'కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారు' | cm kcr playing mind game, says jeevan reddy | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారు'

Published Wed, Jan 28 2015 5:43 PM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

'కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారు' - Sakshi

'కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారు'

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మైండ్గేమ్ ఆడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఉపనేత జీవన్ రెడ్డి కరీంనగర్లో బుధవారం విమర్శించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మైండ్గేమ్ ఆడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఉపనేత జీవన్ రెడ్డి కరీంనగర్లో బుధవారం విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాస్వామ్యమా... లేక రాచరిక పాలనా అని ఆయన మండిపడ్డారు.

అవినీతిని సహించబోమంటున్న ప్రభుత్వానికి ఇసుక మాఫియా కనిపించడం లేదా అంటూ జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. అధికారికంగా ఇసుకను వినియోగించుకునే పరిస్థితి లేకపోవడం.. అవినీతిని ప్రోత్సహించడమేనని జీవన్ రెడ్డి చెప్పారు. ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిని తరలించడం దేనికి సంకేతమని సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement