ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈనాడు కథనాలను వైఎస్ఆర్ సిపి నేత తమ్మినేని సీతారాం ఖండించారు. బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్‌సీపీని బలహీనపర్చడానికే, ఉద్దేశపూర్వకంగా తమ పట్ల ఏబిఎన్ దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఏబిఎన్, ఈనాడు మైండ్ గేమ్ ఆడుతున్నట్లు ఆయన ఆరోపించారు. వ్యక్తుల రాజకీయ విలువలను దెబ్బతీసేలా అవి వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. తన చివరి శ్వాసవరకు తాను జగన్ వెంట వైఎస్ఆర్ సిపిలోనే ఉంటానని చెప్పారు. ఇప్పటికైనా మైండ్‌గేమ్ ఆపకపోతే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఏం జరిగినా ఆయా మీడియా యాజమాన్యాలే బాధ్యత వహించాలన్నారు. ఏబిఎన్ వరుస కథనాలపై పరువునష్టం దావా వేస్తామని సీతారాం హెచ్చరించారు. మీడియాకు ఎంత స్వేచ్ఛ ఉందో, అంత పరిమితి కూడా ఉందని చెప్పారు.