Gattu Ramachandra Rao
-
వైఎస్ జగన్‌తో కేసీఆర్ మాట్లాడితే...
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులో అసహనం పెరిగిపోతుందని, మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ అధికార ప్రతినిధులు కర్నె ప్రభాకర్, గట్టు రామచంద్రరావులు తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. బాబు ప్రతిదీ రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బాబు మనిషో, మరమనిషో అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగితే కేసీఆర్, కేటీఆర్‌లు సాటి మనుషులుగా స్పందించారని అన్నారు. వైఎస్ జగన్‌తో కేసీఆర్ మాట్లాడితే ఎందుకు అంత తత్తరపాటు అని ప్రశ్నించారు. అలిపిరిలో చంద్రబాబు మీద దాడి జరిగినపుడు తెలంగాణా బద్ధ విరోధి అయినా దాన్ని తాము ఖండించామని పేర్కొన్నారు. దాడిని ఖండిస్తే కేసీఆర్‌కు, మోదీతో సంబంధం అంటగడుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో విభేదాలు ఉండవచ్చు కానీ మానవ సంబంధాలు అనేవి ఉంటాయని చెప్పారు. హరికృష్ణ మరణంపై, హుదూద్ తుపానుపై కూడా మానవీయంగానే స్పందించామని గుర్తు చేశారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి పిలిస్తే కేసీఆర్ హాజరయ్యారని తెలిపారు. ఆపరేషన్ గరుడ నిజంగా ఉందో లేదో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ఓటుకు నోటు కేసుతో అస్థిరత్వానికి గురిచేయాలని చూసింది మాత్రం నిజమని పేర్కొన్నారు. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కోవర్టు అని చెప్పామని ఇప్పుడు అదే నిజమైందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సీనియర్లు కూడా చంద్రబాబుతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రేపు మహాకూటమి గనుక పొరపాటున అధికారంలోకి వస్తే చంద్రబాబుదే అజమాయిషీ ఉంటుందని చెప్పారు. కేసీఆర్‌కు మానవ సంబంధాలు కూడా ముఖ్యమని చంద్రబాబు గ్రహించాలని హితవు పలికారు. చంద్రబాబువి అన్నీ ఆర్ధిక సంబంధాలేనని, ఇకనైనా బాబు చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. -
మహానాడు.. సొంత డబ్బా పరనింద
వైఎస్సార్సీపీ నేత గట్టు ధ్వజం హైదరాబాద్: టీడీపీ నిర్వహిస్తోన్న మహానాడు తీరు సొంత డబ్బా పరనిందలా సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఇక్కడ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానిం చారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రజల ఆశలకు అనుగుణంగా, హామీలకు భరోసా ఇచ్చే విధంగా తీర్మానాలు ఉంటాయనుకున్న వారిని వమ్ము చేస్తోందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాబోయే కాలాన్ని చూసి భయపడుతున్నట్లుగా కనిపిస్తోందే తప్ప, పరిపాలన సాగించే దమ్మున్న నాయకుడిగా లేదన్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేయకముందే టీడీపీ కార్యకర్తలను మోసం చేసే చర్యలను చంద్రబాబు చేపట్టారని దుయ్యబట్టారు. 2019 ఎన్నికలకు సిద్ధం కావాలంటూ నాలుగు రకాల కార్యక్రమాలకు సిద్ధపడినట్లుగా కనిపిస్తోందన్నారు. ‘టీడీపీ కార్యకర్తలను మభ్యపెట్టడం, ప్రతిపక్షాన్ని బలహీనపరచాలనే దుర్బుద్ధి, తన నిజస్వరూపం బయటపడకుండా మోడీ ముసుగును కొనసాగించడం, హామీలను తూట్లు పొడిచే పేద అరుపులు అరవడం’ వంటివి ఎంచుకున్నట్లు కనిపిస్తోందన్నారు. ‘టీడీపీ ప్రత్యర్థుల మీద కక్షసాధింపు ఉండదు, రాజశేఖరరెడ్డి పరిపాలన ప్రారంభం కాగానే టీడీపీ కార్యకర్తల హత్యలకు పురిగొల్పారు అంటూ ఒక ద్వేషాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ పరిపాలన కేవలం టీడీపీ కార్యకర్తలను చంపడానికి ప్రారంభించిందనడాన్ని.. ఒక్కసారి ఆ కార్యకర్తలు అక్కడ మననం చేసుకోవాలి’ అని అన్నారు. -
లగడపాటివి బెట్టింగ్ సర్వేలు: గట్టు
హైదరాబాద్: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెలువరించిన సర్వేలు బెట్టింగ్‌ల కోసమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విమర్శించారు. రాజకీయ సన్యాసం తీసుకున్నానంటున్న లగడపాటి.. సంపాదనే లక్ష్యంగా బెట్టింగ్ వ్యాపారం మొద లు పెట్టారని, అందులో భాగంగానే సర్వేలంటూ చిలకజోస్యం చెబుతున్నారని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రలో వైఎస్సార్సీపీకి సార్వత్రిక ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబోతున్నాయని తెలిసిన తర్వాత ఆ పార్టీ గెలుస్తుందని లగడపాటి భారీగా బెట్టింగ్‌లు కాశారని, దీనికి సంబంధించిన స్పష్టమైన సమాచారం తమ వద్ద ఉందన్నారు. అయితే, బెట్టింగ్ కోసం టీడీపీ వాళ్లు ముందుకు రాకపోయేసరికి వారిని నమ్మించేందుకు లగడపాటి ఒక హైప్ సృష్టిస్తున్నారని ఆరోపించారు. -
టీ కాంగ్రెస్‌వి అర్థం లేని ఆరోపణలు: గట్టు
కేసీఆర్‌తో అన్ని విధాలా అంటకాగింది కాంగ్రెస్ నేతలేనని విమర్శ హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి, టీఆర్ఎస్ నేత కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందమంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్థం లేనివని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. నోరుందని ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడటం సరికాదని హితవు పలికారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో గట్టు మీడియాతో మాట్లాడుతూ.. తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత సహజమో, సీమాంధ్రలో జగన్మోహన్రెడ్డి విజయబావుటా ఎగురవేయడం అంతే సహజమని చెప్పారు. సీమాంధ్రలో జగన్ సీఎం అవుతారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం మీడియా సమావేశం పెట్టి మరీ జగన్, కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందమంటూ ఇష్టమొచ్చిన రీతిలో విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మొన్నటి వరకూ కేసీఆర్‌తో అన్ని విధాలా అంటకాగింది కాంగ్రెస్ వారేనని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన విషయంలో కేసీఆర్, జగన్ భిన్న ధృవాలని, వారి మధ్య లేని సంబంధాల ను తేవద్దని కోరారు. రాష్ట్ర విభజన జరగాలంటూ ఒకరు, వద్దని మరొకరు పోరాటాలు చేశారన్నారు. టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ రెండు వేర్వేరు ప్రజా ప్రయోజనాలతో పోరాటం చేస్తున్న పార్టీలని, వీటి మధ్య ఎలాంటి చీకటి ఒప్పందాలు లేవన్నారు. దుర్మార్గమైన ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టించొద్దని చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణలోనూ అధికారంలోకి రా వాలని వైఎస్సార్ సీపీ కోరుకుంటుందనీ, వైఎస్ పథకాలను అమలు చేయాలని కేసీఆర్‌పైనా ఒత్తిడి తెస్తామన్నారు. -
కెసిఆర్ వ్యాఖ్యలతో వైఎస్ఆర్సిపికి సంబంధంలేదు
హైదరాబాద్: టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు వ్యాఖ్యలతో వైఎస్ఆర్సిపికి సంబంధం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి సీఎం కావడం తథ్యం అని, దానికి సర్వేలు అవసరం లేదని చెప్పారు. రాష్ట్ర విభజన విషయంలో జగన్, కేసీఆర్‌లు భిన్న ధృవాలన్నారు. యువత బలిదానాలకు కారణం యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అని చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం వైఎస్ఆర్సిపి పోరాడుతుందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ పాగా వేస్తామని గట్టు చెప్పారు. -
చంద్రబాబుది మాయా కూటమి
- గట్టు రామచంద్రరావు కృత్తివెన్ను/బంటుమిల్లి, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుది మాయాకూటమి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు రామచంద్రరావు అన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కృత్తివెన్ను, బంటుమిల్లి వచ్చిన ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ఓడిపోతానన్న సంగతి ముందే తెలుసని అందుకే బీజేపీతో, పవన్‌కల్యాణ్‌లను కలుపుకొన్నాడన్నారు. తాను ఓడిపోయిన తరువాత నింద వీరిపై మోపడానికే ఇది ముందస్తు ఎత్తుగడని అభివర్ణించారు. సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కింగ్ అని, తెలంగాణలో కింగ్ మేకర్‌గా వ్యవహరిస్తుందని చెప్పారు. సీమాంధ్రలో 140 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు. పవన్‌కల్యాణ్ సినిమా బుక్కింగ్ లాంటివాడని, ప్రస్తుతం ఆయనను టీడీపీ ఇతరులను దూషించడానికి బుక్ చేసుకుందన్నారు. 32 అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంటు స్థానాలను సీమాంధ్రలో ఒక్క సామాజిక వర్గానికి కేటాయించిన మంచి మనిషిగా జగన్‌ను అభివర్ణించారు. వైఎస్ఆర్ సీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజల గుండెలను తాకిందని, ఇప్పటికే ప్రజల గుండెల్లో కొలువైన వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారన్నారు. ఈ సందర్భంగా పెడన నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి వేదవ్యాస్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు మరింత మెరుగుగా అమలు కావాలంటే జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా రావాలన్నారు. రాబోయే రోజుల్లో జగన్ సారధ్యంలో ఈప్రాంతంలో రెండు పంటలకు పూర్తిస్థాయిలో నీరు అందిస్తామన్నారు. -
బాలకృష్ణ మానసిక స్థితి ఎలా ఉందిప్పుడు: గట్టు
హైదరాబాద్: సినీనటుడు బాలకృష్ణ మానసికస్థితి బాగోలేదని గతంలో ఆస్పత్రులు ధ్రువీకరించినందుకు ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. బాలకృష్ణ మానసికస్థితి సాధారణంగానే ఉందని ఏ హాస్పిటల్ అయినా ధృవీకరణ పత్రం జారీ చేసిందా?, దానిని ఎన్నికల కమిషన్‌కు అందజేశారా? అని గట్టు అడిగారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం గట్టు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘బాలకృష్ణ మానసిక రోగి. సైకో సమస్యతో ఇబ్బంది పడుతున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు’ అని ఆయన అన్నారు. బాలకృష్ణ వంటి సైకోలకు టికెట్టు కేటాయించిన చంద్రబాబు అంతకంటే పెద్ద సైకో అయి ఉంటారని గట్టు దుయ్యబట్టారు. రియల్ సైకోలయిన చంద్రబాబు, బాలకృష్ణలు ఎదుటి వారిని సైకోలని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. బాలకృష్ణ మానసిక వ్యాధిగ్రస్తుడని ఆయన వైద్యం చేయించుకున్న ఆస్పత్రులే ధ్రువీకరించాయని, అందుకు సంబంధించిన పత్రాలు గట్టు మీడియాకు చూపించారు. ‘2004లో బాలకృష్ణ తన ఇంట్లో ఒక నిర్మాత, జ్యోతిష్కుడిపై కాల్పులు జరిపిన అనంతరం కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. బాలకృష్ణకు చికిత్స అందించిన డాక్టర్ ఎన్.కృష్ణారెడ్డి వెల్లడించిన హెల్త్ బులెటిన్‌లో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయన్నారు. బాలకృష్ణ మానసిక స్థితి బాగోలేదని వైద్యుల రిపోర్టులను ఉటంకిస్తూ అప్పుడు అనేక పత్రికలతో పాటు ‘ఈనాడు’లో కూడా వార్తలు వచ్చాయని గట్టు చూపించారు. బాలకృష్ణ మెంటల్ కండిషన్ బాగోలేదని హైదరాబాద్‌లోని ఐదు ఆస్పత్రులతో పాటు విశాఖ, ముంబాయి, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఆస్పత్రులు ధ్రువీకరించాయని గట్టు రామచంద్రరావు వెల్లడించారు. ‘జోధ్‌పూర్‌లో సినిమా షూటింగ్ సందర్భంగా అత్యంత ఎత్తుపై నుంచి దూకి దెబ్బలు తగిలించుకున్నారు. అప్పుడు చికిత్స అందించిన వైద్యులు కూడా అదే విషయం చెప్పారు. ‘మామూలు వ్యక్తి అంత ఎత్తు నుంచి దూకరు. మానసిక పరిస్థితి బాగోలేని వ్యక్తులే ఇలాంటి చర్యలకు పాల్పడుతారు’ అని చెప్పారన్నారు. బాలకృష్ణ మెంటల్ కండిషన్ ప్రస్తుతం కూడా అలాగే ఉంటే ప్రజాప్రతినిధిగా నామినేషన్ వేసే అర్హత ఉంటుందా? అని గట్టు ప్రశ్నించారు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, కన్న తండ్రిని మానసిక వేధింపులకు గురిచేసిన బాలకృష్ణ లాంటి వ్యక్తులకు మించిన సైకో మరొకరుండని గట్టు స్పష్టంచేశారు. గట్టు వెల్లడించిన ముఖ్యాంశాలు తన ఇంట్లో బాలకృష్ణ కాల్పులు జరిపిన అనంతరం తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించారని వెల్లడయ్యింది. సాధారణంగా డిప్రెషన్లో ఉండే వ్యక్తికి ఇవ్వాల్సిన డోస్ కంటే బాలకృష్ణకు పది రెట్లు ఎక్కువడోస్ ఇవ్వాల్సి వస్తోందని హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది. నిమ్స్‌లో బాలకృష్ణకు చికిత్స సందర్భంగా ఆస్పత్రి డెరైక్టర్ కాకర్ల సుబ్బారావు... ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి సైకియాట్రిస్ట్‌ల బృందం నిమ్స్‌లో వారం రోజుల పాటు చికిత్స చేయాలని ఆదేశించింది. అంతేకాదు మానసిక చికిత్సను మునుముందు కూడా కొనసాగించాల్సిందేనని డాక్టర్లు పేర్కొన్నారు. -
జగన్‌ను ఎదుర్కోలేకే బాబు మాయకూటమి:గట్టు రామచంద్రరావు
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాయకూటమిని ఏర్పాటు చేశారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. 2009లో రాజశేఖరరెడ్డిని ఎదుర్కొనలేక మహా కూటమిని ఏర్పాటు చేసిన చంద్రబాబుకు వచ్చిన ఫలితమే ఇప్పుడూ పునరావృతమవుతుందని చెప్పారు. బుధవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. జెండా, ఎజెండా లేని సినీ నటుడు పవన్‌కల్యాణ్‌తో మూడు నెలల ప్యాకేజీ మాట్లాడుకొని నాలుగు సినిమా డైలాగులు చెప్పించుకొని చంద్రబాబు మురిసిపోతున్నారని విమర్శించారు. టీడీపీకి పవన్ మద్దతు పలకడానికి చంద్రబాబు తొమ్మిదేళ్ల దరిద్రపు పాలన అంతగా నచ్చిందా అన్ని గట్టు ప్రశ్నించారు. ‘‘బాబు పాలనలో ఎనిమిదిసార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. ధరలు తగ్గించమని ఉద్యమించిన వారిపై పోలీసుల చేత కాల్పులు జరిపిన ఘటన మరిచారా? కరెంట్ బిల్లులు చెల్లించలేదని రైతులను పీడీ యాక్టు కింద జైళ్లలో పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు. ఆ అవమానం భరించలేక వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది’’ అని అన్నారు. తమ అధినేత జగన్, దివంగత వైఎస్‌లపైన అవాకులు చెవాకులు మాట్లాడితే పవన్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌కు హోల్‌సేల్‌గా అమ్ముకున్న చిరంజీవి, పవన్‌కల్యాణ్ ఇద్దరూ ఎన్నికల సందర్భంగా ప్రజలను మళ్లీ మోసగించడానికి కొత్త వేషం వేసుకొస్తున్నారని విమర్శించారు. పవన్ పుట్టు పూర్వోత్తరాలు బయట పెడితే అన్నదమ్ములు రాష్ట్రంలో ఉండకుండా పారిపోతారని హెచ్చరించారు. -
కంగుతిని.. పిచ్చికూతలు
ఎల్లో మీడియాపై గట్టు ధ్వజం హైదరాబాద్: తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ తన అభ్యర్థులను బరిలోకి దింపేసరికి, ఇన్నాళ్లూ దుష్ర్పచారం చేసిన ఎల్లో మీడియా కంగుతిని పిచ్చి రాతలు రాస్తోందని పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. చనిపోయిన టీడీపీ వద్ద జ్యోతి వెలిగించేందుకు ఎల్లోగ్యాంగ్ శతవిధా లా ప్రయత్నిస్తూ.. తమ పార్టీపై అక్కసు వెళ్లగక్కుతోందని మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్కు వైఎస్సార్సీపీ సహకరిస్తోందంటూ ఓ తోకపత్రిక కథనాలు వండివార్చుతోందని ఆగ్రహం వెలిబుచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాల నలో అత్యధికంగా లబ్ధిపొందింది తెలంగాణ ప్రాంతమేనన్నారు. మహానేత ఆకస్మిక మరణం వల్ల ఎక్కువగా చనిపోయింది తెలంగాణలోనేనన్నారు. తెలంగాణలోనూ వైఎస్ పేరు చెబితే ఓట్లు పడే పరిస్థితి కనిపించడంతో వైఎస్సార్సీపీ ఎక్కడ వేళ్లూనుకుంటుందోననే భయంతో కొత్తరకం కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో తమ పార్టీ పోటీ చేసేసరికి, తోకపత్రికకు కాంగ్రెస్‌పై అంతగా ప్రేమ పుట్టుకొచ్చిందా? లేక కాంగ్రెస్‌కు బాబుపై ప్రేమ పుట్టుకొచ్చిందా? అని గట్టు ప్రశ్నిం చారు. ‘‘తెలంగాణలో జగన్ ఓదార్పుయాత్ర చేయడానికి వస్తే రాళ్లు వేసింది టీఆర్ఎస్ కాదా? ఎర్రబెల్లి దయాకర్‌రావు ఏకంగా ధర్నా చేపట్టారు. షర్మిల పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వరద ప్రాంతాల్లో పర్యటించడానికి విజయమ్మ వస్తే అడ్డగించింది కాంగ్రెస్ కాదా? అందుకే తెలంగాణలో ఇప్పుడు మేం అడుగుపెడితే వీళ్ల అడుగులు జారిపోతాయనే భయం అన్ని పార్టీలకూ పట్టుకుంది’’ అని అన్నారు. -
జగన్‌ను తట్టుకోలేక ఎల్లోగ్యాంగ్ కుట్రలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ధ్వజం రామోజీ ఆక్రమించిన ఫిలింసిటీ భూములు, పాలమాకుల భూముల గురించి ఎందుకు రాసుకోరు? నిన్నటి దాకా సీబీఐ పవర్ఫుల్ అన్న రామోజీకి ఇప్పుడు ఎఫ్‌బీఐ పవర్‌ఫుల్‌గా కనిపించింది. గీతం యూనివర్సిటీ కుంభకోణంలో బిగ్‌బాస్ అంటే చంద్రబాబే అని రామోజీ ఆయన పత్రికలో ఎందుకు రాయలేదు? హైదరాబాద్: ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ బలహీనపడిపోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఎల్లోగ్యాంగ్‌లు రోజురోజుకు ప్రజాభిమానాన్ని పెంచుకుంటున్న జగన్‌పై కుట్రలు, కుతంత్రాలకు మరింత పదును పెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. ‘ఈనాడు రాసింది.. చంద్రబాబు వాగాడు. మళ్లీ చంద్రబాబు వాగిందే ఈనాడు రాయడం’ పరిపాటిగా మారిందన్నారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గట్టు మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల పరుగులో చతికిలపడి శల్య రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వీరి కుట్రలో భాగంగా కోతికి కొబ్బరికాయ దొరికిందన్నట్లు ఆమెరికాలోని ఎఫ్‌బీఐ సంస్థ అభియోగాలంటూ పేజీలకు పేజీలు రాసుకుంటూ జగన్‌పై ఎల్లోగ్యాంగ్ విషంగక్కుతోందని ధ్వజమెత్తారు. ‘ఈనాడు రామోజీరావుకు ఆమెరికా అభియోగాలయ్యేసరికి అంత అందంగా కనిపిస్తున్నాయా? ఏం రామోజీపై దేశంలో, రాష్ట్రంలో ఎన్ని అభియోగాలు లేవు’ అని అన్నారు. ఆమెరికాలో ఉన్న కంపెనీతో టైటానియం డీల్ ఒకటి జరిగిందని, దాంట్లో కుంభకోణముందని ఆ అభియోగంలో ఆరుగురు పేర్లను ప్రస్తావించారట! అందులో ఒకటి కేవీపీ పేరుంటే దానికి జవాబు చెప్పుకోవాల్సింది ఆయనే. దాన్ని తీసుకొచ్చి ‘సిన్నోడి మేతే’ అంటూ రామోజీ తన పత్రికలో రాస్తారు. దానికి చంద్రబాబు సిన్నోడంటే జగన్ అని చెబుతారు. అందులో ఎక్కడా జగన్ పేరు లేకపోయినా ఇరువురూ శివాలెత్తారు. ఎఫ్‌బీఐ ప్రస్తావించిన ఆరుగురి పేర్లలో వైఎస్ పేరుగాని, జగన్ పేరుగానీ ఎక్కడైనా ఉన్నాయా? ఎలాంటి సంబంధం లేని వాటిని తీసుకొచ్చి జగన్‌కు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫిర్టాస్ అనే వ్యక్తి అసలు ఎవరికీ ముడుపులు ఇవ్వలేదంటున్నారు. కానీ దీన్ని తీసుకొచ్చి జగన్‌కు అంటగట్టడం సిగ్గుచేటు. ఎఫ్‌బీఐ మోపిన అభియోగంలో సీఎంకు బంధువని ప్రస్తావించారు. రక్తం పంచుకు పుట్టిన జగన్ ఏమైనా వైఎస్‌కు బంధువా? కుటుంబ సభ్యులను ఎక్కడైనా బంధువుగా ప్రస్తావిస్తారా? అంటే వారి ఆలోచన ప్రకారం చంద్రబాబుకు ఆయన కుమారుడు లోకేష్ బంధువా? రామోజీకి వారి కొడుకులు సుమన్, కిరణ్‌లు బంధువులా? వీరి తీరు చూస్తుంటే చంద్రబాబు ఇంట్లో పిల్లి పాలు తాగకపోయినా దానికి జగన్ కుట్రే ఉందని ఎల్లోగ్యాంగ్ ప్రచారం చేసేలా ఉంది! జనాభిమానాన్ని పొందలేకజగన్ ఫోబియో పట్టుకొని నిత్యం బురద చల్లే ప్రయత్నంలో చంద్రబాబు, రామోజీ మునిగిపోయారు. ఓట్లు, సీట్ల కోసం ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తారా? వైఎస్ మరణం తర్వాత నాలుగేళ్లుగా ఎన్నో తప్పుడు ప్రచారాలు, అక్రమ కేసులతో అభాండాలు మోపుతూనే ఉన్నారు. రామోజీ.. అబ్దులాపూర్‌మెట్ దగ్గర నుంచి రామోజీ ఫిలిం సిటీ దాకా ఉన్న నాలుగు కిలోమీటర్ల దారి నీకెక్కడిదో, ఎవరి దగ్గర కొన్నావో నీ పత్రికలో రాసుకోగలవా? ఫిలిం సిటీలో ఉన్న 20 ఎకరాల అసైన్డ్ భూమిని వదిలిపెట్టావా? పాలమాకులలో అక్రమంగా ఆక్రమించుకున్న 320 ఎకరాల విషయాన్ని రాస్తావా? రామోజీని ఎన్నిసార్లు అరెస్టు చేయలేదు? విశాఖలోని ఈనాడు స్థలం వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో మొట్టికాయలు వేసిన విషయాన్ని ఎందుకు రాయలేదు? రామోజీకి సీబీఐకన్నా ఎఫ్‌బీఐ పవర్‌ఫుల్‌గా కనిపించిందట! నిన్నటిదాకా సీబీఐని మించిన పవర్ఫుల్ సంస్థ మరొకటి లేదన్నారు. అంతకుముందు అదే సీబీఐని... కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ప్రచారం చేసినదీ రామోజీయే. ఆ సంస్థ జగన్ కేసు చేపట్టే సరికి పునీతమైందట! అసెంబ్లీలో గీతం యూనివర్సిటీ కుంభకోణంలో బిగ్‌బాస్ ఉన్న లెటర్‌ను మైసూరారెడ్డి బయటపెడితే, ఈ బిగ్‌బాస్ చంద్రబాబే అని రామోజీ ఆయన పత్రికలో ఎందుకు రాయలేదు? -
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్ఆర్సిపి మ్యానిఫెస్టో
హైదరాబాద్: రెండు ప్రాంతాల ప్రజల అభీష్టాన్ని ప్రతిబింభించే విధంగా వైఎస్ఆర్ సిపి మ్యానిఫెస్టో ఉంటుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మ్యానిఫెస్టోను రూపొందింస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే తమ మ్యానిఫెస్టో విడుదల చేస్తామని చెప్పారు. ప్రజలందరి అభిప్రాయాలను క్రోడీకరిస్తున్నట్లు మ్యానిఫెస్టో కమిటీ సభ్యుడు కూడా అయిన గట్టు తెలిపారు. తమ మ్యానిఫెస్టోలో సంక్షేమం, అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ఉంటాయని చెప్పారు. -
ఢిల్లీలో పెద్ద డ్రామా!
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తమ ఎంపిల బహిష్కరణ పేరుతో ఢిల్లీలో పెద్ద డ్రామాకు తెరలేపిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేవంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో ధర్నా చేసిన సీఎంను, విభజనను వ్యతిరేకిస్తున్న కేంద్ర మంత్రులను ఎందుకు బహిష్కరించడంలేదు? అని ఆయన అడిగారు. ప్రతిపక్ష నేతల గుమ్మాల తొక్కి బ్రతిమాలుకునే దుస్థితికి నేడు కేంద్రం దిగజారిందన్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులకు సిగ్గు ఉందా? మీరు తెలుగువారు కాదా? మీకు చీము, నెత్తురు లేదా? అని ప్రశ్నించారు. ఇష్టమొచ్చినట్లు విభజించడానికి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అబ్బ సొత్తా? అని గట్టు మండిపడ్డారు. -
'కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుకు చంద్రబాబు విధానాలే కారణం'
హైదరాబాద్: కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విధానాలే కారణమని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. బాబు ఆరోజు ప్రాజెక్టులను నిర్మించి ఉంటే ఇవాళ ట్రైబ్యునల్ కేటాయింపులు ఇచ్చే అవకాశం ఉండేది కాదని ఆయన తెలిపారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్ట్‌లను చంద్రబాబు అడ్డుకోకుండా చోద్యం చూడటం వల్లే ఈ రోజు దుస్థితి వచ్చిందన్నారు. ఎన్టీఆర్ ప్రారంభించిన ప్రాజెక్ట్‌లను కూడా మూలన పడేసిన ఘనత బాబుకే దక్కుతుందని గట్టు ఎద్దేవా చేశారు. బాబు ప్రాజెక్ట్‌లు కోసం రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తే... వైఎస్ఆర్ రూ.50వేల కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు జనాన్ని తలుపులు మూసుకోమంటే.. జనం ఆయన్ని నోరు మూసుకోమని సమాధానం ఇచ్చారన్నారు. -
ఏకపక్షం.. నిరంకుశం
* రాష్ట్ర విభజన నిర్ణయంపై జీవోఎం ముందు వైఎస్సార్ సీపీ స్పష్టీకరణ * సమైక్యాంధ్రప్రదేశ్‌ను యథాతథంగా కొనసాగించాలి * సరైన హేతుబద్ధత, ప్రాతిపదిక లేకుండా రాష్ట్రాన్ని విడదీయడం సమంజసం కానేకాదు * జగన్ రాసిన 8 పేజీల లేఖను జీవోఎంకు అందజేసిన మైసూరా * మైసూరాతోపాటు జీవోఎం సభ్యులతో భేటీ అయిన గట్టు * ఓట్ల కోసమో, సీట్ల కోసమో విభజన దురదృష్టకరమన్నాం: మైసూరా * నదీ జలాల సమస్యను, అన్నిటికీ కార్యక్షేత్రమైన హైదరాబాద్ గురించి వివరించాం * ఏదైనా బిల్లు తెచ్చి సోనియాను దేశం విడిచి వెళ్లమంటే మీరెంత బాధపడతారని అడిగాం * మా ప్రశ్నలకు జవాబు చెప్పలేక మౌనంగా కూర్చున్నారు * కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలాగా వ్యవహరిస్తోంది సాక్షి, న్యూఢిల్లీ: ఏకపక్షంగా, నిరంకుశంగా రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రుల బృందానికి (జీవోఎం) సుస్పష్టంగా చెప్పింది. సరైన హేతుబద్ధత, గట్టి ప్రాతిపదిక లేకుండా రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని విభజించడం సమంజసం, సమర్థనీయం కానే కాదని తెలిపింది. సమైక్యాంధ్రప్రదేశ్ అనే తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితేనే మూడు ప్రాంతాల్లోనూ అభివృద్ధి సాధ్యమని పేర్కొంది. సమైక్యాంధ్రప్రదేశ్‌ను యథాతథంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేసింది. జీవోఎం ఆహ్వానం మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎం.వి.మైసూరారెడ్డి, గట్టు రామచంద్రరావు బుధవారం ఉదయం హోం శాఖ కార్యాలయంలో జీవోఎం సభ్యులతో భేటీ అయ్యారు. విభజనపై పార్టీ వైఖరిని స్పష్టం చేస్తూ.. కాంగ్రెస్, కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. సమైక్యాంధ్రనే కొనసాగించాలని కోరుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన ఎనిమిది పేజీల లేఖను మైసూరా వారికి అందజేశారు. జీవోఎం సభ్యుల్లో ముగ్గురు మాత్రమే.. సుశీల్‌కుమార్‌షిండే, జైరాం రమేశ్, వీరప్పమొయిలీ పాల్గొన్న ఈ భేటీ 20 నిమిషాల పాటు కొనసాగింది. వీరు కూడా మైసూరా బృందం చెప్పిన అంశాలను వినడానికే పరిమితమయ్యారు తప్ప ఏమీ మాట్లాడలేదని తెలిసింది. చివర్లో షిండే మాత్రం ‘మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. జీవోఎంతో భేటీ అనంతరం మైసూరా విలేకరులతో మాట్లాడారు. ‘‘పార్టీ, ప్రభుత్వం మధ్య ఓ లక్ష్మణ రేఖ ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలాగా వ్యవహరిస్తోంది. అంతా వాళ్ల సొంతింటి వ్యవహారంలా ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. పార్టీలతో ఈ భేటీలు కూడా కంటితుడుపు చర్య మాత్రమే. వాళ్లు చేయదల్చుకున్నదేదో చేస్తూ ఏదో రికార్డు కోసం ఇదంతా సాగిస్తున్నారు. పేరుకు పార్టీలను సంప్రదించినా అవి చెప్పేదేం చేయడం లేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలి ఆదేశాల ప్రకారమే వారు నడుచుకుంటున్నారు’’ అని మండిపడ్డారు. జీవోఎం స్పందన ఏమిటని అడగ్గా.. ‘‘వాళ్లకు 112 ప్రశ్నలు సంధించాం. వాటికి జవాబు చెప్పలేక మౌనంగా కూర్చున్నారు..’’ అని మైసూరా చెప్పారు. పార్టీ తరఫున జీవోఎం ముందు చేసిన వాదనను ఆయన వివరించారు. నదీ జలాలు చాలా క్లిష్టమైన సమస్య ‘‘కొందరు ప్రత్యేక రాష్ట్రం సోనియాగాంధీ బర్త్‌డే గిఫ్ట్ అని అన్నారు. అదేనా విభజనకు మీ ప్రాతిపదిక? దేశంలో మరెన్నో ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు ఉన్నాయి. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఒక్క ఆంధ్రప్రదేశ్ విషయంలోనే ఎందుకంత స్పీడ్‌గా వెళుతున్నారు? విభజనతో ఉత్పన్నమయ్యే సమస్యల గురించి ఆలోచించడం లేదు. 70 శాతం మంది ప్రజల అభిప్రాయాలను మీరు గుర్తించడం లేదు. ఓట్ల కోసమో, సీట్ల కోసమో రాష్ట్రాన్ని విభజించాలనుకోవడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా నదీజలాలు చాలా క్లిష్టమైన సమస్య. ఇప్పటికే ఎన్నో ట్రిబ్యునళ్లు ఉన్నాయి. ఆ ట్రిబ్యునళ్లు ఇచ్చిన ఆదేశాలను ఏ రాష్ట్రమూ పాటించడం లేదు, మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టును నిర్మిస్తే మీరేం చేయగలిగారు?’’ అని అడిగినట్లు మైసూరా తెలిపారు. మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలి ‘‘ సోనియాగాంధీ మనదేశ పౌరసత్వం తీసుకుని 30 ఏళ్లవుతోంది. ఇప్పుడు ఏదైనా బిల్లు తెచ్చి ఈ పౌరసత్వం చెల్లదని.. దేశం విడిచి వెళ్లమంటే మీరెంత బాధపడతారు? అలాగే 60 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉన్నవారిని ఒక్కసారే వెళ్లిపోమంటే ఎంత సెంటిమెంట్‌గా ఫీలవుతారో.. ఎంత బాధ పడతారో మీరు అర్థం చేసుకుంటున్నారా?’’ అని లేఖలో ప్రశ్నించినట్టు చెప్పారు. జీవోఎంకు నిర్దేశించిన 11 విధివిధానాలపై తమ అభిప్రాయాల్ని అడగలేదని, తాము సమైక్యంగా ఉండాలని చెప్తున్నం దున వాటిపై అభిప్రాయం అడిగేదేముంటుందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. జగన్ వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతల్ని కలుస్తారు అధికారంలో ఉన్న పార్టీ బలహీనంగా ఉన్నచోట రాష్ట్రాన్ని విభజించడానికి పూనుకుంటే అది దేశ సమగ్రతకు ముప్పు కలిగిస్తుందని పేర్కొంటూ.. దేశ ప్రయోజనాల కోసం, సమాఖ్య వ్యవస్థ పరిరక్షణార్థం విభజన బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ జగన్మోహన్రెడ్డి వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీలనూ కలుస్తారని మైసూరా తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏకాభిప్రాయాన్ని కూడగడతారన్నారు. విభజనపై తమ నిరసనలు, పోరాటం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ‘‘ఇప్పటివరకు అధికార పార్టీ ఇష్టానుసారం చేసింది. ఇకమీదట కుదరదు. మేమైతే బిల్లుకు వ్యతిరేకంగా మద్దతు కూడగడతాం’’ అని చెప్పారు. హైదరాబాద్ విషయంలోనూ కేంద్రం ఆలోచన సరికాదని, శాంతిభద్రతలు, రెవెన్యూ తదితర అంశాలను గవర్నర్‌కి ఇవ్వడమో లేదా కేంద్రం చేతిలోకి తీసుకోవడమో సబబు కాదని, ఇది ఫెడరలిజం స్ఫూర్తికి విరుద్ధమని, రాష్ట్రాల అధికారాలను ఈ తరహాలో ఆక్రమించడం సమర్థనీయం కాదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. అప్పుడు, ఇప్పుడు సమైక్యమే... రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న మాటను లోగడ ఎందుకు కేంద్రానికి చెప్పలేదన్న ప్రశ్నకు మైసూరా స్పందిస్తూ.. ‘‘ఆర్టికల్ 3 ప్రకారం అధికారం ఉందని మాపై పెత్తనం చేయొద్దు. మీరు ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయండి. అందరికీ న్యాయం జరిగేటట్టు, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు మీ ఆలోచన ఉండాలని మేం చెప్పాం. ఆ రోజున మేం చెప్పినదాని అర్థం విభజన చేయాలని కాదు. సమస్యను పరిష్కరించలేరు కనుక యథాతథంగా ఉంచాలని అర్థం స్ఫురించేలా మేం మా వైఖరి చెప్పాం. దానికి మీరు వక్రభాష్యం చెప్పడం సరికాదు. మేం ఆ రోజున చెప్పింది సమైక్యమే.. ఇప్పుడు చెప్తున్నదీ సమైక్యమే’’ అని స్పష్టం చేశారు. నేరుగా సమైక్యమని అప్పుడు ఎందుకు చెప్పలేదని అడగ్గా.. ‘‘అప్పటి పరిస్థితుల్లో వారు అడిగినదానికి మేం అది చెప్పాం. ఇప్పుడు విభజిస్తున్నాం, మీ అభిప్రాయం చెప్పండి అంటే విభజన వద్దు, సమైక్యంగా ఉంచండని కోరుతున్నాం.. ఇందులో డొంక తిరుగుడు ఏం లేదు.’’ అని ఆయన వివరించారు. ‘‘సెంటిమెంట్ వేరు, అభివృద్ధి వేరు. విభజిస్తే మూడు ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగదని, నష్టపోతారని మేం చెప్తున్నాం. సెంటిమెంట్‌ని గౌరవించడం వేరు, విభజన వేరు. విభజన అనేది పరిష్కారం కాదు. సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అనేది మా పార్టీ అభిప్రాయం’’ అని కొన్ని ప్రశ్నలకు జవాబుగా మైసూరా చెప్పారు. సమైక్యంగా ఉంటే అభివృద్ధి జరిగే పరిస్థితి తప్పకుండా ఉందన్నారు. తెలుగుజాతికి పట్టిన తెగుళ్లు టీడీపీ, కాంగ్రెస్‌లు: గట్టు విభజన పేరుతో టీడీపీ, కాంగ్రెస్‌లు తెలుగు ప్రజలను హింసిస్తున్నాయని గట్టు అన్నారు. ఆ రెండు పార్టీలు తెలుగు జాతికి పట్టిన తెగుళ్లుగా ఆయన అభివర్ణించారు. జీవోఎంతో భేటీ అనంతరం ఏపీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన విషయంలో ఆ రెండు పార్టీలు డబుల్‌గేమ్ ఆడుతూ, ప్రజలను మభ్యపెడుతున్నాయని అన్నారు. తెలంగాణపై ప్రజల్లో అయోమయాన్ని సృష్టిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ కార్యాలయాన్ని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి తరలించాలని సూచించారు. వెనుకబాటుతనానికి విభజన ఏమాత్రం పరిష్కారం కాదని అన్నారు. సమర్థ పరిపాలన, అభివృద్ధి ద్వారా వెనుకబాటుతనాన్ని అధిగమించవచ్చని తెలిపారు. తెలంగాణలో మెజార్టీ ప్రజలు విభజనను కోరుకోవడం లేదన్నారు. -
'జగన్ విమర్శించే అర్హత డీకే అరుణకు లేదు'
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డిని విమర్శించే అర్హత మంత్రి డీకే అరుణకు లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. రాజకీయంగా పెంచి పెద్ద చేసిన వైఎస్ కుటుంబంపై ఆరోపణలు చేయడం ఆమెకు తగదని గట్టు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ నేతల వైఖరిని తప్పుబట్టారు. వైఎస్ జగన్ చెప్పినట్లు కాంగ్రెస్ నేతలు కల్లు తాగిన కోతుల్లా ప్రవర్తిస్తున్నారని గట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమన్యాయం చేయాలని కోరుతున్న జగన్ పై అరుణ వ్యాఖ్యలు ఎంతమాత్రం తగదన్నారు. విభజన అనివార్యమైతే ఆమె సొంత జిల్లా మహబూబ్ నగర్ పూర్తిగా ఎడారి మారుతుందన్న విషయాన్ని ఆమె గ్రహించాలని గట్టు హితవు పలికారు. -
సమైక్యశంఖారావం పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్: రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించరాదని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈనెల 26న నిర్వహించ తలపెట్టిన ‘సమైక్యశంఖారావం’ పోస్టర్‌ను ఆదివారమిక్కడ పార్టీనేతలు ఆవిష్కరించారు. ‘జనం మాటే జగన్ బాట’ నినాదంతో రూపొందించిన పోస్టర్‌ను, రాష్ట్ర సమైక్యంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించిన కరపత్రాన్ని నేతలు విడుదల చేశారు. ఈ పోస్టర్లో తెలుగుతల్లి చిత్రంతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చిత్రాలను పొందుపరిచారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గట్టు రామచంద్రరావు, కె.శివకుమార్, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, ఆదం విజయ్‌కుమార్, లింగాల హరిగౌడ్, మహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... సమైక్యశంఖారావం ఒక చారిత్రక అవసరమన్నారు. సమైక్యవాదులంతా పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభను చూసిన తర్వాతైన ప్రజల ఆకాంక్ష మేరకు కేంద్ర పాలకులు విభజన నిర్ణయం మార్చుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు -
నిర్భయ తీర్పును స్వాగతించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
గతేడాది డిసెంబర్లో న్యూఢిల్లీ సామూహిక అత్యాచారం గురైన నిర్భయ కేసులో దోషులకు కోర్టు ఉరిశిక్ష విధించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం స్వాగతించింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు గట్టు రామచంద్రరావు శుక్రవారం ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మానవ మృగాలుగా ప్రవర్తించిన దోషులకు ఇది సరైన శిక్ష అని ఆయన అభివర్ణించారు. దేశంలో మహిళలకు భరోసా కల్పించడంలో ప్రభుత్వాలు ఘోరం విఫలం అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది డిసెంబర్లో దేశ రాజధాని న్యూఢిల్లీలో ఫార్మాసీ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమెపై అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ఆమె న్యూఢిల్లీలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, మెరుగైన చికిత్స కోసం సింగపూర్ తరలించారు. అయితే నిర్భయ అక్కడ చికిత్స పొందుతూ డిసెంబర్ నెలాఖరున మరణించింది. ఆ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. దీంతో ఆ ఆరుగురు నిందితులను కఠినంగా శిక్షించాల దేశంలోని పలు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాకేత్ కోర్టు నలుగురు నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేసింది. అయితే మరో ఇద్దరు నిందితుల్లో ఒకరు తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు బాలనేరస్తుడు కావడంతో అతడికి ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.