ఢిల్లీలో పెద్ద డ్రామా! | Congress Big drama in delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో పెద్ద డ్రామా!

Published Tue, Feb 11 2014 3:47 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

గట్టు రామచంద్రరావు - Sakshi

గట్టు రామచంద్రరావు

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తమ ఎంపిల బహిష్కరణ పేరుతో ఢిల్లీలో పెద్ద డ్రామాకు తెరలేపిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు.  పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేవంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో ధర్నా చేసిన సీఎంను, విభజనను వ్యతిరేకిస్తున్న కేంద్ర మంత్రులను ఎందుకు బహిష్కరించడంలేదు? అని ఆయన అడిగారు.  

ప్రతిపక్ష నేతల గుమ్మాల తొక్కి బ్రతిమాలుకునే దుస్థితికి నేడు కేంద్రం దిగజారిందన్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులకు సిగ్గు ఉందా?  మీరు తెలుగువారు కాదా? మీకు చీము, నెత్తురు లేదా? అని ప్రశ్నించారు. ఇష్టమొచ్చినట్లు విభజించడానికి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అబ్బ సొత్తా? అని  గట్టు మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement