సాక్షి, హైదరాబాద్: కొత్త జోన్‌ల పేరుతో కేసీఆర్ సరికొత్త నాటకాలకు తెరతీశారని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ కోసమే జోన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ చెబుతున్నారని, అయితే కొత్త జిల్లాలను ఆమోదానికే ఈ డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఈ నాలుగున్నరేళ్లలో ఎప్పుడూ గుర్తుకు రాని నిరుద్యోగుల సమస్యలు కేసీఆర్‌కు ఇప్పుడే గుర్తుకు రావటం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ ఆలోచనలకు అనుగుణంగా కేసీఆర్ నడుచుకుంటున్నారని, మోదీకి అమిత్‌షా కన్నా కేసీఆరే సన్నిహితుడని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment