TG: జీవన్‌రెడ్డి వ్యవహారంపై పీసీసీ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు | Telangana Pcc Chief Mmahesh Goud Comments On Jagtial Jeevanreddy Issue | Sakshi
Sakshi News home page

TG: జీవన్‌రెడ్డి వ్యవహారంపై పీసీసీ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

Published Tue, Oct 22 2024 7:45 PM | Last Updated on Tue, Oct 22 2024 7:54 PM

Telangana Pcc Chief Mmahesh Goud Comments On Jagtial Jeevanreddy Issue

సాక్షి,హైదరాబాద్: జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గంగారెడ్డి హత్యను పార్టీ సీరియస్‌గా తీసుకుందని పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఈ విషయమై మహేష్‌కుమార్‌ గౌడ్‌ మంగళవారం(అక్టోబర్‌ 22) మీడియాతో మాట్లాడారు. ‘పార్టీ నేత గంగారెడ్డి హత్య వెనక ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో మాట్లాడాను.జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు హత్యకు గురికావడంతో ఆయన ఆవేదనతో ఉన్నారు.జీవన్ రెడ్డి పార్టీ సీనియర్ నేత ఆయన ఆవేదనను అర్థం చేసుకుంటాం. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేలు వచ్చిన చోట్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవన్నీ త్వరలో పరిష్కారమవుతాయి. జీవన్‌రెడ్డి అంశాన్ని మంత్రి శ్రీధర్‌బాబుకు అప్పగించాం. ఆయన త్వరలో అన్ని సర్దుకునేలా చేస్తారు’అని మహేష్‌కుమార్‌ గౌడ్‌ చెప్పారు.

ఇదీ చదవండి: జగిత్యాలలో కాంగ్రెస్‌ నేత దారుణ హత్య

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement