మామను కిరాయి రౌడీలతో కలిసి హత్య చేసిన అల్లుడి ఉదంతమిది. ఈ ఘటన మండలంలోని విప్పర్ల గ్రామంలో సోమవారం వేకువజామున చోటుచేసుకుంది. బంధువుల కథనం మేరకు... సత్తెనపల్లి మండలంలోని గార్లపాడు గ్రామానికి చెందిన కొండవీటి వెంకటకృష్ణయ్య(63) కు భార్య, ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడున్నాడు. నలుగురు కుమార్తెలకు వివాహాలు చేసారు. నాల్గో కుమార్తె వాణిని మూడేళ్ల కిందట భట్టూరుకు చెందిన ఈదర అంకమ్మరావుతో వివాహం చేశారు. వాణి మానసికస్థితి సరిగా లేదని అంకమ్మరావు తరచూ అత్తమామలతో ఘర్షణ పడుతుండేవాడు. ఐదో కుమార్తెను తనకు ఇచ్చి పెళ్లి చేయాలని ఒత్తిడి చేయటం ప్రారంభించాడు. అల్లుడి ప్రతిపాదనను అత్తమామలు అంగీకరించకుండా కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల రోజుల నుంచి విప్పర్లల్లోని రెండో అల్లుడు ఇంట్లో ఉంటున్నారు. తన మాట వినటం లేదని మామపై అంకమ్మరావు కసిపెంచుకున్నాడు. కిరాయిరౌడీలను కారులో విప్పర్ల తీసుకొచ్చి వెంకటకృష్ణయ్య ఉన్న ఇంటి తలుపులు పగులగొట్టి లోనికి జొరపడ్డారు. ఇంట్లో ఉన్న వెంకట కృష్ణయ్య, కుటుంబసభ్యులందరూ భయాందోళనకు గురై వేరే గదుల్లోకి పోయి తలుపులు వేసుకున్నారు. ఆ తలుపులు కూడా పగలగొట్టి కృష్ణయ్యను బయటకు ఈడ్చు కొచ్చి బీర్జాల పై కొట్టిచంపినట్లు తెలిపారు. కుటుంబసభ్యులు వేసిన కేకలకు ఇరుపొరుగు జనం చేరుకున్నప్పటికీ వారిపై కూడా దాడి చేసి నిందితులు పారిపోయారు. సంఘటన గ్రామంలో కలకలం లేపింది. సత్తెనపల్లి డీఎస్పీ మధూసూదనరావు, సీఐ కొటేశ్వరరాావు, ఎస్ఐ ఏవీ బ్రహ్మం సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. -
బాబుకు మానసిక స్థితి సరిగా లేదు
టెక్కలి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మానసిక స్థితి సక్రమంగా లేదని అందుకే ప్రతిపక్ష పార్టీ ధాటికి తట్టుకోలేక దుష్ర్పచారాలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని వైఎస్సార్ సీపీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం అన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి దువ్వాడ నివాసంలో తమ్మినేని మాట్లాడుతూ పాలనలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిన చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీకు చెందిన నాయకులే ప్రజల ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారని ఆయన చెప్పారు. దీంతో పార్టీలో ఉండాలా వద్దా అనే సందిగ్ధంలో పడిన అధికార పార్టీ నాయకులు వలస ప్రవాహానికి సిద్ధంగా ఉన్నారని తమ్మినేని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ లో టీడీపీ టెంట్ ఖాళీ అయ్యిందని, కేవలం అవినీతి కథల సూత్రదారి రేవంత్ రెడ్డి మాత్రమే తెలంగాణ కు దిక్కుగా చంద్రబాబు అవినీతికి అండగా ఉన్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నీతి, నిజాయితీలు లేని ముఖ్యమంత్రిగాబాబుకు పట్టం కట్టవచ్చని విమర్శిం చారు. నియోజకవర్గ ఇన్చార్జి దువ్వాడ శ్రీనివాస్, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి దువ్వాడ వాణి, పార్టీ నాయకులు సంపతిరావు రాఘవరావు, బెండి గౌరీపతి, బి.కర్మవీరుడు, జి.మోహన్‌రెడ్డి, ఎస్.మోహన్, బి.చంద్రరావు, ఎ.తాతారావు, యు.విశ్వనాథం, చందు, ఉదయ్ పాల్గొన్నారు. ‘దళితులపై చిన్నచూపు తగదు’ ఆమదాలవలస: దళితులపై చిన్నచూపు చూస్తూ కులవివక్ష చేసి మాట్లాడడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం అన్నారు. శుక్రవారం పట్టణంలోని తన గృహంలో విలేకరులతో మాట్లాడుతూ దళితులను అపహాస్యం చేస్తూ బహిరంగంగా మాట్లాడడం సబబుకాదన్నారు. ఇందుకు నిరసనగా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు శనివారం అన్ని పట్టణాల్లోనూ, పల్లెల్లోనూ ఉన్న అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి నిరసనలు తెలుపుతామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆమదాలవలస పాతబస్టాండ్ ఆవరణలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి శనివారం ఉదయం 10 గంటలకు పాలాభిషేకం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మండలం, మున్సిపాలిటీల్లోని దళితులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
'మోదీ మానసిక పరిస్థితి సరిగాలేదు'
-
'మోదీ మానసిక పరిస్థితి సరిగాలేదు'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మానసిక పరిస్థితి సరిగాలేదని కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ విమర్శించారు. ఏళ్ల తరబడి దేశం సాధించిన విజయాలను మోదీ గుర్తించలేకపోతున్నారని అన్నారు. దేశం మొత్తం కుంభకోణాలకు పాల్పడినట్టుగా మోదీ వ్యవహరించడం సరికాదని ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. మోదీ ఇచ్చిన హామీలు అమలు కాలేదని, ఏడాది పాలనంతా ప్రచార ఆర్భాటమేనని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలను బీజేపీ ప్రభుత్వం పేరు, ప్యాకేజీ మార్చి ప్రచారం చేసుకుంటోందని ఆనంద్ శర్మ ఎద్దేవా చేశారు. మేకిన్ ఇండియా వంటి కార్యక్రమాలు ప్రచార నినాదాలుగానే మిగిలిపోయానని చెప్పారు. సంక్షేమం, విద్య వంటి పథకాలకు బడ్జెట్లో కోత విధించారని అన్నారు. అంతర్జాతీయంగా చమరు ధరలు తగ్గినా.. భారత్‌లో ఆ మేరకు ధరలు తగ్గలేదని చెప్పారు. యూపీఏ విజయాలను కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకోకపోవడం వల్లే ఓడిపోయామని ఆనంద్ శర్మ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఓటుకు 5 కోట్ల రూపాయల ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
పసిమొగ్గలకు వైద్యం అందించే.. పీడియాట్రిక్స్
చిన్నారులు.. పసిమొగ్గల్లాంటి సుకుమారులు. తమకు ఏదైనా బాధ కలిగితే చెప్పుకోవడానికి మాటలు రావు. తమ ఇబ్బందిని ఏడుపు ద్వారా మాత్రమే వ్యక్తం చేస్తారు. వారి జబ్బును గుర్తించి, తగిన చికిత్స చేయడానికి సాధారణ వైద్యులు సరిపోరు. ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్లు కావాలి. అలాంటివారే.. పీడియాట్రీషియన్లు. మనదేశంలో చిన్న పిల్లల వైద్యులకు భారీ డిమాండ్ ఉంది. ప్రతిఏటా కొత్తగా కేవలం 1400 మంది చిల్డ్రన్ స్పెషలిస్ట్‌లు వస్తున్నారు. నిజానికి అంతకు మూడు రెట్ల మంది అవసరం. అందుకే పీడియాట్రిక్స్‌ను కెరీర్‌గా ఎంచుకుంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. కొలువులకు కొరత లేదు విదేశాల్లో 18 ఏళ్లలోపు వారికి పీడియాట్రీషియన్లు వైద్యం అందిస్తారు. మనదేశంలో 14 ఏళ్లలోపు బాలలకు చికిత్స అందిస్తున్నారు. దేశంలోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ను తప్పనిసరిగా ఏర్పాటు చేస్తున్నారు. చిల్డ్రన్ స్పెషలిస్ట్‌లకు వీటిలో ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయి. సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవాలంటే కనీసం ఆరు, ఏడేళ్లపాటు ఏదైనా ఆసుపత్రిలో పనిచేయాల్సి ఉంటుంది. ఈ రంగంలో ప్రారంభం నుంచే భారీ వేతనాలు అందుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కొలువులు కోకొల్లలుగా ఉన్నాయి. వృత్తిలో అనుభవం గడించిన తర్వాత సొంతంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసుకోవచ్చు. పీడియాట్రీషియన్లకు విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. చిన్న పిల్లలకు వైద్యం అందించడం అంటే కత్తిమీద సాము లాంటిదే. ఇందులో ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. ప్రతిక్షణం అప్రమత్తంగా పనిచేయాలి. కావాల్సిన నైపుణ్యాలు: చిల్డ్రన్ స్పెషలిస్ట్‌కు చిన్నారులను ప్రేమించే లక్షణం, వారి ప్రవర్తనను, మానసిక స్థితిని అర్థం చేసుకొనే సామర్థ్యం ఉండాలి. పరిశీలనాత్మక దృక్పథం అవసరం. ఇతరులు చెప్పేది ఓపిగ్గా వినగలగాలి. చికిత్స ఫలించాలంటే ఎంతసేపైనా ఓపిక, సహనంతో పనిచేయాలి. వృత్తిలో ఎదురయ్యే సవాళ్లను, ఒత్తిళ్లను తట్టుకొనే నేర్పు చాలా ముఖ్యం. పీడియాట్రీషియన్‌గా వృత్తికి సంబంధించిన కొత్త విషయాలను నేర్చుకుంటూ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి. అర్హతలు: పీడియాట్రీషియన్‌గా వృత్తిలో స్థిరపడాలనుకుంటే బయాలజీ సబ్జెక్ట్‌తో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌లో చేరొచ్చు. ఎంబీబీఎస్ (జనరల్ సర్జన్) కోర్సులో ఉత్తీర్ణులై తర్వాత పీడియాట్రిక్ సర్జన్‌గా మూడేళ్లపాటు అదనంగా శిక్షణ పొందాల్సి ఉంటుంది. వేతనాలు: పిల్లల వైద్యులు ప్రభుత్వ రంగంలో ప్రారంభంలోనే నెలకు రూ.50 వేల వేతనం అందుకోవచ్చు. కొంత అనుభవం గడిస్తే నెలకు రూ.60 వేలు, సీనియర్లకు రూ.లక్ష వేతనం దక్కుతుంది. ప్రైవేట్ రంగంలో ప్రారంభంలో నెలకు రూ.35 వేల వేతనం పొందొచ్చు. సీనియర్లకు భారీ వేతన ప్యాకేజీలుంటాయి. ప్రైవేట్‌గా ప్రాక్టీస్ చేసుకుంటే పనితీరు, డిమాండ్‌ను బట్టి ఆదాయం ఆర్జించొచ్చు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: పోస్టుగ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వెబ్సైట్: http://pgimer.edu.in/ ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్) వెబ్సైట్: www.aiims.edu మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ-ఢిల్లీ వెబ్సైట్: www.mamc.ac.in క్రిస్టియన్ మెడికల్ కాలేజీ-వెల్లూర్ వెబ్సైట్: www.cmch-vellore.edu ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్-చెన్నై వెబ్సైట్: www.mmc.tn.gov.in జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వెబ్సైట్: http://jipmer.edu.in/ పిల్లలపై ప్రేమానురాగాలు ఉండాలి! ‘‘పీడియాట్రిక్స్‌లో నిపుణులకు మంచి డిమాండ్ ఉంది. ఈ కోర్సులు అభ్యసించిన వారికి విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ధనార్జన కోణంలో కాకుండా సేవాదృక్పథం, చిన్న పిల్లల పట్ల ప్రేమానురాగాలు ఉన్నవారు ఈ కెరీర్‌ను ఎంచుకోవాలి. చిన్నారుల ప్రవర్తనను అర్థం చేసుకుని, వ్యాధుల లక్షణాల ఆధారంగా వారి సమస్యను గుర్తించి చికిత్స చేయాల్సి ఉం టుంది. కాబట్టి పీడియాట్రీషియన్స్కు ఓపిక, సహనం ఎక్కువగా ఉండాలి. చిన్న పిల్లలకు సేవచేయడం ద్వారా వృత్తిపరమైన సంతృప్తి లభిస్తుంది’’- షర్మిళా అస్తానా, కన్సల్టెంట్ పీడియాట్రీషియన్, అపోలో హాస్పిటల్స్. -
సత్వం: పండిత్
జూలై 1న వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా జన్మదినం వేణుగానం చేయడమంటే శ్వాసను నియంత్రించడం. ఇంకోమాటలో యోగా చేయడం. ఒక పవిత్రమైన బాధ్యతతో, ఆధ్యాత్మిక మానసిక స్థితితో ఒక ధ్యానంలాగా యోగంలాగా నేను పాడతాను. హరిప్రసాద్ చౌరాసియా వేణుగానం చూస్తే- ఆ నాదం వాద్యంలోంచి మాత్రమే వచ్చినట్టు ఉండదు; మడిచిన పెదాలలోంచీ, ఆడే చేతివేళ్లలోంచీ మాత్రమే కాదు, వెన్నులోంచీ, జుట్టులోంచీ, మొత్తంగా ఆయన ఒంట్లోంచీ సంగీతం వెలువడినట్టుంటుంది. ‘కృష్ణభగవానుడితో నేరుగా అనుసంధానం కలిగిన వాద్యమిది. ఏ ఆడంబరం లేదు, ఏ తొడుగులు లేవు, ఏ తంత్రులు అక్కర్లేదు. వెదురు ముక్క చాలు. గాలిని నియంత్రించడానికి రంధ్రాలు! దేవుడు మాత్రమే ఇంత సరళమైన వాద్యాన్ని కనిపెట్టగలడు!’ అంటారు చౌరాసియా. ‘పైగా తీసుకెళ్లడం ఎంత సులభం’! ఒక వస్తాదు కొడుకుగా చౌరాసియా సంగీతంతో రహస్యంగా కుస్తీ పట్టాల్సివచ్చింది. కారణం, వాళ్ల నాన్నకు సంగీతమంటే వేశ్యలకు సంబంధించింది! తనలాగే కొడుకూ వస్తాదు కావాలని ఆయన కోరిక. నాలుగున్నరేళ్లప్పుడే అమ్మపోయింది కాబట్టి, నాన్నను ఒప్పించే మార్గం లేకపోయింది. గుడికి వెళ్తున్నానని చెప్పి స్నేహితుడింటికి వెళ్లేవారు. అక్కడ పాడటం సాధన చేసేవారు. పండిత్ రాజారామ్ ఆయనలో ప్రతిభ ఉందని గుర్తించి, బోధించడం మొదలుపెట్టారు. ‘పదిహేనేళ్ల వయసులో అలహాబాద్ రేడియోలో తొలిసారి వేణుగానం విన్నాను. స్వర్గానికి రవాణా అయినట్టుగా అనుభూతి చెందాను. అది నా జీవితంలో కీలకమలుపు,’ అంటారు చౌరాసియా. అంతే! అంత గొప్పగాలేని తన గాత్రానికి స్వస్తిచెప్పారు. ఆ వేణువూదిన పండిత్ భోలానాథ్‌ను వెతుక్కుంటూ వెళ్లి, గుమ్మంలో వాలిపోయారు. కూరగాయలు కోయడం, మసాలాలు నూరడానికైనా ఈ పిల్లాడు పనికొస్తాడని ఒప్పుకున్నారాయన. కానీ అదే భోలానాథ్ అచ్చెరువొందేలా, వేణువుకు సరికొత్త ఊపిరిలూదారు. వేణువు అర్హతగా ఒరిస్సా రేడియోలో ఉద్యోగం వచ్చినరోజున చౌరాసియా నాన్న ఆశ్చర్యపోయారు, దాచివుంచిన సంగతి గురించి! కానీ ఒప్పుకోక తప్పలేదు. అదే ఒరిస్సా రేడియో ఆయన్ని ‘బొంబాయి’ చేర్చింది. మదన్మోహన్, రోషన్ లాంటి సంగీతదర్శకులు ఆయన వేణుగానానికి సమ్మోహితులై సినిమాల్లోకి ఆహ్వానించారు. ఎస్ డి బర్మన్, ఆర్ డి బర్మన్‌తోనూ పనిచేశారు (తర్వాతి కాలంలో ‘సిరివెన్నెల’కు తన వేణువుతో ప్రాణం పోశారు). ‘బాలీవుడ్ అవకాశాలు నన్ను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశాయి. భవంతి సమకూరింది, కారు ముంగిట ఆగింది, భౌతిక అవసరాలు తీరాయి; కానీ ఒక అసంతృప్తి మొదలైంది. నేను కళాకారుడిగా ఎదగడం లేదు. నాకు ఇంకేదో కావాలి, నా ఆత్మ సుఖించడం లేదు,’ అని అప్పటి మథనం గురించి చెబుతారాయన. దాంతో ‘సుర్బహార్’ విద్వాంసురాలు అన్నపూర్ణాదేవిని కలిశారు. అప్పటికే పండిత్ రవిశంకర్‌నుంచి విడిగా ఉంటున్నారామె. బహిరంగ ప్రదర్శనలు మానేశారు. ఆమె చౌరాసియాను ముందు శిష్యుడిగా అంగీకరించలేదు. బయటికి తోసినంత పనిచేశారు. కానీ మూడేళ్లుగా చూపిస్తున్న ఆయన తపనకు తలొగ్గక తప్పలేదు. ‘నేను పట్టుదలతో ఉన్నానని తెలియజేయడానికి నా చేతుల్ని మార్చుకున్నాను. అంతకుముందు కుడిచేత్తో వాయించేవాడిని. ఎడమచేతికి మారిపోయాను. వెనక్కి చూడకుండా వెనక్కి తిరిగి నడవడం లాంటిదది. హింస! కానీ సంతోషం! ఆమె నాకు గురువు మాత్రమే కాదు, దేవతకన్నా ఎక్కువ. నా ఆకలి, ఆరోగ్యం పట్టించుకున్నారు. నా సంగీతానికి పరమార్థం కల్పించారు,’ అని తబ్బిబ్బవుతారు చౌరాసియా. ‘ఒక్కో క్షణం అద్భుతంగా ఉంటుంది. ఆ క్షణంలో సంగీతం ప్రవహిస్తుంది. ఒక నీటిచుక్క నువ్వు దాహంగా ఉన్నప్పుడు ఆర్తి తీర్చుతుంది. అదే బిందువు నీటియంత్రంలోంచి పైకి ఎగిరినప్పుడు దాని అందంతో మురిపిస్తుంది. మళ్లీ అదే చుక్క మురికినీరులో కలిసి అసహ్యం పుట్టిస్తుంది. అదే నీటిబిందువు నదిలో కలిసి ఈదే ఉత్సాహం కలిగిస్తుంది. అదే చుక్క సముద్రంలో కలిసినప్పుడు తన శక్తితో ఆశ్చర్యగొలుపుతుంది. ఇదంతా కూడా సంగీతంతో పలికించొచ్చు’. ‘వేణుగానం చేయడమంటే శ్వాసను నియంత్రించడం. ఇంకోమాటలో యోగా చేయడం. ఒక పవిత్రమైన బాధ్యతతో, ఆధ్యాత్మిక మానసిక స్థితితో ఒక ధ్యానంలాగా యోగంలాగా నేను పాడతాను. అసలు నేను శ్రోతలకోసమే పాడతాను. కానీ అందులో ఎన్నో రకాలవాళ్లుంటారు. వారందరినీ తృప్తి పరచడం సాధ్యం కాదు. వాళ్ల మధ్యలో ఒక గొప్ప శక్తి ఏదో కనబడుతుంది. అది మాధవుడే కావొచ్చు. ఆ శక్తికోసం నేను వేణువు పలుకుతాను. నాలోనేను దైవాన్ని అనుభవిస్తాను,’ అంటారు తన వేణుగానం గురించి. ‘సంగీతమే నా ప్రార్థన. సంగీతమే నా మతం’ అనే చౌరాసియాకు ఎక్కడా రికార్డుగా లేని కృష్ణుడి గానం వినలేదన్న చింత ఉందట! కానీ మనకా బాధ లేదు. -
బాలకృష్ణ మానసిక స్థితి ఎలా ఉందిప్పుడు: గట్టు
హైదరాబాద్: సినీనటుడు బాలకృష్ణ మానసికస్థితి బాగోలేదని గతంలో ఆస్పత్రులు ధ్రువీకరించినందుకు ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. బాలకృష్ణ మానసికస్థితి సాధారణంగానే ఉందని ఏ హాస్పిటల్ అయినా ధృవీకరణ పత్రం జారీ చేసిందా?, దానిని ఎన్నికల కమిషన్‌కు అందజేశారా? అని గట్టు అడిగారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం గట్టు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘బాలకృష్ణ మానసిక రోగి. సైకో సమస్యతో ఇబ్బంది పడుతున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు’ అని ఆయన అన్నారు. బాలకృష్ణ వంటి సైకోలకు టికెట్టు కేటాయించిన చంద్రబాబు అంతకంటే పెద్ద సైకో అయి ఉంటారని గట్టు దుయ్యబట్టారు. రియల్ సైకోలయిన చంద్రబాబు, బాలకృష్ణలు ఎదుటి వారిని సైకోలని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. బాలకృష్ణ మానసిక వ్యాధిగ్రస్తుడని ఆయన వైద్యం చేయించుకున్న ఆస్పత్రులే ధ్రువీకరించాయని, అందుకు సంబంధించిన పత్రాలు గట్టు మీడియాకు చూపించారు. ‘2004లో బాలకృష్ణ తన ఇంట్లో ఒక నిర్మాత, జ్యోతిష్కుడిపై కాల్పులు జరిపిన అనంతరం కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. బాలకృష్ణకు చికిత్స అందించిన డాక్టర్ ఎన్.కృష్ణారెడ్డి వెల్లడించిన హెల్త్ బులెటిన్‌లో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయన్నారు. బాలకృష్ణ మానసిక స్థితి బాగోలేదని వైద్యుల రిపోర్టులను ఉటంకిస్తూ అప్పుడు అనేక పత్రికలతో పాటు ‘ఈనాడు’లో కూడా వార్తలు వచ్చాయని గట్టు చూపించారు. బాలకృష్ణ మెంటల్ కండిషన్ బాగోలేదని హైదరాబాద్‌లోని ఐదు ఆస్పత్రులతో పాటు విశాఖ, ముంబాయి, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఆస్పత్రులు ధ్రువీకరించాయని గట్టు రామచంద్రరావు వెల్లడించారు. ‘జోధ్‌పూర్‌లో సినిమా షూటింగ్ సందర్భంగా అత్యంత ఎత్తుపై నుంచి దూకి దెబ్బలు తగిలించుకున్నారు. అప్పుడు చికిత్స అందించిన వైద్యులు కూడా అదే విషయం చెప్పారు. ‘మామూలు వ్యక్తి అంత ఎత్తు నుంచి దూకరు. మానసిక పరిస్థితి బాగోలేని వ్యక్తులే ఇలాంటి చర్యలకు పాల్పడుతారు’ అని చెప్పారన్నారు. బాలకృష్ణ మెంటల్ కండిషన్ ప్రస్తుతం కూడా అలాగే ఉంటే ప్రజాప్రతినిధిగా నామినేషన్ వేసే అర్హత ఉంటుందా? అని గట్టు ప్రశ్నించారు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, కన్న తండ్రిని మానసిక వేధింపులకు గురిచేసిన బాలకృష్ణ లాంటి వ్యక్తులకు మించిన సైకో మరొకరుండని గట్టు స్పష్టంచేశారు. గట్టు వెల్లడించిన ముఖ్యాంశాలు తన ఇంట్లో బాలకృష్ణ కాల్పులు జరిపిన అనంతరం తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించారని వెల్లడయ్యింది. సాధారణంగా డిప్రెషన్లో ఉండే వ్యక్తికి ఇవ్వాల్సిన డోస్ కంటే బాలకృష్ణకు పది రెట్లు ఎక్కువడోస్ ఇవ్వాల్సి వస్తోందని హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది. నిమ్స్‌లో బాలకృష్ణకు చికిత్స సందర్భంగా ఆస్పత్రి డెరైక్టర్ కాకర్ల సుబ్బారావు... ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి సైకియాట్రిస్ట్‌ల బృందం నిమ్స్‌లో వారం రోజుల పాటు చికిత్స చేయాలని ఆదేశించింది. అంతేకాదు మానసిక చికిత్సను మునుముందు కూడా కొనసాగించాల్సిందేనని డాక్టర్లు పేర్కొన్నారు.