సాక్షి, అనంతపురం : చంద్రబాబు మైండ్ గేమ్‌పై కమలనాథులు మండిపడుతున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్రలో బీజేపీతో పొత్తు ఉంటుందని ప్రకటించిన బాబు.. గురువారం పొత్తు ఉండదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ నేతలు కస్సుబుస్సుమంటున్నారు. శుక్రవారం నామినేషన్ల ప్రకియ ఉండకపోవడం.. శనివారం చివరి రోజు కావడంతో ఏం చేయాలో తెలీక వారు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇదే సమయంలో పొత్తుల విషయంలో చివరి వరకు సాగదీసి మోసం చేస్తారా అంటూ మండిపడుతున్నారు. బాబు నిర్ణయంతో ఇరు పార్టీల కేడర్ మధ్య గందరగోళం నెలకొంది. జిల్లా వరకు ఒక అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇవ్వాలన్న నిర్ణయం గతంలోనే జరిగింది. కదిరి స్థానం ఇవ్వాలని బీజేపీ పెద్దలు చంద్రబాబుతో మంతనాలు చేయగా..ఆ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌కే బాబు కట్టబెట్టారు.
పస్తుతం ఎంపీ అభ్యర్థులతో పాటు 12 నియోజకవర్గాల అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. అనంతపురం, గుంతకల్లు స్థానాల్లో మాత్రం అభ్యర్థులను ప్రకటించలేదు. అనంతపురం అర్బన్ స్థానం నుంచి ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన ఎన్‌టీ చౌదరిని బరిలోకి దింపాలని బీజేపీ భావించింది. అయితే తెలుగు తమ్ముళ్లు ఆగ్రహించడంతో ఆ నిర్ణయం ఆగిపోయింది. చివరకు గుంతకల్లు స్థానాన్ని బీజేపీకి ఇవ్వడానికి సైతం బాబు ససేమిరా అన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన బీజేపీ నేతలు.. గుంతకల్లు స్థానాన్ని తమకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు.
ఈ చర్చలు సాగుతుండగానే గురువారం బాబు బాంబు పేల్చారు. సీమాంధ్రలో బీజేపీతో పొత్తు ఉండదని ప్రకటించడంతో బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. బాబు నిర్ణయంతో తెలుగు తమ్ముళ్లు కూడా ఆందోళన చెందుతున్నారు. అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు నిలబడితే టీడీపీ విజయావకాశాలు దెబ్బతింటాయని భావిస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీకి బుద్ధి చెప్పేందుకు కమలనాథులూ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని రెండు ఎంపీ, 14 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి తాము సిద్ధమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి తెలియజేశారు. ఒక జాబితాను రూపొందించి పంపామని, అది శుక్రవారం ఫైనల్ అవుతుందని చెప్పారు. ఆ జాబితాలోని పేర్ల వివరాలు..
బాబు తీరుపై కమలనాథుల గుస్సా
Published Fri, Apr 18 2014 2:26 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement
Advertisement