టెక్కలి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మానసిక స్థితి సక్రమంగా లేదని అందుకే ప్రతిపక్ష పార్టీ ధాటికి తట్టుకోలేక దుష్ర్పచారాలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని వైఎస్సార్ సీపీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం అన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి దువ్వాడ నివాసంలో తమ్మినేని మాట్లాడుతూ పాలనలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిన చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీకు చెందిన నాయకులే ప్రజల ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారని ఆయన చెప్పారు.
దీంతో పార్టీలో ఉండాలా వద్దా అనే సందిగ్ధంలో పడిన అధికార పార్టీ నాయకులు వలస ప్రవాహానికి సిద్ధంగా ఉన్నారని తమ్మినేని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ లో టీడీపీ టెంట్ ఖాళీ అయ్యిందని, కేవలం అవినీతి కథల సూత్రదారి రేవంత్ రెడ్డి మాత్రమే తెలంగాణ కు దిక్కుగా చంద్రబాబు అవినీతికి అండగా ఉన్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నీతి, నిజాయితీలు లేని ముఖ్యమంత్రిగాబాబుకు పట్టం కట్టవచ్చని విమర్శిం చారు. నియోజకవర్గ ఇన్‌చార్జి దువ్వాడ శ్రీనివాస్, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి దువ్వాడ వాణి, పార్టీ నాయకులు సంపతిరావు రాఘవరావు, బెండి గౌరీపతి, బి.కర్మవీరుడు, జి.మోహన్‌రెడ్డి, ఎస్.మోహన్, బి.చంద్రరావు, ఎ.తాతారావు, యు.విశ్వనాథం, చందు, ఉదయ్ పాల్గొన్నారు.
‘దళితులపై చిన్నచూపు తగదు’
ఆమదాలవలస: దళితులపై చిన్నచూపు చూస్తూ కులవివక్ష చేసి మాట్లాడడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం అన్నారు. శుక్రవారం పట్టణంలోని తన గృహంలో విలేకరులతో మాట్లాడుతూ దళితులను అపహాస్యం చేస్తూ బహిరంగంగా మాట్లాడడం సబబుకాదన్నారు.
ఇందుకు నిరసనగా పార్టీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు శనివారం అన్ని పట్టణాల్లోనూ, పల్లెల్లోనూ ఉన్న అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి నిరసనలు తెలుపుతామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆమదాలవలస పాతబస్టాండ్ ఆవరణలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి శనివారం ఉదయం 10 గంటలకు పాలాభిషేకం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మండలం, మున్సిపాలిటీల్లోని దళితులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
బాబుకు మానసిక స్థితి సరిగా లేదు
Published Sat, Feb 20 2016 12:20 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM
Advertisement