చంద్రబాబు తొమ్మిదేళ్ల చీకటిపాలనను తలచుకుని రైతులు భయంతో ఇప్పటికీ వణికిపోతున్నారు.. కరెంట్ కోతలతో రైతులకు గుండెకోత మిగిల్చిన బాబు.. బిల్లుల భారం మోపి వారిని కుంగదీశారు.. చుక్క నీరందక కన్నీటి తడులతోనే సాగుచేస్తున్నా.. అడ్డగోలుగా విధించిన కరెంట్ బిల్లులు కట్టలేదంటూ వారి చేతులకు సంకెళ్లేశారు.. పొలాల్లో వ్యవసాయ మోటార్లస్టార్టర్లు, సర్వీసు వైర్లను కరెంటోళ్లు పీక్కెళ్తుంటే రైతులు తీవ్ర మనోవ్యథకు గురయ్యారు.. ఎన్నికల వేళ నాటి భయానక పాలనను గుర్తు చేసుకుంటున్నారు.. ఆనాటి అవస్థలు.. అవమానాలు అన్నదాతల మాటల్లోనే..
ఒకే ఏడాదిలో 18 సార్లు మోటారు రిపేరుకు వచ్చింది
చంద్రబాబు పాలనలో విద్యుత్ అధికారులు ఎప్పుడు దాడి చేస్తారో తెలియని పరిస్థితి. బావుల్లోని మోటార్లను తీసుకునేందుకు తాళ్లను వేలాడదీసేవాళ్లం. కరెంటోళ్లు వస్తున్నారని తెలియగానే తాళ్లద్వారా బావిలోకి దిగి అడ్డదిడ్డంగా మోటార్‌కు ఉన్న స్టార్టర్లను తొలగించే వాళ్లం. ఇలా ఒకే సంవత్సరంలో 18 సార్లు నా మోటారు రిపేరుకు వచ్చింది. ఆ ఏడాది ఆదాయం 30వేలు వస్తే మోటారు రిపేరుకే రూ.28వేలు ఖర్చయింది. వైఎస్ పాలన వచ్చాక ఈ బాధలు తప్పాయి. మళ్లీ అలాంటి రోజులు రావాలి.
- నడిపి గుర్రప్ప,
నంగనూరుపల్లె, ప్రొద్దుటూరు మండలం
రైతులకు ఒరిగిందేమీ లేదు
పేద మహిళా రైతులమని తెలిసీ చంద్రబాబు నాయుడు హయాంలో మోటార్లకు ఉన్న స్టార్టర్లను తీసుకెళ్లారు.. ఎంత మొర పెట్టుకున్నా అధికారులు వినలేదు.. బాబు పాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదు.
- ఆళ్లకుంట ఈశ్వరమ్మ, తుమ్మకొండ , చిట్వేలి మండలం
ఇప్పటికీ ఒళ్లు జలదరిస్తుంది
చంద్రబాబు పాలనను తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్లు జలదరిస్తుంది.. కరెంటోళ్లు వస్తున్నారంటే చాలు పొలాలవైపు పరుగెత్తేవాళ్లం.. మోటార్లకు ఉన్న స్టార్టర్లను, బాక్స్‌లను తీసుకుని దాచుకునే వాళ్లం.. సమీపంలోనే పెన్నానది ఉన్నందున వాటిని ఇసుకలో పూడ్చేవాళ్లం.. బాబు పాలనలో ఏ సంవత్సరం పంటలు సరిగా పండలేదు.
- బైరగాని పెద్దగుర్రప్ప, నంగనూరుపల్లె,
ప్రొద్దుటూరు మండలం
బాబు కాలం భయానక పాలన
Published Sat, May 3 2014 2:14 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement