
'జగన్ విమర్శించే అర్హత డీకే అరుణకు లేదు'
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డిని విమర్శించే అర్హత మంత్రి డీకే అరుణకు లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. రాజకీయంగా పెంచి పెద్ద చేసిన వైఎస్ కుటుంబంపై ఆరోపణలు చేయడం ఆమెకు తగదని గట్టు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ నేతల వైఖరిని తప్పుబట్టారు. వైఎస్ జగన్ చెప్పినట్లు కాంగ్రెస్ నేతలు కల్లు తాగిన కోతుల్లా ప్రవర్తిస్తున్నారని గట్టు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమన్యాయం చేయాలని కోరుతున్న జగన్ పై అరుణ వ్యాఖ్యలు ఎంతమాత్రం తగదన్నారు. విభజన అనివార్యమైతే ఆమె సొంత జిల్లా మహబూబ్ నగర్ పూర్తిగా ఎడారి మారుతుందన్న విషయాన్ని ఆమె గ్రహించాలని గట్టు హితవు పలికారు.