బాలకృష్ణ మానసిక స్థితి ఎలా ఉందిప్పుడు: గట్టు | Balakrishna, mental status This is how : gattu | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ మానసిక స్థితి ఎలా ఉందిప్పుడు: గట్టు

Published Mon, Apr 28 2014 2:06 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

బాలకృష్ణ మానసిక స్థితి  ఎలా ఉందిప్పుడు: గట్టు - Sakshi

బాలకృష్ణ మానసిక స్థితి ఎలా ఉందిప్పుడు: గట్టు

హైదరాబాద్: సినీనటుడు బాలకృష్ణ మానసికస్థితి బాగోలేదని గతంలో ఆస్పత్రులు ధ్రువీకరించినందుకు ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. బాలకృష్ణ మానసికస్థితి సాధారణంగానే ఉందని ఏ హాస్పిటల్ అయినా ధృవీకరణ పత్రం జారీ చేసిందా?, దానిని ఎన్నికల కమిషన్‌కు అందజేశారా? అని గట్టు అడిగారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం గట్టు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘బాలకృష్ణ మానసిక రోగి. సైకో సమస్యతో ఇబ్బంది పడుతున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు’ అని ఆయన అన్నారు. బాలకృష్ణ వంటి సైకోలకు టికెట్టు కేటాయించిన చంద్రబాబు అంతకంటే పెద్ద సైకో అయి ఉంటారని గట్టు దుయ్యబట్టారు. రియల్ సైకోలయిన చంద్రబాబు, బాలకృష్ణలు ఎదుటి వారిని సైకోలని విమర్శించడం హాస్యాస్పదమన్నారు.

బాలకృష్ణ మానసిక వ్యాధిగ్రస్తుడని ఆయన వైద్యం చేయించుకున్న ఆస్పత్రులే ధ్రువీకరించాయని, అందుకు సంబంధించిన పత్రాలు గట్టు మీడియాకు చూపించారు. ‘2004లో బాలకృష్ణ తన ఇంట్లో ఒక నిర్మాత, జ్యోతిష్కుడిపై కాల్పులు జరిపిన అనంతరం  కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. బాలకృష్ణకు చికిత్స అందించిన డాక్టర్ ఎన్.కృష్ణారెడ్డి వెల్లడించిన హెల్త్ బులెటిన్‌లో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయన్నారు. బాలకృష్ణ మానసిక స్థితి బాగోలేదని వైద్యుల రిపోర్టులను ఉటంకిస్తూ అప్పుడు అనేక పత్రికలతో పాటు ‘ఈనాడు’లో కూడా వార్తలు వచ్చాయని గట్టు చూపించారు.


 బాలకృష్ణ మెంటల్ కండిషన్ బాగోలేదని హైదరాబాద్‌లోని ఐదు ఆస్పత్రులతో పాటు విశాఖ, ముంబాయి, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఆస్పత్రులు ధ్రువీకరించాయని గట్టు రామచంద్రరావు వెల్లడించారు. ‘జోధ్‌పూర్‌లో సినిమా షూటింగ్ సందర్భంగా అత్యంత ఎత్తుపై నుంచి దూకి దెబ్బలు తగిలించుకున్నారు. అప్పుడు చికిత్స అందించిన వైద్యులు కూడా అదే విషయం చెప్పారు. ‘మామూలు వ్యక్తి అంత ఎత్తు నుంచి దూకరు. మానసిక పరిస్థితి బాగోలేని వ్యక్తులే ఇలాంటి చర్యలకు పాల్పడుతారు’ అని చెప్పారన్నారు. బాలకృష్ణ మెంటల్ కండిషన్ ప్రస్తుతం కూడా అలాగే ఉంటే ప్రజాప్రతినిధిగా నామినేషన్ వేసే అర్హత ఉంటుందా? అని గట్టు  ప్రశ్నించారు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, కన్న తండ్రిని మానసిక వేధింపులకు గురిచేసిన బాలకృష్ణ లాంటి వ్యక్తులకు మించిన సైకో మరొకరుండని గట్టు స్పష్టంచేశారు.
 
గట్టు వెల్లడించిన ముఖ్యాంశాలు

 తన ఇంట్లో బాలకృష్ణ కాల్పులు జరిపిన అనంతరం తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించారని వెల్లడయ్యింది. సాధారణంగా డిప్రెషన్‌లో ఉండే వ్యక్తికి ఇవ్వాల్సిన డోస్ కంటే బాలకృష్ణకు పది రెట్లు ఎక్కువడోస్ ఇవ్వాల్సి వస్తోందని హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది.
 నిమ్స్‌లో బాలకృష్ణకు చికిత్స సందర్భంగా ఆస్పత్రి డెరైక్టర్ కాకర్ల సుబ్బారావు... ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి సైకియాట్రిస్ట్‌ల బృందం నిమ్స్‌లో వారం రోజుల పాటు చికిత్స చేయాలని ఆదేశించింది. అంతేకాదు మానసిక చికిత్సను మునుముందు కూడా కొనసాగించాల్సిందేనని డాక్టర్లు పేర్కొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement