మీరే చేయించారా సోమిరెడ్డి : శ్రీధర్‌రెడ్డి | Kotamreddy Sridhar Reddy Says He Condemn Attack On Thirumala Naidu | Sakshi
Sakshi News home page

‘తిరుమల నాయుడుపై దాడిని ఖండిస్తున్నా’

Published Wed, Apr 17 2019 5:46 PM | Last Updated on Wed, Apr 17 2019 7:31 PM

Kotamreddy Sridhar Reddy Says He Condemn Attack On Thirumala Naidu - Sakshi

సాక్షి, నెల్లూరు : టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ‘తిరుమల నాయుడు అనేక పాఠశాలల మీద దాడులు చేశారు. అయితే రౌడీయిజాన్ని నేను సమ్మతించను. ప్రోత్సహించను. మరి వెంకటాచలం మండలంలో పోలింగ్‌ తర్వాత వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి. అందులో మీ హస్తం ఉందా. అవి మీరే చేయించారా’ అని టీడీపీ నేత సోమిరెడ్డిని ప్రశ్నించారు. ‘కావలిలో అనేక దాడులు జరిగాయి. అవన్నీ బీద రవిచంద్ర చేయించాడా..? జనసేన అభ్యర్థి మనుక్రాంత్ రెడ్డికి మద్దతుగా సోమిరెడ్డి పనిచేశారు. రూరల్ టీడీపీ అభ్యర్థి అజీజ్‌పై సోమిరెడ్డి దొంగ ప్రేమ చూపిస్తున్నారు’ అని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

చదవండి : ‘ఓటమి భయంతోనే టీడీపీ నేతల విష ప్రచారం’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement