సమైక్యశంఖారావం పోస్టర్ ఆవిష్కరణ | ysrcp released samaikya shankaravam poster | Sakshi
Sakshi News home page

సమైక్యశంఖారావం పోస్టర్ ఆవిష్కరణ

Published Sun, Oct 20 2013 6:55 PM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

ysrcp released samaikya shankaravam poster

 హైదరాబాద్: రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించరాదని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈనెల 26న నిర్వహించ తలపెట్టిన ‘సమైక్యశంఖారావం’ పోస్టర్‌ను ఆదివారమిక్కడ పార్టీనేతలు ఆవిష్కరించారు. ‘జనం మాటే జగన్ బాట’ నినాదంతో రూపొందించిన పోస్టర్‌ను, రాష్ట్ర సమైక్యంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించిన కరపత్రాన్ని నేతలు విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో తెలుగుతల్లి చిత్రంతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చిత్రాలను పొందుపరిచారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గట్టు రామచంద్రరావు, కె.శివకుమార్, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, ఆదం విజయ్‌కుమార్, లింగాల హరిగౌడ్, మహ్మద్ పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... సమైక్యశంఖారావం ఒక చారిత్రక అవసరమన్నారు. సమైక్యవాదులంతా పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభను చూసిన తర్వాతైన ప్రజల ఆకాంక్ష మేరకు కేంద్ర పాలకులు విభజన నిర్ణయం మార్చుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement