mind game
-
కోహ్లిని ఔట్ చేయాలంటే ఇలా చేయాల్సిందే: స్టెయిన్
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ప్రారంభమైంది. అటు మాజీ ఆటగాళ్లు ఈ ప్రతిషష్టాత్మక పోరులో పాల్గొంటున్న ఇరు దేశాల బలా,బలహీనతలపై విశ్లేషిస్తూ వారి అనుభవాలను వెల్లడిస్తున్నారు. తాజాగా సౌతాఫ్రికా మాజీ స్పీడ్‌స్టర్ డేల్ స్టెయిన్ భారత కెప్టెన్ విరాట్ కోహ్లిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా స్టెయిన్ మాట్లాడుతూ.. కోహ్లిని ఔట్ చేయాలంటే అంత సులువు కాదని కచ్చితమైన ప్రణాళిక అవసరమని తెలిపాడు. గతంలో వీరిద్దరు ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తరపున కలిసి ఆడారు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ లాంటి ప్రతిష్టాత్మకమైన మ్యాచ్‌లో కోహ్లిలాంటి ఆటగాడిని త్వరగా ఔట్ చేయకపోతే మ్యాచ్ విజయంపై అవకాశాలు తగ్గుతాయని స్టెయిన్ సూచించారు. కాగా కోహ్లిని ఔట్ చేయాలంటే మైండ్‌గేమ్స్ తప్పవని తెలిపాడు. కచ్చితంగా మైండ్‌గేమ్స్ ఆడాల్సిందేనని పేర్కొంటూ.. నేను షార్ట్‌లెగ్‌లో ఒక ఫీల్డర్‌ను పెట్టేందుకు చూసే వాడిని, అలాగే బంతులను అతని శరీరానికి, ప్యాడ్లకు గురిపెట్టి వేసేవాడిని. అదే క్రమంలో బంతులు వేగంగా విసురుతానని అతడికి తెలిసేలా చేసేవాడిని. ఎందుకంటే ఏ బ్యాట్స్‌మెన్ అయినా తొలి 15 -20 బంతులును ఎదుర్కోవడంలో ఇబ్బంది పడతారని కనుక ఆ సమయంలో వికెట్ కోసం ప్రయత్నించాలని అని స్టెయిన్ అన్నారు. చదవండి: క్రికెట్‌ను ఆటగా కాకుండా మతంలా మార్చిన ఆ ఇన్నింగ్స్‌కు 38 ఏళ్లు.. -
మైండ్ గేమ్
చేతనబడి దెయ్యాన్ని దేనికోసమైనా వాడుకోవచ్చు. మంత్రగాళ్లు నాలుగు రాళ్లు వెనకేసుకోడానికీ... మామిడి కాయలు రాలకుండా ఉండడానికీ...మైండ్ గేమ్ ఆడుకోడానికీ, పాడుకోడానికీ... దెయ్యాన్ని వాడుకోవచ్చు. కానీ ‘మారాల’ ఊరి యువత.. దెయ్యం మాయలో పడలేదు. దారి కాశారు... మాటు వేశారు. అసలు దెయ్యం ఎవరో కనిపెట్టారు. అది అనంతపురం జిల్లా మారాల గ్రామం. ఊరికి దూరంగా ఉంటూ, ఊరితో సంబంధం ఉన్నట్లే ఉంటాయి తండాలు. బోడే నాయక్ తండా కూడా అలాంటిదే. తండాలో మంచిబావి, తండాకు ఆనుకుని తోటలు, అందరికీ చేతిలో పని ఉంటుంది. ఒక హ్యాబిటేషన్‌లో జనం ప్రశాంతంగా జీవించడానికి అనువైన వాతావరణమనే చెప్పాలి. ఏ ఉపద్రవాలూ లేకపోతే ఏదో ఒక ఉపద్రవాన్ని మనమే సృష్టించుకుంటాం. అది మనుషుల నైజం. పగలంతా పని చేసుకుని రాత్రి భోజనం చేసి మంచాల మీద పడుకున్న తర్వాత నిద్ర వచ్చే వరకు మాట్లాడుకోవడానికి ఓ టాపిక్ కావాలి. అది గాసిప్ అయినా ఫరవాలేదు. కిష్టప్ప భోజనం చేసి మంచం మీద పడుకున్నాడు. ఎండాకాలం ఉక్కపోత. ఎంతకీ నిద్రరావడం లేదు. ‘రే య్! నువ్వు ఇయ్యాల బాలమోళ్ల తోపులోకి పనికిపోయావంట’ అంటూ మరో మంచం మీదున్న తమ్ముడిని పలకరించాడు. ‘ఆ’ అంటూ అటు తిరిగి పడుకున్నాడు మారెప్ప. ‘ఇంకెప్పుడూ అటెల్లకు, రాత్రయితే అసలే ఎల్లకు. దెయ్యం తిరుగుతోందక్కడ’ అనేసి పక్కకు తిరిగి నిద్రకుపక్రమించాడు. నిద్రలోకి జారుకుంటున్న మారెప్ప దిగ్గున లేచి కూర్చున్నాడు. నిద్ర గాలికెగిరిపోయింది. పగలంతా ఆ తోపులోనే పనిచేసి వస్తిని... ఏమౌవుతుందో ఏమో! మంచం దిగాడు, తనతోపాటు ఆ రోజు తోపులోకి పనులకొచ్చిన వాళ్లను నిద్రలేపడానికి వెళ్లాడు. అంతా కలిసి బాలమోళ్ల తోపు కనిపించేటట్లు ఒక చోట మాటు వేశారు. ‘అదుగో వెళ్తోంది’ అంటూ చేయి చూపించారొకరు. జుట్ట ‘విరబోసుకుని ఉంది’ మరొకరు తాను గమనించిన విశేషణాన్ని తెలియచేశారు. ‘మీ అన్న చెప్పింది నిజమేరా!’ అంటూ వణికిపోయాడు అసలేమీ చూడని ఓ కుర్రాడు. ‘తోపులో దెయ్యం తిరుగుతోంది’ అని ఊరంతా పొక్కిపోయింది. దాదాపుగా అందరిలో లీలగా ఉన్న అనుమానం బలపడింది. ఆ తోటల వాళ్లకూ భయం పట్టుకుంది. ఎవరికీ చెప్పుకోకుండా ఎవరి తోటను వాళ్లు రాత్రిళ్లు కాపలా కాసుకోసాగారు. ఓ రోజు విరూపాక్షరెడ్డి దెయ్యం తన తోటలోకి పోవడాన్ని చూశాడు. మరో రోజు ఎల్లప్ప తోపులోకి వెళ్లడాన్ని కూడా చూశాడు. ఆ సంగతిని ఎన్నో రోజులు మనసులో దాచుకోలేక ఓ రోజు ఎల్లప్పతో చూచాయగా బయటపెట్టాడు. తానూ చూశానన్నాడు ఎల్లప్ప. తోటల యజమానులకు దెయ్యం పెద్ద సవాల్‌గానే అనిపించింది మొదట్లో. మెల్లగా ఆ దెయ్యం భయాన్ని పెంచి పోషించారు. ఆ పుకారుతో కాపును దొంగలబారి నుంచి కాపాడుకోవచ్చనేది వారి వ్యూహం. ప్రతి చర్యకూ ఓ ప్రతి చర్య ఉన్నట్లే... ప్రతి పనికీ ఎవరి లెక్కలు వారికుంటాయి. దెయ్యం తిరుగుతుందన్న భయంతో చీకటి పడితే తోటల పరిసరాల్లో మనుషులు మెదలడం లేదు. ఇక ఆ తండాలో రాత్రి ఎనిమిది అవుతుందో లేదో అన్ని ఇళ్ల తలుపులూ బిగించుకుంటున్నాయి. అప్పటి వరకు అర్ధరాత్రి తర్వాత కనిపించిన దెయ్యం, తొమ్మిదింటికే కనిపించసాగింది. తోటల్లో తిరిగే దెయ్యం ఆ తండా ఆచారి ఇంటి పరిసరాల నుంచి వస్తోందని, కాదు కాదు గుడిలో ఉంటోందని ఒకరు, ఊరి దిగుడు బావిలో నుంచి అర్ధరాత్రి బయటకొస్తోందని ఒకరు చెప్పసాగారు. తెల్లవారు జామున బావికెళ్లి నీళ్లు తెచ్చుకోవాలంటే భయం, తోటల్లో, పంట పొలాల్లోకి పనులకెళ్లాలంటే భయం, మిట్టమధ్యాహ్నం అయినా భయమే, కనుచూపు మేరలో మనిషి కనిపించకపోతే చాలు... దెయ్యం కనిపిస్తుందేమోనని భయం. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టాలంటే భయపడుతున్నారు తండా వాసులు.. ఇలాగైతే లాభం లేదు. ఊరు ఊరంతా ఏ పనీ చేయకుండా చేతులు ఒళ్లో పెట్టుకుని భయంతో వణికిపోతూ ఉంటే కడుపులోకి అన్నం వెళ్లేదెలాగంటూ తండా పెద్దలు కార్యరంగంలోకి దిగారు. ‘దెయ్యాన్ని తరిమేయాలి’ తీర్మానించారంతా. ఒక్కొక్కరు తమకు తెలిసిన మంత్రగాళ్ల పేర్లు చెప్పసాగారు. అరివీరభయంకర మంత్రగాడు, దెయ్యాలకు సింహస్వప్నం లాంటి మంత్రగాడనే పేరున్న ఓ మంత్రగాడిని పిలిపించారు. ఈ విషయంలో ఊరంతా ఐకమత్యంతో పని చేసింది. సామూహికంగా జాతర చేశారు. మేకపోతును బలి ఇచ్చి ఊరి చుట్టూ ధార పోశాడు మంత్రగాడు. ఆకాశంలోకి చూస్తూ ‘అష్టదిగ్బంధనం చేశాను. ఇక ఈ గీత దాటి ఊళ్లోకి రావడానికి వీల్లేద’ంటూ కళ్లు ఉరుముతూ దెయ్యాన్ని ఆజ్ఞాపించాడు. తనకు రావాల్సిన డబ్బు, వాయనాలందుకుని వెళ్లిపోయాడు. ఊరంతా హాయిగా నిద్రపోయింది. అదీ రెండు రోజులే. మూడో రోజు మళ్లీ జుట్టు విరబోసుకున్న దెయ్యం తోటల్లో తిరుగుతోంది. ఇంతకీ ఏం జరుగుతోంది? ఇది ఆ తండాలో అభ్యుదయకోణంలో ఆలోచించే యువకులకు వచ్చిన ప్రశ్న. ‘యంగ్ ఇండియా’ ప్రాజెక్టు చురుగ్గా పని చేస్తున్న యువకులు ఏకమయ్యారు. దెయ్యం మిస్టరీ చేధించాలనుకున్నారు. వారి ప్రణాళిక అమలు చేయడానికి వేదిక కావాలి. ఆ ఊరి మొత్తానికి ఒకటే మిద్దె ఇల్లు. ఆ ఇంటి వారిని ఒప్పించి యువకులంతా రాత్రి అక్కడే మకాం వేశారు. మధ్య రాత్రిలో భాస్కర్ చేతులు చరుస్తూ ‘అదిగో వెళ్తోంది’ అని ఒక్కసారిగా అరిచాడు. మిగిలిన వారంతా అప్రమత్తం అయ్యారు. ‘ఆచారి శేషయ్య ఇంట్లో నుంచి వచ్చి, దిగుడుబావి దగ్గరకు వెళ్తోంది’ అన్నాడు భాస్కర్. అంతా చూస్తూనే ఉన్నారు, కొంతసేపటికి బావిలో నుంచి బయటకొచ్చి చీనీ తోటలోకెళ్లింది దెయ్యం. ‘వెనుకే వెళ్లి చూద్దాం’ అన్నాడో యువకుడు. అనుసరించడానికి కొందరికి ధైర్యం చాలడం లేదు. ఈ మీమాంసలో దెయ్యం మాయమైంది. మిస్టరీ వీడింది! మరుసటి రోజు రాత్రి కూడా నిఘా వేశారు. మళ్లీ అదే ఇంటి నుంచి మొదలైంది. ఈ రెక్కీ నాలుగు రోజులు సాగింది. ఓ రోజు బావిలో నుంచి వచ్చి నేరుగా గుడిదారి పట్టింది. నిశ్శబ్దంగా అనుసరించారు యువకులంతా. గుళ్లో కెళ్లగానే యువకులంతా ఆశ్చర్యంగా నోరు తెరిచారు. ఆచారి ఇంటికి వెళ్లి చెప్పారు. ఆ సంగతి అతడికీ ఆశ్చర్యమే. బాధను తమాయించుకుని జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇచ్చాడు. ఊళ్లో అందరికీ చెప్పి అల్లరి చేయవద్దని బతిమలాడాడు. ఆ తర్వాత మారాల గ్రామం, బోడేనాయక్తండాలో ఎవరికీ దెయ్యం కనిపించలేదు. గుళ్లో ఏం కనిపించింది? ఆచారి శేషయ్యకు మానసిక పరిణతి లేని ఓ చెల్లెలు, పేరు నీలమ్మ. యువకులు అనుసరిస్తూ వెళ్లి చూసేటప్పటికి ఆమె గుళ్లో తులసికోట ముందు కూర్చుని ఉంది. దగ్గరకు వెళ్లి ‘నీలమ్మా!’ అని పిలవగానే ఉలిక్కిపడింది. భయంతో బిగుసుకుపోయింది. ఆమెకు ఇంటికి వెళ్దాం అని నచ్చచెప్పి ఇంటికి తీసుకెళ్లి అన్నావదినలకు అప్పగించారు యువకులు. ఆకలి తీరకనే! నీలమ్మను ఇంట్లో ఎవరూ పట్టించుకునే వారుకాదు. ఆమె ఆలయానికెళ్లి పూజారులు పళ్లేలలో పెట్టిన బెల్లం పొంగలి, కొబ్బరి, అరటి పండ్లు తిని ఆకలి తీరాక ఇల్లు చేరేది. గుళ్లో ప్రసాదాలు దొరక్కపోతే తోటల్లోకెళ్లి కాయలు కోసుకుని తినేది. మధ్యలో ఎక్కడ ఫిట్స్ వస్తే అక్కడే పడిపోయేది. తెలివి వచ్చాక ఇంటికెళ్లేది. మేమంతా మిద్దె ఇంటి మీద ఒక్కొక్కరు రెండు గంటలు నిద్రమేల్కొని కాపలా కాసి మిస్టరీ ఛేదించాం. - ఎస్. శంకర శివరావు కన్వీనర్, జెవివి నేషనల్ మేజిక్ కమిటీ - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అదీ బాబు మైండ్ గేమ్‌లో భాగమే...
ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి సాక్షి ప్రతినిధి, విజయనగరం : తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అవుతుండటంతో పాలుపోని చంద్రబాబు ఏపీలోని ప్రజల దృష్టి మరల్చేందుకు మైండ్‌గేమ్ ఆడుతున్నారని విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఎంఎల్సీ కోలగట్ల వీరభద్రస్వామి వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే పలు చానెళ్లలో పదిమంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేయించుకుంటున్నారని చెప్పారు. సోమవారం సాయంత్రం ఆయన సాక్షితో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పీఎసీ చైర్మన్‌గా ఉన్న భూమా నాగిరెడ్డి ఎందుకు పార్టీ మారుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఆయన వెళ్లడంవల్ల సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్కసారిగా పీఎం అయిపోలేరనీ, ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డికి ఎటువంటి నష్టం వాటిల్లదనీ పేర్కొన్నారు. కేవలం ఉనికిని కాపాడుకునేందుకే చంద్రబాబు ఈ డ్రామాలాడుతున్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. -
బాబుకు మానసిక స్థితి సరిగా లేదు
టెక్కలి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మానసిక స్థితి సక్రమంగా లేదని అందుకే ప్రతిపక్ష పార్టీ ధాటికి తట్టుకోలేక దుష్ర్పచారాలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని వైఎస్సార్ సీపీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం అన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి దువ్వాడ నివాసంలో తమ్మినేని మాట్లాడుతూ పాలనలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిన చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీకు చెందిన నాయకులే ప్రజల ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారని ఆయన చెప్పారు. దీంతో పార్టీలో ఉండాలా వద్దా అనే సందిగ్ధంలో పడిన అధికార పార్టీ నాయకులు వలస ప్రవాహానికి సిద్ధంగా ఉన్నారని తమ్మినేని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ లో టీడీపీ టెంట్ ఖాళీ అయ్యిందని, కేవలం అవినీతి కథల సూత్రదారి రేవంత్ రెడ్డి మాత్రమే తెలంగాణ కు దిక్కుగా చంద్రబాబు అవినీతికి అండగా ఉన్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నీతి, నిజాయితీలు లేని ముఖ్యమంత్రిగాబాబుకు పట్టం కట్టవచ్చని విమర్శిం చారు. నియోజకవర్గ ఇన్చార్జి దువ్వాడ శ్రీనివాస్, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి దువ్వాడ వాణి, పార్టీ నాయకులు సంపతిరావు రాఘవరావు, బెండి గౌరీపతి, బి.కర్మవీరుడు, జి.మోహన్‌రెడ్డి, ఎస్.మోహన్, బి.చంద్రరావు, ఎ.తాతారావు, యు.విశ్వనాథం, చందు, ఉదయ్ పాల్గొన్నారు. ‘దళితులపై చిన్నచూపు తగదు’ ఆమదాలవలస: దళితులపై చిన్నచూపు చూస్తూ కులవివక్ష చేసి మాట్లాడడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం అన్నారు. శుక్రవారం పట్టణంలోని తన గృహంలో విలేకరులతో మాట్లాడుతూ దళితులను అపహాస్యం చేస్తూ బహిరంగంగా మాట్లాడడం సబబుకాదన్నారు. ఇందుకు నిరసనగా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు శనివారం అన్ని పట్టణాల్లోనూ, పల్లెల్లోనూ ఉన్న అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి నిరసనలు తెలుపుతామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆమదాలవలస పాతబస్టాండ్ ఆవరణలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి శనివారం ఉదయం 10 గంటలకు పాలాభిషేకం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మండలం, మున్సిపాలిటీల్లోని దళితులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
అక్కడ అడ్రస్ గల్లంతైనందునే.. ఇక్కడ మైండ్‌గేమ్
టీడీపీ తీరుపై చిత్తూరు ఎమ్మెల్యే నారాయణస్వామి మండిపాటు కాకినాడ : తెలంగాణలో అడ్రస్ గల్లంతవుతున్న తెలుగుదేశం పార్టీ.. ఈ ప్రాంతంలో పార్టీని కాపాడుకునేందుకే.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారంటూ మైండ్‌గేమ్ ఆడుతోందని వైఎస్సార్సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి విమర్శించారు. కాకినాడ వచ్చిన ఆయన శనివారం విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్లినా కేడర్ బలంగా ఉందని బీరాలు పలుకుతూ, ఇక్కడ మాత్రం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారంటూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎంత నమ్మక ద్రోహం చేస్తే టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వదిలి టీఆర్ఎస్లోకి వెళ్తారో సీఎం తనయుడు లోకేష్ గ్రహించాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రజలతోను, ప్రజలు తమ పార్టీతోను ఉన్నారని, ఏ ఒక్కరూ పార్టీని వీడే ప్రసక్తే లేదని నారాయణస్వామి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలకు టిక్కెట్లు ఖరారు చేస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇస్తే.. 