కంగుతిని.. పిచ్చికూతలు | shock to nonsenses | Sakshi
Sakshi News home page

కంగుతిని.. పిచ్చికూతలు

Published Sun, Apr 13 2014 1:03 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM

కంగుతిని.. పిచ్చికూతలు - Sakshi

కంగుతిని.. పిచ్చికూతలు

ఎల్లో మీడియాపై గట్టు ధ్వజం

 హైదరాబాద్: తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ తన అభ్యర్థులను బరిలోకి దింపేసరికి, ఇన్నాళ్లూ దుష్ర్పచారం చేసిన ఎల్లో మీడియా కంగుతిని పిచ్చి రాతలు రాస్తోందని పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. చనిపోయిన టీడీపీ వద్ద జ్యోతి వెలిగించేందుకు ఎల్లోగ్యాంగ్ శతవిధా లా ప్రయత్నిస్తూ.. తమ పార్టీపై అక్కసు వెళ్లగక్కుతోందని మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు వైఎస్సార్‌సీపీ సహకరిస్తోందంటూ ఓ తోకపత్రిక కథనాలు వండివార్చుతోందని ఆగ్రహం వెలిబుచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాల నలో అత్యధికంగా లబ్ధిపొందింది తెలంగాణ ప్రాంతమేనన్నారు. మహానేత ఆకస్మిక మరణం వల్ల ఎక్కువగా చనిపోయింది తెలంగాణలోనేనన్నారు.

తెలంగాణలోనూ వైఎస్ పేరు చెబితే ఓట్లు పడే పరిస్థితి కనిపించడంతో వైఎస్సార్‌సీపీ ఎక్కడ వేళ్లూనుకుంటుందోననే భయంతో కొత్తరకం కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో తమ పార్టీ పోటీ చేసేసరికి, తోకపత్రికకు కాంగ్రెస్‌పై అంతగా ప్రేమ పుట్టుకొచ్చిందా? లేక కాంగ్రెస్‌కు బాబుపై ప్రేమ పుట్టుకొచ్చిందా? అని గట్టు ప్రశ్నిం చారు. ‘‘తెలంగాణలో జగన్ ఓదార్పుయాత్ర చేయడానికి వస్తే రాళ్లు వేసింది టీఆర్‌ఎస్ కాదా? ఎర్రబెల్లి దయాకర్‌రావు ఏకంగా ధర్నా చేపట్టారు. షర్మిల పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వరద ప్రాంతాల్లో పర్యటించడానికి విజయమ్మ వస్తే అడ్డగించింది కాంగ్రెస్ కాదా? అందుకే తెలంగాణలో ఇప్పుడు మేం అడుగుపెడితే వీళ్ల అడుగులు జారిపోతాయనే భయం అన్ని పార్టీలకూ పట్టుకుంది’’ అని అన్నారు.     
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement