'కృష్ణా ట్రిబ్యునల్‌ తీర్పుకు చంద్రబాబు విధానాలే కారణం' | gattu ramachandra rao takes on chandra babu naidu | Sakshi
Sakshi News home page

'కృష్ణా ట్రిబ్యునల్‌ తీర్పుకు చంద్రబాబు విధానాలే కారణం'

Published Sun, Dec 1 2013 4:23 PM | Last Updated on Sat, Jul 28 2018 6:43 PM

'కృష్ణా ట్రిబ్యునల్‌ తీర్పుకు చంద్రబాబు విధానాలే కారణం' - Sakshi

'కృష్ణా ట్రిబ్యునల్‌ తీర్పుకు చంద్రబాబు విధానాలే కారణం'

హైదరాబాద్: కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విధానాలే కారణమని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. బాబు ఆరోజు ప్రాజెక్టులను నిర్మించి ఉంటే ఇవాళ ట్రైబ్యునల్‌ కేటాయింపులు ఇచ్చే అవకాశం ఉండేది కాదని ఆయన తెలిపారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్ట్‌లను చంద్రబాబు అడ్డుకోకుండా చోద్యం చూడటం వల్లే ఈ రోజు దుస్థితి వచ్చిందన్నారు. ఎన్టీఆర్‌ ప్రారంభించిన ప్రాజెక్ట్‌లను కూడా మూలన పడేసిన ఘనత బాబుకే దక్కుతుందని గట్టు ఎద్దేవా చేశారు.

 

బాబు ప్రాజెక్ట్‌లు కోసం రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తే... వైఎస్‌ఆర్‌ రూ.50వేల కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు జనాన్ని తలుపులు మూసుకోమంటే.. జనం ఆయన్ని నోరు మూసుకోమని సమాధానం ఇచ్చారన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement