ఎల్లో మీడియా మైండ్ గేమ్ ఆడుతోంది: కోటంరెడ్డి
హైదరాబాద్: ప్రజా తీర్పును కించపరిచే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పోరేటర్లకు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను ప్రలోభాలకు గురి చేసి.. ఫిరాయింపులను ప్రోత్సాహిస్తోందని ఆయన ఆరోపించారు.
ఫిరాయింపులను ప్రోత్సాహించే విధంగా ఎల్లో మీడియా మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. ఎన్ని కుట్రలకు, కుతంత్రాలు చేసినా.. నెల్లూరు కార్పొరేషన్ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ దేనని కోటం రెడ్డి అన్నారు.
తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నెల్లూరు సిటీ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్ కూడా పాల్గొన్నారు.