
Kiara Advani Shares Her Near Death Experience In Dharamshala: 'భూల్ భులయ్యా' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన మూవీ 'భూల్ భులయ్యా 2'. ఇందులో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, బ్యూటిఫుల్ హీరోయిన్ కియరా అద్వానీ, టబు నటించారు. ప్రస్తుతం ఈ సినిమా హిట్ కావడంతో ఫుల్ జోష్‌లో ఉంది కియరా. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో దెయ్యాల గురించి కియరాను అడగ్గా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.
దెయ్యాలంటే భయమా అని అడిగిన ప్రశ్నకు.. 'నాకు దెయ్యాలంటే భయం లేదు. కానీ దెయ్యం సినిమాలు చూడను. రాత్రిపూట ఒక్కదాన్నే నిద్రపోతుంటే భయపడతాను. అందుకే ఆ జోనర్ సినిమాల జోలికి వెళ్లను.' అని తెలిపింది కియరా. అంతేకాకుండా తన కాలేజ్ రోజుల్లో జరిగిన మరో విషయం గురించి తెలిపింది ఈ ముద్దుగుమ్మ.
చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం
''కాలేజ్ డేస్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి ధర్మశాల టూర్ వెళ్లాను. మంచు ఎక్కువగా కురవడంతో నాలుగురోజులపాటు మేం హోటల్ గదిలోనే ఉండాల్సి వచ్చింది. అప్పుడు కరెంట్ లేదు. తాగేందుకు మంచి నీళ్లు కూడా దొరకలేదు. వేడికోసం ఏర్పాటు చేసుకున్న మంట కూడా ఆరిపోతుందనుకున్నాం. నాలుగోరోజు రాత్రి గదిలో అందరం నిద్రపోతున్నప్పుడు మా పక్కనే ఉన్న కుర్చీకి అనుకోకుండా నిప్పు అంటుకుని మంటలు వ్యాపించాయి. అది చూసిన నా ఫ్రెండ్ మా అందర్నీ నిద్రలేపింది. మేమంతా కేకలు వేయడంతో చుట్టుపక్కవాళ్లు వచ్చి తలుపులు పగలగొట్టారు. ఆరోజు చావుని దగ్గర నుంచి చూసినట్లనిపించింది. అదృష్టం కొద్దీ అక్కడి నుంచి బయటపడ్డాం.' అని కియరా పేర్కొంది.
చదవండి: భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు
Comments
Please login to add a commentAdd a comment