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే తాము ఎప్పుడూ ఇలాంటి ప్రచారం చేసుకోలేదని అన్నారు. రాజకీయ అజ్ఞానంతో, తమ అనుకూల పత్రికలతో తప్పుడు రాతలు రాయిస్తున్నారని విమర్శించారు. అన్ని మతాలనూ ఆదరించే హిందూ మతాన్ని సైతం రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిట్ట అని, అందుకు గోదావరి పుష్కరాల సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరే నిదర్శనమని అన్నారు. దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి తనయుడికీ లేని ఆదరణ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్రెడ్డికి ఉందని, ఎక్కడికి వెళ్లినా ఆయనను తమ కుటుంబంలోని పెద్ద కుమారుడిలా ఆదరిస్తున్నారని, దేశ చరిత్రలోనే ఇదో గొప్ప విషయమని అన్నారు. కులాలను రెచ్చగొట్టి పరిపాలన సాగించడంలో చంద్రబాబే దిట్టని విమర్శించారు. ముద్రగడ ఉద్యమాన్ని సైతం జగన్మోహన్రెడ్డి వెనక ఉండి నడిపించారంటూ తప్పుడు విమర్శలు చేశారని నారాయణస్వామి అన్నారు. -
అనుమానం పెనుభూతం
చేతనబడి అన్నదమ్ముల మధ్యలో అనుమానపు మంత్రం వేశారు. ధూపం వేసి పెనుభూతం చేశారు. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్ ఆడుకున్నారు. చేతివాటంతో ఆస్తులు హరించారు. అది సికింద్రాబాద్‌లో ఓ గల్లీ. ఓ ఇంటి ముందు జనం బారులు తీరి ఉన్నారు. అందరి ముఖాల్లోనూ ఆందోళన, ఆశాభావం, మరికొంత అస్థిమితం కనిపిస్తున్నాయి. వారిలో యాదగిరి, అతడి భార్య సావిత్రి దంపతులు తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. విపరీతంగా భయపడుతున్న యాదగిరికి ధైర్యం చెబుతోంది సావిత్రి. ఇంతలో వారి వంతు రానే వచ్చింది. లోపలికి వెళ్లారు. చిన్న పిల్లలు భయపడేటట్లు ఉంది అక్కడి వాతావరణం. పసుపు కుంకుమల రాశులు, నిమ్మకాయల గంప, తాయెత్తుల పళ్లెం, ఓ త్రిశూలం, వాటి ఎదురుగా ఓ మంత్రగత్తె. జుట్టు విరబోసుకుని, కళ్లు విప్పార్చి భయానకంగా ఉంది. యాదగిరి దంపతులు వెళ్లి కూర్చోగానే అతడిని నఖశిఖ పర్యంతం చూసి, వేళ్లను లెక్కించింది మంత్రగత్తె.. అతడి ముఖంలోకి పరీక్షగా చూసింది. గాల్లోకి చూస్తూ అతీంద్రియ శక్తితోనో మంతనాలు జరిపినట్లు హావభావాలు పలికించి... నింపాదిగా... ‘నీకెవరో చేతబడి చేశారు, అందుకే ఈ అనారోగ్యం’ అన్నది. అంతే... భార్యాభర్తలిద్దరూ ‘మనం అనుకున్నది నిజమే’ అన్నట్లు ముఖముఖాలు చూసుకున్నారు. సనైన చోటకే వచ్చాం, ఇక కష్టం తీరినట్లే అనుకుని సమాధానపడ్డారు. వారి కష్టం తీరాలంటే చేతబడికి విరుగుడు పూజ చేయాలి. అందుకు పది నుంచి ఇరవై వేలవుతుంది- మంత్రగత్తె మాటల్ని మంత్రముగ్ధులై విన్నారా దంపతులు. మంత్రగత్తె మాటల్ని అంతగా నమ్మిన యాదగిరి నేపథ్యం ఏమిటంటే... అన్నదమ్ముల అనుబంధం అతడిది నల్గొండ జిల్లా, రామన్నపేట మండలంలో నెర్నెమల గ్రామం. అత్యంత సామాన్యమైన ఊరు. ఎవరైనా ఏ క్లర్కుగానో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంటే వారికి కలెక్టర్‌కి లభించినత గౌరవాలు. ఊళ్లో ఎవరికి సర్కారాఫీసుకెళ్లాల్సిన అవసరం వచ్చినా అందరికీ కనిపించేది ఆ ఉద్యోగి మాత్రమే. అలాంటి నెర్నెమలలో నలుగురు అన్నదమ్ముల్లో రెండవ వాడు యాదగిరి. పెద్దన్న వ్యవసాయం చేస్తాడు. యాదగిరికి వ్యవసాయంతోపాటు గొర్రెల పెంపకం కూడా ఉంది. మూడవ సోదరుడు నర్సింహ చిన్న ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరయ్యాడు. ఇక చిన్న తమ్ముడు సేద్యం, పాల వ్యాపారంలో బాగానే రాణిస్తున్నాడు. ఎవరి ఉపాధి వారిది, ఎవరి కుటుంబం వారిది. విడివిడిగా జీవిస్తూ కలివిడిగా ఆత్మీయతలు పంచుకునేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఐకమత్యానికి మారుపేరు వారే అన్నట్లుండేవి నాలుగు కుటుంబాలు ఒకప్పుడు. మరి ఇప్పుడేమైంది? యాదగిరికి స్వల్ప అనారోగ్యం. కాళ్లునొప్పులు, నీరసం తప్ప మరే సూచనలూ లేవు. ఈ లక్షణాలకు డాక్టరు దగ్గరకు వెళ్లాలనిపించలేదు వారెవ్వరికీ. తెలిసిన మంత్రగాడి దగ్గరకు తీసుకెళ్లాడు నర్సింహ. ఎన్ని వారాలు గడిచినా నీరసం తగ్గడం లేదు. ఆ తమ్ముడే ఏదో కీడు చేయించి తనకు తెలిసిన మంత్రగాడి దగ్గరకే తీసుకెళ్తున్నాడని సావిత్రి బంధువుల అనుమానం. మరో మంత్రగాని దగ్గరకు వెళ్తే తప్ప జబ్బు నయం కాదన్నారు. పుట్టింటి బంధువుల సూచన శిరోధార్యం అయింది సావిత్రికి. యాదగిరికి కూడా తమ్ముడి మీద అనుమానం వచ్చింది. అనుమానపుబీటలు ఆత్మీయతను దూరం చేశాయి. నర్మింహకు తెలియని చోట వైద్యం చేయించుకోవాలని సికింద్రాబాద్ చేరారా దంపతులు. పూజలు, తవ్వకాలు! ఇద్దరు అనుచరులతో టాటా సుమో ఎక్కి నెర్నెమల దారి పట్టింది సికింద్రాబాద్ మంత్రగత్తె. యాదగిరి ఇంటి పెరడే పూజకు వేదిక. మంత్రగత్తె ఒక చోటును చూపించి నలుచదరంగా ముగ్గుపోసింది. అనుచరులు తవ్వడం మొదలుపెట్టారు. మంత్రగత్తె పసుపు - కుంకుమలు చల్లుతూ మంత్రాలు చదువుతోంది. గజం లోతు తవ్వాక ఆగారు. ‘ఇంకా తవ్వండి’ పూనకంతో ఊగిపోతూ అన్నదామె. అనుచరులు పని కొనసాగించారు. పలుగుకేదో తగిలింది. పని ఆపి ఆమెకేసి చూశారు. ‘దొరికావా’ అంటూ నాటకీయంగా గుంటలో చేయిపెట్టి ఓ మూటను తీసింది. పాత గుడ్డతో కట్టిన ఆ మూటలో పసుపు, కుంకుమ, చచ్చి ఎండి పోయిన కప్ప, చిన్న ఎముక, నల్లదారాలు, ఎండిన నిమ్మకాయలు, తాయెత్తులు ఉన్నాయి. వాటిని చూడగానే యాడగిరి, సావిత్రి నిలువెల్లా వణికి పోయారు. మంత్రగత్తె విజయం సాధించినట్లు ముఖం పెట్టింది. ‘మీ మీద చేయించిన చేతబడి ఇదే’నంది. నమ్మడానికి సిద్ధంగా ఉన్న వారికి అంతకంటే గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు. తిరుగు పూజ చేయాలి! అవును. చేతబడికి విరుగు పూజ చేయకపోతే మీ అందరి ప్రాణాలు పోతాయి. పీడ ఊరందరి మీద చెలరేగి పోతుంది. బయటకు తీసిన నన్ను కూడా బతకనివ్వదు... కాబట్టి విరుగుడు పూజ చేయాలి. అందుకు మూడు లక్షలవుతుంది- అన్నదా మంత్రగత్తె. అంత డబ్బు మావల్ల కాదనడంతో లక్షన్నరకు బేరం కుదిరింది. డబ్బు తీసుకుని యాదగిరి ఇంటినుంచి బయటపడుతుంటే పొట్టేళ్లు కంటపడ్డాయి. దేవతకు బలిస్తానంటూ ఓ పొట్టేలును కూడా తీసుకెళ్లిందామె. పిటీ ఏంటంటే... ఆ లక్షన్నరతో రోగం కుదరలేదు. చేతబడి మూట వెలికి తీసి రెండు వారాలైనా అనారోగ్యం ఏ మాత్రం తగ్గడం లేదు. దాంతో మరో పూజకు రంగం సిద్ధమైంది. మీకింకా ఎక్కడెక్కడ స్థలాలు, ఇళ్లు ఉన్నాయంటూ ఆరా తీసిందామె. యాదగిరికి భువనగిరిలో ఉన్న ప్లాట్‌లో కూడా ఇదే తంతు. నేల తవ్వడం, పాతగుడ్డ మూట తీయడం, తిరుగు పూజకు మరో లక్షన్నర పట్టుకెళ్లడం జరిగిపోయాయి. అయినా నయం కాలేదు. ఇంకేం చేయాలి? బంధువుల ఇళ్ల మీదకు మళ్లిందామె చూపు. అల్లుడింటి ఆవరణలో తవ్వి మరో లక్షన్నర వసూలు చేసింది. ఈ క్రమం ఎంతవరకు వెళ్లేదో, ఏ అనర్థానికి దారి తీసేదో. ఇంతలో... అన్న సం‘గతి’ ఏంటో? నర్సింహ చైతన్యవంతమయ్యాడు. మిగిలిన సోదరులంతా ఏకమయ్యారు. ముఖ్యంగా ఈ అనర్థాలు ఇలాగే కొనసాగితే అన్న అప్పుల పాలవుతాడు. అసలే ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తోంది. జనవిజ్ఞానవేదిక కార్యకర్తల దగ్గరకు వచ్చి ‘నిజానికి చేతబడికి విరుగుడు ఉంటుందా. విరుగుడు పూజ చేసినా ఆరోగ్యం కుదుటపడలేదు. ఇదిలా కొనసాగితే అన్న మరణిస్తాడేమో, ఒకవేళ అదే జరిగితే ఊరు ఊరంతా మేము చేతబడి చేసి అన్నయ్యను చంపేశామని నిందిస్తుంది. నిజానికి మాకే పాపమూ తెలియదు. దీనికి పరిష్కారమెలా’ అని గోడు వెళ్లబోసుకున్నారు. నీరసం ఎందుకంటే... అతడు బాధపడుతున్నది నరాల బలహీనతతోనే. దానికి వైద్యం అందకపోవడంతో సమస్య తీవ్రమైంది. పొలం పనులు చేసుకోలేకపోవడంతో మొదలైన అనారోగ్యం కాస్తా ఇంట్లో తన పనులకు కూడా మరొకరి మీద ఆధారపడాల్సినంత దీనమైన స్థితికి చేరుకుంది. న్యూరో స్పెషలిస్టుకు చూపించి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత వైద్యం మొదలైంది. ఇది జరిగి నాలుగేళ్లవుతోంది. అన్నదమ్ముల కుటుంబాల మధ్య అపోహలు తొలగి పోయి, ఆత్మీయతలు వెల్లివిరిశాయి. ఒక మూఢనమ్మకమే ఆ కుటుంబాల మధ్య సంబంధాలను అతలాకుతలం చేసింది. ఆరోగ్యం క్షీణించే వరకు ఉపేక్షించేలా చేసి మనిషిని పిప్పి చేసింది. జనవిజ్ఞాన వేదిక కౌన్సెలింగ్‌తో వారికి చేతబడి అపోహ తొలగింది. వైద్యం మొదలైంది. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఎవరి మాట నమ్ముతాడో వారి చేతనే... అతడిని వైద్యం కోసం ఒప్పించడానికి చాలా కష్టపడ్డాం. ఆ ఊళ్లో ఆయన ఎవరితో స్నేహంగా ఉంటాడో, ఎవరి మాట మీద ఆయనకు గురి ఉందో కనుక్కుని వారికి కౌన్సెలింగ్ ఇచ్చాం. వారి ద్వారా ఇతడిని డాక్టరు దగ్గరకు వెళ్లేలా ఒప్పించగలిగాం. - టి. రమేశ్, ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ మరి.. ఆ మూట ఎలా వచ్చింది? భూమిని తవ్వినప్పుడు బయటపడే మూటలోనే కనికట్టు ఉంటుంది. గుంట తవ్వే మనుషులు ధోవతి కట్టుకుంటారు. ధోవతితో ఈ మూటను దాచుకుంటారు. తవ్వేది రాత్రిపూట, మంత్రగత్తె పసుపుకుంకాలు చల్లుతూ, ఊగిపోతూ ఏం జరుగుతుందో గ్రహించలేని అయోమయాన్ని సృష్టిస్తుంది. ఇంటి వాళ్లు బిక్కుబిక్కు మంటూ ఉంటారు. మధ్యమధ్యలో నిమ్మకాయలు తెండి, ఎర్రదారం, ఎండుమిరపకాయలు... అంటూ ఇంటి వాళ్లు దూరంగా వెళ్లేలా చేస్తుంది. ఆ సమయంలో ధోవతిలోని మూట గుంటలో పడేట్టు చేస్తారొకరు. మరొకరు దాని మీద మట్టి తోస్తారు. మరికొంతసేపటి తర్వాత దానిని వెలికి తీసి ‘మీ మీద చేసిన చేతబడి ఇదే’ అని నమ్మిస్తారు. -
నాది మైండ్‌గేమ్ కాదు: స్టీఫెన్సన్
ఓటుకు నోటు కేసులో నన్నెవరూ ఆడించలేదు: స్టీఫెన్సన్ హైదరాబాద్: ‘‘ఓటుకు నోటు వ్యవహారంలో నేను మైండ్‌గేమ్ ఆడలేదు. నాతో ఎవరూ మైండ్‌గేమ్ ఆడించలేదు’’ అని నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోసం స్టీఫెన్సన్కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి డబ్బు ఎరజూపుతూ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేసిన స్టీఫెన్‌ను రాష్ర్టంలోని పలు క్రిస్టియన్, క్యాథలిక్ సంక్షేమ సంఘాలు మంగళవారం సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా సన్మానించాయి. ఈ సందర్భంగా స్టీఫెన్సన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తన అంతరాత్మ ప్రబోధం మేరకే వ్యవహరించినట్లు చెప్పారు. ప్రజల కోసం, దేశం కోసం త్యాగాలు చేసిన వారే నిజమైన నాయకులని నమ్మే వ్యక్తినన్నారు. సొంతలాభం కోసం పనిచేసే వారు నిజమైన నాయుకులు కాదన్నారు. తన ఆలోచనా విధానం ప్రకారమే వ్యవహరించానని, ఈ విషయంలో ఒత్తిళ్లు, తొందరపాటుతనం ఎంతమాత్రం లేదన్నారు. తన జీవితంలో కోట్ల రూపాయలను ఎప్పుడూ చూడలేదన్నారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తనకు దశాబ్దాల తరబడి చేసిన వ్యాపారంలో వ్యవహారమంతా కోటి రూపాయలను మించలేదన్నారు. స్వలాభం కోసమే చూసుకునే వాడినైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ. ఐదు కోట్లు తీసుకునే వాడినని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవలి పరిణామానికి ముందు తనను అంతా ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేగా చూసేవారని, కానీ ప్రస్తుతం క్రైస్తవ సంఘాల వారంతా తనను తమ బిడ్డగా, నిజాయితీకి ప్రతిరూపంగా చెప్పుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. తనకు ప్రమాదం పొంచి ఉందని, జాగ్రత్తగా ఉండాలని పలువురు శ్రేయోభిలాషులు సూచిస్తున్నారని స్టీఫెన్ పేర్కొన్నారు. తాను నమ్మిన జీసెస్ సిద్ధాంతాలే తనకు రక్షణ అని అన్నారు. తాను జీవితకాలం నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారమే నడుచుకున్నానని, అదే ధర్మాన్ని నాయకులందరూ పాటించాలన్నదే తన అభిమతమని చెప్పుకొచ్చారు. తనకు ఏదైనా జరిగితే వేలాది మంది స్టీఫెన్సన్లు పుట్టుకొస్తారని, తన స్ఫూర్తితో నీతిమంతమైన రాజకీయూలతో బంగారు తెలంగాణ సాధిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, స్టీఫెన్సన్ వ్యవహరించిన తీరు క్రైస్తవ సమాజానికి పేరు, ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయని పలు సంఘాల ప్రతినిధులు కొనియాడారు. ఆయనకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. క్యాథలిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి లియో నేతృత్వంలో జరిగిన అభినందన కార్యక్రమంలో పలు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
'కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారు'
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మైండ్‌గేమ్ ఆడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఉపనేత జీవన్ రెడ్డి కరీంనగర్లో బుధవారం విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాస్వామ్యమా... లేక రాచరిక పాలనా అని ఆయన మండిపడ్డారు. అవినీతిని సహించబోమంటున్న ప్రభుత్వానికి ఇసుక మాఫియా కనిపించడం లేదా అంటూ జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. అధికారికంగా ఇసుకను వినియోగించుకునే పరిస్థితి లేకపోవడం.. అవినీతిని ప్రోత్సహించడమేనని జీవన్ రెడ్డి చెప్పారు. ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిని తరలించడం దేనికి సంకేతమని సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి ప్రశ్నించారు. -
బహిర్గతమైన ఏపీ సర్కార్ మైండ్ గేమ్
-
మైండ్ గేమ్
గంపెడు పుస్తకాలు.. ఊపిరి సలపని క్లాసులు.. ఇంటికొస్తే అసైన్మెంట్ల పాట్లు.. కార్పొరేట్ స్కూళ్లు పెరిగిపోయాక విద్యార్థి దశ ఓ యాంత్రిక జీవనమైపోతోంది. ఇక మానసిక ఉల్లాసాన్నిచ్చి.. ఫిజికల్‌గా వ్యాయామాన్ని అందించే అవుట్డోర్ గేమ్స్‌కు తీరిక ఎక్కడుంటుంది! ఆపై చేతిలో మొబైల్స్, ట్యాబ్‌లు వచ్చి పడటంతో ఖాళీ దొరికితే వీడియో గేమ్‌లకే పరిమితమైపోతున్నారు చిన్నారులు. సొంతగా ఆలోచించి.. మెదడుకు పదును పెట్టే వెసులుబాటే ఉండటం లేదు వారికి. ఈ పరిణామాలను గమనించి.. పిల్లల్లో జనరల్ నాలెడ్జ్, ఆలోచనా శక్తిని పెంచేందుకు కృషి చేస్తున్నాయి నగరంలోని క్విజ్ క్లబ్‌లు. వాటిల్లో ‘కె-సర్కిల్, హైదరాబాద్ క్విజ్ క్లబ్’లు ముందున్నాయి. కాలేజీ విద్యార్థులూ వీటిల్లో భాగస్వాములవుతున్నారు. ‘కె’ అంటే నాలెడ్జ్. నాలెడ్జ్ కోసం తాపత్రయపడే కొంతమంది కలసి ఏర్పాటు చేసిందే కె-సర్కిల్ క్లబ్. ఈ క్లబ్ 42 ఏళ్లుగా వందల సంఖ్యలో క్విజ్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్లబ్ ఆరంభమైన నాటి నుంచి నగరంలో రెగ్యులర్‌గా వివిధ రకాల క్విజ్ యాక్టివిటీస్ నిర్వహిస్తోంది. కోటు వేసుకుని, గంభీరంగా ప్రశ్నలడిగే క్విజ్ మాస్టర్స్ ఇక్కడ కనిపించరు. బోర్డు మీద మార్కులతో ఉత్కంఠ కలిగించే వాతవరణమూ ఉండదు. కానీ అందరిలో క్విజ్ అంటే ఆసక్తి మాత్రం కామన్. ఔత్సాహికులెవరైనా ఈ క్విజ్‌ల్లో పాల్గొనవచ్చు. ఈ క్లబ్లో చేరవచ్చు. ఇందుకు ఎటువంటి ఎంట్రీ ఫామ్‌లు, రుసుములు అక్కర్లేదు. వారం వారం... ప్రతి శనివారం ఈ క్లబ్ ఆధ్వర్యంలో క్విజ్ కార్యక్రమాలు జరుగుతుంటాయి. సికింద్రాబాద్ వైఎంసీఏతో పాటు బంజారాహిల్స్ గోథెజెంత్రమ్, లామకాన్ వేదికలుగా వారాంతపు క్విజ్లు నిర్వహిస్తుంటారు. ఇవే కాకుండా ప్రతి నెలా క్విజ్ ఆఫ్ ది మంత్, అరే భాయ్ అనే స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తారు. క్విజ్ ఆఫ్ ది మంత్ విన్నర్‌కు బహుమతులు అందచేస్తారు. అలాగే ‘అరే భాయ్’ క్విజ్ విజేతలకు ప్రతి నెలా వచ్చే పాయింట్స్ ఆధారంగా యాన్యువల్ విజేతకు స్పెషల్ ట్రోఫీ అందచేస్తారు. ఉన్నత తరగతి పిల్లలకు స్కూల్ క్విజ్లు, కాలేజ్ పిల్లలకు ఓపెన్ క్విజ్లు రెగ్యులర్‌గా నిర్వహిస్తున్నారు. ఏటా ఈ క్లబ్ నిర్వహించే ఓపెన్ క్విజ్‌లో వయోపరిమితి లేకుండా స్కూల్ పిల్లల నుంచి రిటైర్డ్ ఎంప్లాయీస్ వరకూ పాల్గొంటారు. ఇక రెగ్యులర్‌గా వీరు నిర్వహించే క్విజ్‌లలో స్కూల్ పిల్లలు మొదలు, ఐఐటీ విద్యార్థులు, సైంటిస్టులు, ఫైనాన్స్, టీచింగ్, సైన్స్, సినిమా, ఐటీ రంగాలకు చెందిన నిపుణులు కూడా పాల్గొంటుంటారు. ఈ క్విజ్‌లలో పార్టిసిపేట్ చేయటమే కాదు, క్విజ్ మాస్టర్‌గా కూడా వ్యవహరించడం చాలా తేలిక. కె-సర్కిల్ వెబ్సైట్లో క్విజ్ కార్యక్రమ తేదీలుంటాయి. ఆ పట్టికలో వివరాలు చేర్చితే సరిపోతుందంటారు ఈ క్లబ్ సభ్యులు అనుపమ్. హైదరాబాద్ క్విజ్ క్లబ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎఫెక్టుతో పిల్లలు పుస్తకాలు చదవటం, చదివిన జ్ఞానాన్ని పంచుకోవటం, ఇంటరాక్షన్ ద్వారా వివిధ విషయాలు తెలుసుకోవటం లాంటి ప్రక్రియ పూర్తిగా తగ్గిపోయింది. ఇందుకు తగిన వాతావరణాన్ని కలిగించడానికి హైదరాబాద్ క్విజ్ క్లబ్‌ను ఏర్పాటు చేశారు శంకర్, నితి. ఈ క్లబ్ ఏర్పాటు చేసి ప్రతి నెలా వివిధ అంశాలపై క్విజ్లు నిర్వహిస్తున్నారు. ‘1900 నుంచి వరకు ప్రముఖులు, రాజకీయ పార్టీలు, నాయకులు, క్రీడలు.. ఇలా ఒక్కో అంశంపై క్విజ్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు కలసి నాలెడ్జ్ షేర్ చేసుకునే అవకాశం కల్పించాలి. అదే ఆలోచనతో ముందుకు వెళుతున్నాం. అందులో ఫన్ కూడా ఉంటుంది. యాక్టివిటీస్‌కు ప్రవేశం ఉచితం’ అని శంకర్ చెప్పారు. -
'టీడీపీలో చేరే కంటే శ్మశానంలో చేరడం మేలు'
కడప : ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ పార్టీలో చేరే కంటే శ్మశానంలో చేరడం మేలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ పార్టీ ప్రజా ప్రతినిధులు టీడీపీలో చేరుతున్నారంటూ పచ్చ పత్రికలు, టీడీపీతో కలసి మైండ్ గేమ్ ఆడుతున్నాయని ఆరోపించారు. గురువారం కడపలో రాచమల్లు ప్రసాద్‌రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై తమ పార్టీ ఎమ్మెల్యేలందరికి అత్యంత అభిమానం, విశ్వాసం ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. తాము ఎవరూ పార్టీని వీడేది లేదని రాచమల్లు ప్రసాద్‌రెడ్డి తెలిపారు. -
వలసలంటూ టీఆర్ఎస్ మైండ్‌గేమ్: పొంగులేటి
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్‌ను కలిశారే తప్ప.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. వాళ్లు కేవలం నియోజకవర్గ సమస్యల మీద మాత్రమే ముఖ్యమంత్రిని కలిశారని చెప్పారు. టీఆర్ఎస్ నేతలు మాత్రం ఎమ్మెల్యేల వలసలు అంటూ మైండ్ గేమ్ ఆడుతున్నారని పొంగులేటి మండిపడ్డారు. ఏఐసీసీ పిలుపుమేరకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా బుధవారం ఢిల్లీ వెళ్తున్నారని, పార్టీ సంస్థాగత అంశంపై చర్చిస్తామని అన్నారు. రేషన్ కార్డులు, పింఛను కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని పొంగులేటి విమర్శించారు. ఇంటివద్దనే కార్డులు ఇవ్వాల్సింది పోయి.. వారిని ఆఫీసుల చుట్టూ తిప్పడం సరికాదని అన్నారు. మన ఊరు - మన ప్రణాళిక పేరుతో సమగ్ర సర్వేలు చేసినా, మళ్లీ కార్డుల జారీలో మాత్రం అయోమయం నెలకొనడం కేసీఆర్ పాలన వైఫల్యానికి నిదర్శనమని చెప్పారు. -
ఎల్లో మీడియా మైండ్ గేమ్ ఆడుతోంది: కోటంరెడ్డి
హైదరాబాద్: ప్రజా తీర్పును కించపరిచే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పోరేటర్లకు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను ప్రలోభాలకు గురి చేసి.. ఫిరాయింపులను ప్రోత్సాహిస్తోందని ఆయన ఆరోపించారు. ఫిరాయింపులను ప్రోత్సాహించే విధంగా ఎల్లో మీడియా మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. ఎన్ని కుట్రలకు, కుతంత్రాలు చేసినా.. నెల్లూరు కార్పొరేషన్ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ దేనని కోటం రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నెల్లూరు సిటీ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్ కూడా పాల్గొన్నారు. -
ఏబిఎన్,ఈనాడు మైండ్‌గేమ్
-
ఏబిఎన్,ఈనాడు మైండ్‌గేమ్
విశాఖపట్నం: ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈనాడు కథనాలను వైఎస్ఆర్ సిపి నేత తమ్మినేని సీతారాం ఖండించారు. బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీని బలహీనపర్చడానికే, ఉద్దేశపూర్వకంగా తమ పట్ల ఏబిఎన్ దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఏబిఎన్, ఈనాడు మైండ్ గేమ్ ఆడుతున్నట్లు ఆయన ఆరోపించారు. వ్యక్తుల రాజకీయ విలువలను దెబ్బతీసేలా అవి వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. తన చివరి శ్వాసవరకు తాను జగన్ వెంట వైఎస్ఆర్ సిపిలోనే ఉంటానని చెప్పారు. ఇప్పటికైనా మైండ్‌గేమ్ ఆపకపోతే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఏం జరిగినా ఆయా మీడియా యాజమాన్యాలే బాధ్యత వహించాలన్నారు. ఏబిఎన్ వరుస కథనాలపై పరువునష్టం దావా వేస్తామని సీతారాం హెచ్చరించారు. మీడియాకు ఎంత స్వేచ్ఛ ఉందో, అంత పరిమితి కూడా ఉందని చెప్పారు. -
మైండ్ గేమ్!
సాక్షి ప్రతినిధి,కడప: ‘నవ్విపోదురుగాక నాకేటిసిగ్గు’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. జెడ్పీ పీఠం కైవసం చేసుకునేందుకు అడ్డదారులు ఎంచుకుంటున్నారు. ప్రజాతీర్పుకు భిన్నంగా మైండ్ గేమ్ ఆడుతున్నారు. నీచరాజకీయాలకు తెరలేపుతున్నారు. అధికారిక హోదాను వినియోగించుకొని ఛైర్మన్‌గిరిని సొంతం చేసుకునేందుకు కుటిలనీతిని ప్రదర్శిస్తున్నారు. వైఎస్సార్సీపీ సభ్యులు తమతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జిల్లాలో 50 జెడ్పీటీసీ స్థానాలుండగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 11 స్థానాల్లో, వైఎస్సార్సీపీ అభ్యర్థులు 39 స్థానాల్లో గెలుపొందారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జెడ్పీ ఛెర్మైన్గిరి ఆశించడం అత్యాశే అవుతుంది. ఒకటి, రెండు స్థానాలు తేడా ఉంటే ప్రలోభాలకు గురిచేసి సాధించుకునే ప్రయత్నం చేయడం సహజమే. కానీ టీడీపీకి ఏకంగా 15 మంది జెడ్పీటీసీల మద్దతు అవసరం ఉంది. అందులో భాగంగా కొందరిని ప్రలోభాలకు గురిచేసినట్లు సమాచారం. అయితే చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రలోభాలను తిరస్కరించిన ట్లు తెలుస్తోంది. అయినప్పటికీ తమకు 11 మంది వైఎస్సార్సీపీ జెడ్పీటీసీల మద్దతు ఉందని మైండ్‌గేమ్ ఆడుతున్నారు. ప్రజాక్షేత్రంలో ఓటమిపాలై.. తెలుగుదేశం పార్టీ ప్రజాతీర్పుకు విలువ నివ్వడంలేదు. ఆ పార్టీని జెడ్పీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు. ప్రతి ఎన్నికల్లోనూ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తిరస్కారమే ఎదురైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజావిశ్వాసం పొందేందుకు కృషి చేయాల్సిన టీడీపీ చీప్ పాలి‘ట్రిక్స్’కు పాల్పడుతోంది. ఒకరంటే ఒక్కరు కూడా తాము వైఎస్సార్సీపీని వీడతామంటూ జెడ్పీటీసీలు ప్రకటించలేదు. అయినప్పటికీ అధినేత వద్ద మెప్పుకోసం జిల్లాలో తమకు ప్రజాబలం ఉందని చెప్పుకునేందుకు తెలుగుదేశం నేతలు తాపత్రయపడుతున్నారు. అందుకు కర్త, కర్మగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, పార్లమెంటుకు పోటీచేసి ఓడిపోయిన శ్రీనివాసులురెడ్డిలు వ్యవహరిస్తున్నారు. వీరికి జిల్లాకు చెందిన టీడీపీ నేతలు వంత పాడుతున్నారు. ప్రజా మద్దతు లేకపోయినా అధికారం ఆశించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆ పార్టీ నేతలు ఏ ఒక్కరూ భావించడం లేదు. కేవలం మైండ్ గేమ్‌ను అమలుపర్చి అవకాశం వస్తే జెడ్పీపీఠం దక్కించుకుందామనే ఎత్తుగడలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి ఆశలు అడియాసలే.... వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధుల విశ్వాసం ముందు తెలుగుదేశం పార్టీ ఆశలు అడియాసలు కాకతప్పదని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అత్మాభిమానం ముందు టీడీపీ ప్రలోభాలు దిగదుడుపేనని, వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలు ఒక్కరు కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారు ఉంటే ప్రజల కోసం గడిచిన నాలుగు సంవత్సరాలుగా పోరాటం చేసేవారే కాదని, నాయకుల మధ్య అపోహలు సృష్టించేందుకే టీడీపీ నేతల ప్రకటనలు పరిమితమని వైఎస్సార్సీపీ కార్యకర్తలు పేర్కొంటున్నారు. టీడీపీ కుయుక్తులు ఏమాత్రం చెల్లవని జెడ్పీ పీఠంపై వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవే సి తీరుతుందనే విశ్వాసాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. -
'టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోంది'
-
గంటా వారి రియాల్టీ షో ఫ్లాప్
ఓటర్లకు తాయిలాలు.. అయినా దక్కని మద్దతు తగరపువలస,న్యూస్‌లైన్: భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థ్ధి గంటా శ్రీనివాసరావు స్థానిక నేతలు, ఓటర్లతో మైండ్‌గేమ్ ఆడుతున్నారు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్న ట్టు ప్రచారం చేయిం చడంలో సిద్ధహస్తుడైన ఆయన నిజస్వరూపం ఎన్నికల తేదీ సమీపించడంతో కొంచెం కొంచెంగా బయటపడుతోంది. నామినేషన్ వేసినరోజే వంద ద్విచక్రవాహనాలు, పదుల సంఖ్యలో ఇన్నోవాలు కార్యకర్తల కోసం కొనుగోలు చేసినట్టు ప్రచారం చేసుకున్నారు. దీంతో తెలుగుతమ్ముళ్లు వీటిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఎక్కడా ఇలాంటి వాహనా లు కనిపించకపోయేసరికి వారంతా నిరాశచెందుతున్నారు. ఇప్పుడు మండలస్థాయి నాయకులను కాదని కిందస్థాయి నాయకులకు రోజుకు రూ.10వేలు చొప్పున అందించడంతో పాటు మహిళా కార్యకర్తలను నియమించి పంచాయితీకి రూ.5లక్షలు ఇవ్వనున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు.గత బుధవారం తగరపువలస కూడలిలో వైఎస్సార్సీపీ నిర్వహించిన భారీ ర్యాలీని చూసి గంటా తోకముడివాల్సి వచ్చింది. ర్యాలీకి ఎదురుగా వస్తున్న వాహనంలో ఉన్న గంటా వైఎస్సార్సీపీకి ఉన్న ఆదరణ చూసి విస్తుపోయారని టీడీపీ నాయకులే అంటున్నారు. ఇటీవల సొంత ఖర్చులతో గంటా శ్రీనివాస్ సర్వే చేయించుకోగా భీమిలిలో వైఎస్సార్సీపీకి కనీసం ఇరవై వేల మెజార్టీ ఖాయమని తేలిందని, ఆ క్షణం నుంచీ ఆయన మరింత కంగారు పడుతున్నారని కార్యకర్తలే చెవులు కొరుక్కుంటున్నారు. తనకు రావని తెలిసిన ఓటర్లను కూడా మాటలతో ప్రలోభాలకు గురిచేస్తున్నారు. మతతత్వ పార్టీ అయిన బీజేపీతో టీడీపీ దోస్తీని మైనారిటీలు అసహ్యించుకుంటుంటే శుక్రవారం ఆయన పాస్టర్లను మభ్యపెట్టి సమావేశం నిర్వహించారు. భీమిలిలో తనకో ఓటు,ఎంపీగా బీజేపీకి ఓటు వేయాలని కోరడంతో పాస్లర్టు గంటాను అక్కడే కడిగిపారేసినట్లు తెలిసింది. క్రిస్టియన్లకు అండగా ఉంటామని గంటా చెప్పినా నమ్మకపోవడంతో ఈ షో ఫ్లాప్ అయినట్టు కార్యకర్తలే చెబుతున్నారు. మొదట్నుంచీ క్రైస్తవులు, ముస్లింలు వైఎస్ఆర్ వెంటే ఉన్నారన్న విషయాన్ని గంటా గుర్తించకపోవడం ఘోరమని కార్యకర్తలే చెబుతున్నారు. భీమిలి పట్టణంలో హిందువులతో పాటు క్రిస్టియన్లకు ప్రత్యేకంగా శ్మశానవాటికలు ఉన్నాయని, నియోజకవర్గంలో మిగతాచోట కూడా దీని కోసం స్థలం కేటాయించాలని గతంలో గంటా వద్దకు స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ద్వారా వచ్చినా స్పందించలేదని వారంతా నిలదీసినట్టు తెలిసింది. దీంతో మతం పేరిట ఓట్లు కొల్లగొట్టాలనుకున్న ఆయన పన్నాగం పారలేదని కార్యకర్తలే చెబుతున్నారు. క్రిస్టియన్లు వైఎస్సార్సీపీకి ఆప్తులు.. ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా క్రిస్టియన్లు,ముస్లింలు వైఎస్సార్సీపీకు మద్దతు తెలుపుతారు. ఇటీవల ప్రచారంలో ఈ విషయం తెలియడంతో టీడీపీ దొడ్డిదారి ఎంచుకుంది. అయినా గంటా పాచికలు ఇక్కడ పారవు. ఆయనకు ఓటర్లు తగిన రీతిలో బుద్ధి చెబుతారు. -వెంపాడ అప్పలకారురెడ్డి గంటకో పార్టీ ...ఆయన్ను నమ్మలేం పార్టీకో మేనిఫెస్టో ఉంటుంది. అందువలన తరచూ పార్టీలు,నియోజకవర్గాలు మారిన వారిని మైనారిటీలు విశ్వసించలేరు. అయినా ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. మళ్లీ ఇక్కడే పోటీ చేస్తారో లేదో కూడా తెలియదు. అలాంటి వ్యక్తిని ఎలా నమ్మగలం - వంకాయల మారుతీ ప్రసాద్ -
బాబు తీరుపై కమలనాథుల గుస్సా
సాక్షి, అనంతపురం : చంద్రబాబు మైండ్ గేమ్‌పై కమలనాథులు మండిపడుతున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్రలో బీజేపీతో పొత్తు ఉంటుందని ప్రకటించిన బాబు.. గురువారం పొత్తు ఉండదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ నేతలు కస్సుబుస్సుమంటున్నారు. శుక్రవారం నామినేషన్ల ప్రకియ ఉండకపోవడం.. శనివారం చివరి రోజు కావడంతో ఏం చేయాలో తెలీక వారు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇదే సమయంలో పొత్తుల విషయంలో చివరి వరకు సాగదీసి మోసం చేస్తారా అంటూ మండిపడుతున్నారు. బాబు నిర్ణయంతో ఇరు పార్టీల కేడర్ మధ్య గందరగోళం నెలకొంది. జిల్లా వరకు ఒక అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇవ్వాలన్న నిర్ణయం గతంలోనే జరిగింది. కదిరి స్థానం ఇవ్వాలని బీజేపీ పెద్దలు చంద్రబాబుతో మంతనాలు చేయగా..ఆ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్కే బాబు కట్టబెట్టారు. పస్తుతం ఎంపీ అభ్యర్థులతో పాటు 12 నియోజకవర్గాల అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. అనంతపురం, గుంతకల్లు స్థానాల్లో మాత్రం అభ్యర్థులను ప్రకటించలేదు. అనంతపురం అర్బన్ స్థానం నుంచి ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన ఎన్టీ చౌదరిని బరిలోకి దింపాలని బీజేపీ భావించింది. అయితే తెలుగు తమ్ముళ్లు ఆగ్రహించడంతో ఆ నిర్ణయం ఆగిపోయింది. చివరకు గుంతకల్లు స్థానాన్ని బీజేపీకి ఇవ్వడానికి సైతం బాబు ససేమిరా అన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన బీజేపీ నేతలు.. గుంతకల్లు స్థానాన్ని తమకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఈ చర్చలు సాగుతుండగానే గురువారం బాబు బాంబు పేల్చారు. సీమాంధ్రలో బీజేపీతో పొత్తు ఉండదని ప్రకటించడంతో బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. బాబు నిర్ణయంతో తెలుగు తమ్ముళ్లు కూడా ఆందోళన చెందుతున్నారు. అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు నిలబడితే టీడీపీ విజయావకాశాలు దెబ్బతింటాయని భావిస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీకి బుద్ధి చెప్పేందుకు కమలనాథులూ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని రెండు ఎంపీ, 14 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి తాము సిద్ధమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి తెలియజేశారు. ఒక జాబితాను రూపొందించి పంపామని, అది శుక్రవారం ఫైనల్ అవుతుందని చెప్పారు. ఆ జాబితాలోని పేర్ల వివరాలు.. -
టీడీపీ మైండ్‌గేమ్!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో తమ పార్టీకి పట్టు ఏర్పడిందనే కల్పన ప్రజల్లో కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ మైండ్‌గేమ్‌కు సిద్ధపడుతోంది. జిల్లాలో టీడీపీ హవా నడుస్తోందని, నెల రోజులుగా తమ పార్టీకి ఆదరణ పెరుగుతోందని పేర్కొనేలా ప్రజలను మభ్య పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతున్నా.. ప్రజలను తమవైపుకు తిప్పుకునేందుకు వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రె స్ పార్టీ చేపడుతున్న గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమాన్ని కాపీ కొడుతూ, ఇంటింటికీ తెలుగు దేశం పార్టీ అనే నినాదంతో ప్రచారం ప్రారంభించింది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ ప్రచారానికి రాష్ట్ర స్థాయిలో పిలుపునిచ్చినా, జిల్లా నాయకుల్లో స్పందన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం మినహా మిగిలిన ప్రాంతాల్లో మొక్కుబడిగా ఈ కార్యక్రమం జరుగుతోంది. అయినప్పటికీ ‘కింద పడ్డా పై చేయి మాదే’ అన్న చందాన తమ పార్టీకి గొప్ప ఊపు వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు జిల్లాకు వచ్చి వెళ్లినా, కార్యకర్తల్లో మునుపటి ఉత్సాహం లేదనే విషయం స్పష్టమవుతోంది. అయితే ఈ సారి కచ్చితంగా అధికారంలోకి రాని పక్షంలో పార్టీ ఉనికి కోల్పోతుందని భావించిన అధిష్టానం ఈ మైండ్‌గేమ్‌కు శ్రీకారం చుట్టింది. ఈమేరకు జిల్లా నాయకులకు సూచనలిచ్చింది. ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులను తమ పార్టీలో చేర్చుకోవాలని సూచించినట్లు సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చే అవకాశం లేక పోవడంతో, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నాయకులపై దృష్టి సారించింది. కాంగ్రెస్ రాష్ట్రంలో కనుమరుగయ్యే అవకాశం ఉండటంతో, ఆ పార్టీ నేతలు కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఖాళీ లేకపోవడంతో, తెలుగుదేశం వైపు చూస్తున్నారు. అటువంటి నాయకులను పార్టీలో చేర్చుకుని, తమకే విజయావకాశాలున్నాయంటూ ప్రజలను మభ్యపెట్టే ఆలోచనలో టీడీపీ ఉంది. ఎమ్మెల్యేలపైనే గురి.. ముఖ్యంగా జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారిని తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు టీడీపీ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సంతనూతలపాడు, యర్రగొండపాలెం, చీరాల ఎమ్మెల్యేలను లాగే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అదే విధంగా ఇతర నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నాయకులకు సీటు ఆశ చూపించి, తమ వైపుకు లాగే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. దీంతో కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇన్నాళ్లు జెండాలు మోసిన తమను పక్కన పెట్టి, ఇతర పార్టీలో నుంచి వచ్చే వారికి అగ్రతాంబూలం ఇవ్వడాన్ని కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. పదేళ్లుగా పార్టీ అధికారంలో లేకపోయినా జెండాలు మోసి, పార్టీ ఉనికి కాపాడుతూ వస్తున్న తమను కరివేపాకులా ఉపయోగించుకోవడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీరిని బుజ్జగించేందుకు బడా నాయకులు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. -
బాబు మైండ్‌గేమ్‌కు భయపడం
పలమనేరు, న్యూస్‌లైన్: ‘చంద్రబాబు కుళ్లు, కుమ్మక్కు రాజకీయాలను చూసి ఓర్చుకోలేక ఆ పార్టీ నుంచి బయటకొచ్చా. ఇప్పుడు నాపై ఆయన మైండ్‌గేమ్ ఆడుతున్నారు. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదు’ అని పలమనేరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అమరనాథరెడ్డి విమర్శించారు. మంగళవారం పలమనేరు నియోజకవర్గ కార్యకర్తల విసృ్తత స్థాయి సమావేశం పట్టణ సమీపంలోని జగమర్ల అటవీ ప్రాంతంలో జరిగింది. జిల్లాలోని ముఖ్యనేతలు చెవిరెడ్డిభాస్కర్‌రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి హాజరయ్యారు. అమరనాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో స్పష్టమైన విధానంతో ముందుకెళ్తున్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమేనన్నారు. ‘నేను తెలుగుదేశం పార్టీలో దివంగత నేత ఎన్టీఆర్ వద్ద క్రమశిక్షణ నేర్చుకున్నా. బాబు కుతంత్రాలను చూసి అసహ్యంతో ఆ పార్టీని వీడి బయటకొచ్చా’నన్నారు. ఆయన్ను వ్యతిరేకించిన తనపై మానసికంగా దెబ్బతీసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని, వాటిని ఎలా తిప్పికొట్టాలో తెలుసని అన్నారు. తనపై అసత్య ప్రచారాలు చేసేందుకే తెలుగుతమ్ముళ్లు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి అప్పుడు జనా న్ని పట్టించుకోకుండా ఇప్పుడు ఆల్‌ఫ్రీ వాగ్ధానాలు చేస్తే నమ్మేవారెవరని ప్రశ్నిం చారు. ఎల్లోమీడియా ద్వారా గ్రాఫ్‌లు కిందికి పడిపోయాయంటూ ప్రజలను గందరగోళానికి గురి చేసేప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తనపై ఎన్ని కుయుక్తులు పన్నినా కార్యకర్తల అండదండలతో ముందుకెళ్తానన్నారు. కుంభకోణాలు పుట్టింది బాబు హయాంలోనే ‘అన్నాహజారేను చూసి అన్ననవుతా, కేజ్రీవాల్‌ను చూసి అవినీతిపై పోరాడుతా, మదర్ థెరిసాలా ఆదుకుంటా’ నని బాబు చెప్పేమాటలను నమ్మేవాళ్లెవరైనా ఉన్నారా..? అని వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు. అసలు కుంభకోణాలు పుట్టిందే బాబు హయాంలో అని, స్టాంపు కుంభకోణం నుంచి, ప్రశ్నపత్రాల లీక్ దాకా ఎన్నో వెలుగుచూశాయని తెలిపారు. అమర్‌ను గెలిపించి జగన్‌ను సీఎం చేయండి మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డిని గెలిపించి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కుప్పం సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతిగడపకూ సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైఎస్సార్‌కే దక్కిందన్నారు. అనంతరం నియోజకవర్గ నాయకులు హేమంత్‌కుమార్ రెడ్డి, సీవీ కుమార్, రెడ్డెమ్మ, కేశవులు, అబ్బు, కృష్ణమూర్తి, రత్నారెడ్డి సుబ్బారెడ్డి, ఖాదర్‌బాషా, ఇక్బాల్, రవీంద్ర, ప్రమీల, అరుణ్, వాసు, సుధా, గౌస్, బాలాజీనాయుడు, సురేష్, నాగశంకర్‌రెడ్డి, మోహన్ రెడ్డి ప్రసంగించారు. -
అది బాబు మైండ్ గేమ్
* ఓ పత్రికలో కథనంపై వైఎస్సార్సీపీ నేత రఘురామకృష్ణంరాజు * జగన్‌తో నాకు సన్నిహిత సంబంధాలున్నాయి * వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయం సాక్షి, తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి జిల్లా): విజయం సాధించలేననే అనుమానంతో పార్టీ కార్యక్రమాలకు తాను దూరంగా ఉంటున్నట్టు ఒక పత్రికలో వచ్చిన వార్తలో ఎలాంటి వాస్తవం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామ కృష్ణంరాజు చెప్పారు. తాడేపల్లిగూడెంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనపై వచ్చిన కథనాన్ని గోబెల్స్ ప్రచారంగా అభివర్ణించారు. ఆ పత్రిక ఉద్దేశపూర్వకంగానే ఇదంతా రాసినట్లు స్పష్టంగా కనిపిస్తోందని, ఇదంతా చంద్రబాబు ఆడుతున్న మైండ్‌గేమ్ అని విమర్శించారు. సమావేశంలో పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపి, పట్టణ కన్వీనర్ యెగ్గిన నాగబాబు, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు తెన్నేటి జగ్జీవన్ పాల్గొన్నారు. ఆయనేమన్నారు? * మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఖరిపై నేను అసంతృప్తితో ఉన్నట్టు జరుగుతున్న ప్రచారం అభూత కల్పన. ఆయనతో నేను సన్నిహితంగా ఉంటా, ఎలాంటి విభేదాలూ లేవు. వచ్చే ఎన్నికల్లో నరసాపురం ఎంపీ స్థానానికి వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేస్తున్నా. ఒక సర్వే ప్రకారం నియోజకవర్గంలో నాకు 53 నుంచి 54 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. * వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్ర పార్టీ, తెలుగుదేశం విభజన పార్టీ. కోస్తాంధ్రలోనే మా పార్టీకి 140 నుంచి 145 సీట్లు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో పార్టీ బలంగా ఉంది. తెలంగాణలోనూ గణనీయమైన సీట్లు వస్తాయి. వచ్చే ఎన్నికల్లో మా పార్టీ అత్యధిక స్థానాలను సొంతం చేసుకుంటుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం. * ఈ నెల 23వ తేదీన తర్వాత కాంగ్రెస్ ఖాళీ అవుతుంది. ఆ పార్టీకి చెందిన వారంతా మా పార్టీ వైపు చూస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి చాలాచోట్ల అభ్యర్థులు దొరకడంలేదు. అందుకే బలంగా ఉన్న మా పార్టీని బలహీనంగా చూపించడానికి ఇలాంటి ప్రచారాలు చేయిస్తున్నారు. * విభజన పార్టీ అయిన తెలుగుదేశం రెండు ప్రాంతాల్లో రెండు వాదనలు వినిపిస్తోంది. తెలంగాణలో ఎర్రబెల్లి, కోస్తాంధ్రలో పయ్యావుల కేశవ్ విభిన్న వాదనలు ఎలా వినిపిస్తారు? * ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్రశేఖర్ చాలా చురుగ్గా పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నా వెనక్కు తగ్గుతున్నట్లు ఎలా రాస్తారు? విజయవాడ నుంచి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ పోటీ చేయనని వెనక్కి వెళ్లిపోయినట్లు జరుగుతున్న ప్రచారం హాస్యాస్పదం. ఆయనసలు మా పార్టీలోనే లేరుకదా. -
మైండ్‌గేమ్ ఆడొద్దు
విజయవాడ, న్యూస్‌లైన్ : మీడియా రాజకీయ నాయకులతో మైండ్‌గేమ్ ఆడుతోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాదరావు చెప్పారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో స్వరాజ్య మైదానంలో ఏర్పాటుచేసిన 25వ పుస్తక మహోత్సవాన్ని బుధవారం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్.వైద్యనాథ అయ్యర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. మంత్రి మాణిక్య మాట్లాడుతూ.. మీడియా బ్రేకింగ్ న్యూస్ కోసం హడావుడి చేస్తూ, నేతలతో అప్పటికప్పుడు ఇష్టారాజ్యంగా మాట్లాడించి ప్రసారం చేస్తోందని మండిపడ్డారు. పుస్తకాలను చదివి ఆయా అంశాలపై అవగాహనతో మాట్లాడినప్పుడే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. నైతిక విలువలు కలిగి, అవినీతికి దూరంగా ఉండే నేతలు పుస్తకాలు కూడా చదవుతున్నారా.. లేదా గమనించి వారిని గెలిపించాలని సూచించారు. వైద్యనాథ అయ్యర్ మాట్లాడుతూ నూతన సాంకేతిక విప్లవం నేపథ్యంలో పాశ్చాత్యదేశాల్లో పుస్తకపఠనం తగ్గిపోతోుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారతదేశంలో ఆ విధమైన పరిస్థితి లేకున్నా భవిష్యత్‌లో ఇబ్బంది పడే అవకాశముందన్నారు. ఆన్లైన్ పబ్లిషింగ్‌ను అధికంగా నిర్వహించాలని, దానికి ప్రభుత్వ సహకారాన్ని అందించాలని సూచించారు. 1989లో తొలి పుస్తక మహోత్సవ ప్రారంభోత్సవానికి తాను హాజరయినప్పుడు కురిసిన భారీ వర్షం తనకు నేటికీ గుర్తుఉందన్నారు. సభకు అధ్యక్షత వహించిన కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు మాట్లాడుతూ.. పాఠకులకు పుస్తకం ప్రపంచాన్ని చేరువ చేస్తుందన్నారు. విజ్ఞానాన్ని అందించే గొప్ప సాధనం పుస్తకం మాత్రమేనన్నారు. పుస్తక పఠనంతో తమను తాము సంస్కరించుకోవచ్చని చెప్పారు. విజయవాడ పుస్తక మహోత్సం నగరానికే వన్నెతెచ్చిందన్నారు. ఆదాయపు పన్ను కమిషనర్ ఎస్.జయరామన్ మాట్లాడుతూ తన జీవితంలో ఇంత పెద్ద పుస్తక మహోత్సవాన్ని చూడడం ఇదే ప్రథమమన్నారు. కేవలం మెట్రోపాలిటన్ నగరాలకే పరిమితమయ్యే పుస్తక మహోత్సవాలకన్నా అద్భుతంగా విజయవాడలో నిర్వహించడం అభినందనీయమన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. గతానికి, వర్తమానానికి పుస్తకాలే వారధులని పేర్కొన్నారు. పుస్తక మహోత్సవం మరింత అభివృద్ధిని అందుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. సొసైటీ అధ్యక్షుడు డి.అశోక్‌కుమార్ మాట్లాడుతూ గడిచిన పాతికేల్లలో అనేక సవాళ్లను ఎదుర్కొని నిలిచామని, అందుకే ఇంత దూరం ప్రయాణం చేయగలిగామన్నారు. అన్ని శాఖల అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందించిన సహకారంతోనే సొసైటీ ఈ స్థాయికి చేరుకుందన్నారు. తొలుత జయరామన్ ‘అక్షరయాత్ర’ పేరుతో రూపొందించిన 25 సంవత్సరాల సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి రావికింది రామస్వామి, ఉపాధ్యక్షులు బి.బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. -
'విభజన పేరుతో కేంద్రం మైండ్‌గేమ్ ఆడుతుంది'
రాష్ట్ర విభజన పేరుతో కేంద్రం ప్రభుత్వం మైండ్‌గేమ్ ఆడుతుందని జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. విభజన జరిగిపోయిందన్న వాదనను తిప్పికొట్టాలని ఆయన సీమాంధ్ర ప్రజలందరు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన తిరుపతిలో విలేకర్లతో మాట్లాడుతూ... సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కొన్ని పార్టీలు ద్వంద్వ వైఖరిని అవలభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను రాష్ట్ర విభజన జరగదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేసిన అన్ని విధాలను చట్టపరంగా ఎదుర్కొంటామని జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి పేర్కొన్నారు.