చంద్రబాబు పాలనలో కొత్త పథకాలు ఏమీ అమలు కాలేదు..ఎవరో ఒక లబ్ధిదారుడు చనిపోతేనే పింఛన్ వచ్చేది. రైతుల పరిస్థితి మరీ దారుణం. కరువు కాటకాలతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం.. వ్యవసాయం దండగ అని చెప్పిన వ్యక్తికి రైతుల ఓట్లు అడిగే హక్కులేదు.
- వెంకట్రామిరెడ్డి, రైతు, ఉరుటూరు, వీఎన్‌పల్లె మండలం
చంద్రబాబు హయాంలో కరెంటు కోతలు దారుణంగా ఉండేవి. పొలాల వద్ద పడిగాపులు కాసే పరిస్థితి. కరెంటు బిల్లులు చెల్లించకపోతే స్టార్టర్లు తీసుకుపోయేవారు. అటువంటి భయానక పాలనను తలుచుకుంటే ఇప్పటికీ భయమేస్తోంది.
- చిన్న ఓబులేసు, దళిత రైతు,
అనిమెల, వీఎన్‌పల్లె మండలం
బాబు కాలం ఎన్నో ఇబ్బందులు పడ్డాం
Published Mon, May 5 2014 2:23 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement