జగన్‌ను తట్టుకోలేక ఎల్లోగ్యాంగ్ కుట్రలు | Project tolerate conspiracies ellogyang | Sakshi
Sakshi News home page

జగన్‌ను తట్టుకోలేక ఎల్లోగ్యాంగ్ కుట్రలు

Published Sat, Apr 5 2014 1:21 AM | Last Updated on Tue, Sep 4 2018 4:52 PM

జగన్‌ను తట్టుకోలేక ఎల్లోగ్యాంగ్ కుట్రలు - Sakshi

జగన్‌ను తట్టుకోలేక ఎల్లోగ్యాంగ్ కుట్రలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ధ్వజం
రామోజీ ఆక్రమించిన ఫిలింసిటీ భూములు, పాలమాకుల భూముల గురించి ఎందుకు రాసుకోరు?
నిన్నటి దాకా సీబీఐ పవర్‌ఫుల్ అన్న రామోజీకి ఇప్పుడు ఎఫ్‌బీఐ పవర్‌ఫుల్‌గా కనిపించింది.
గీతం యూనివర్సిటీ కుంభకోణంలో బిగ్‌బాస్ అంటే చంద్రబాబే అని రామోజీ ఆయన పత్రికలో ఎందుకు రాయలేదు?

 
హైదరాబాద్: ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ బలహీనపడిపోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఎల్లోగ్యాంగ్‌లు రోజురోజుకు ప్రజాభిమానాన్ని పెంచుకుంటున్న జగన్‌పై కుట్రలు, కుతంత్రాలకు మరింత పదును పెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. ‘ఈనాడు రాసింది.. చంద్రబాబు వాగాడు. మళ్లీ చంద్రబాబు వాగిందే ఈనాడు రాయడం’ పరిపాటిగా మారిందన్నారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గట్టు మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల పరుగులో చతికిలపడి శల్య రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వీరి కుట్రలో భాగంగా కోతికి కొబ్బరికాయ దొరికిందన్నట్లు ఆమెరికాలోని ఎఫ్‌బీఐ సంస్థ అభియోగాలంటూ పేజీలకు పేజీలు రాసుకుంటూ జగన్‌పై ఎల్లోగ్యాంగ్ విషంగక్కుతోందని ధ్వజమెత్తారు. ‘ఈనాడు రామోజీరావుకు ఆమెరికా అభియోగాలయ్యేసరికి అంత అందంగా కనిపిస్తున్నాయా? ఏం రామోజీపై దేశంలో,
రాష్ట్రంలో ఎన్ని అభియోగాలు లేవు’ అని అన్నారు.

 ఆమెరికాలో ఉన్న కంపెనీతో టైటానియం డీల్ ఒకటి జరిగిందని, దాంట్లో కుంభకోణముందని ఆ అభియోగంలో ఆరుగురు పేర్లను ప్రస్తావించారట! అందులో ఒకటి కేవీపీ పేరుంటే దానికి జవాబు చెప్పుకోవాల్సింది ఆయనే. దాన్ని తీసుకొచ్చి ‘సిన్నోడి మేతే’ అంటూ రామోజీ తన పత్రికలో రాస్తారు.  దానికి చంద్రబాబు సిన్నోడంటే జగన్ అని చెబుతారు. అందులో ఎక్కడా జగన్ పేరు లేకపోయినా ఇరువురూ శివాలెత్తారు.

 ఎఫ్‌బీఐ ప్రస్తావించిన ఆరుగురి పేర్లలో వైఎస్ పేరుగాని, జగన్ పేరుగానీ ఎక్కడైనా ఉన్నాయా? ఎలాంటి సంబంధం లేని వాటిని తీసుకొచ్చి జగన్‌కు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫిర్టాస్ అనే వ్యక్తి అసలు ఎవరికీ ముడుపులు ఇవ్వలేదంటున్నారు. కానీ దీన్ని తీసుకొచ్చి జగన్‌కు అంటగట్టడం సిగ్గుచేటు.

 ఎఫ్‌బీఐ మోపిన అభియోగంలో సీఎంకు బంధువని ప్రస్తావించారు. రక్తం పంచుకు పుట్టిన జగన్ ఏమైనా వైఎస్‌కు బంధువా? కుటుంబ సభ్యులను ఎక్కడైనా బంధువుగా ప్రస్తావిస్తారా? అంటే వారి ఆలోచన ప్రకారం చంద్రబాబుకు ఆయన కుమారుడు లోకేష్ బంధువా? రామోజీకి వారి కొడుకులు సుమన్, కిరణ్‌లు బంధువులా?
 
వీరి తీరు చూస్తుంటే చంద్రబాబు ఇంట్లో పిల్లి పాలు తాగకపోయినా దానికి జగన్ కుట్రే ఉందని ఎల్లోగ్యాంగ్ ప్రచారం చేసేలా ఉంది! జనాభిమానాన్ని పొందలేకజగన్ ఫోబియో పట్టుకొని నిత్యం బురద చల్లే ప్రయత్నంలో చంద్రబాబు, రామోజీ మునిగిపోయారు.
 ఓట్లు, సీట్ల కోసం ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తారా? వైఎస్ మరణం తర్వాత నాలుగేళ్లుగా ఎన్నో తప్పుడు ప్రచారాలు, అక్రమ కేసులతో అభాండాలు మోపుతూనే ఉన్నారు.

 రామోజీ.. అబ్దులాపూర్‌మెట్ దగ్గర నుంచి రామోజీ ఫిలిం సిటీ దాకా ఉన్న నాలుగు కిలోమీటర్ల దారి నీకెక్కడిదో, ఎవరి దగ్గర కొన్నావో నీ పత్రికలో రాసుకోగలవా? ఫిలిం సిటీలో ఉన్న 20 ఎకరాల అసైన్డ్ భూమిని వదిలిపెట్టావా? పాలమాకులలో అక్రమంగా ఆక్రమించుకున్న 320 ఎకరాల విషయాన్ని రాస్తావా? రామోజీని ఎన్నిసార్లు అరెస్టు చేయలేదు? విశాఖలోని ఈనాడు స్థలం వివాదానికి సంబంధించి

సుప్రీంకోర్టులో మొట్టికాయలు వేసిన విషయాన్ని ఎందుకు రాయలేదు?

 రామోజీకి సీబీఐకన్నా ఎఫ్‌బీఐ పవర్‌ఫుల్‌గా కనిపించిందట! నిన్నటిదాకా సీబీఐని మించిన పవర్‌ఫుల్ సంస్థ మరొకటి లేదన్నారు. అంతకుముందు అదే సీబీఐని... కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ప్రచారం చేసినదీ రామోజీయే. ఆ సంస్థ జగన్ కేసు చేపట్టే సరికి పునీతమైందట!  అసెంబ్లీలో గీతం యూనివర్సిటీ కుంభకోణంలో బిగ్‌బాస్ ఉన్న లెటర్‌ను మైసూరారెడ్డి బయటపెడితే, ఈ బిగ్‌బాస్ చంద్రబాబే అని రామోజీ ఆయన పత్రికలో ఎందుకు రాయలేదు?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement