కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి
సాక్షి, జగిత్యాల : తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అసమర్థతతోనే అసెంబ్లీని రద్దు చేశారని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014లో ఉద్యమ పార్టీగా టీఆర్‌ఎస్ పార్టీకి పట్టం కట్టారని అన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారని, ఎక్కడ అందించారో చెప్పాలని ప్రశ్నించారు.
శ్రీపాద ఎల్లంపలి ప్రాజెక్టు నీరు పైకి పంపకపోవటంతో నాలుగేళ్లలో ప్రాజెక్టుల రీ డిజైన్ చేయటం వల్ల లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రంలో కలిసిపోయిందని తెలిపారు. కమీషన్ల కక్కుర్తితోనే మిషన్ భగీరథ తీసుకొచ్చారని ఆరోపించారు. 1500 కోట్లతోనే ప్రతి గ్రామానికి ఫ్యూరిఫైడ్ వాటర్ అందించవచ్చని అన్నారు. 50వేల కోట్ల రూపాయల అప్పుచేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థతతో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు 21వేల కోట్లు వెనక్కిపోయాయని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment