death experience
-
దెయ్యాలంటే భయం లేదు.. కానీ ఆరోజు చావును దగ్గర నుంచి చూశా: స్టార్ హీరోయిన్
Kiara Advani Shares Her Near Death Experience In Dharamshala: 'భూల్ భులయ్యా' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన మూవీ 'భూల్ భులయ్యా 2'. ఇందులో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, బ్యూటిఫుల్ హీరోయిన్ కియరా అద్వానీ, టబు నటించారు. ప్రస్తుతం ఈ సినిమా హిట్ కావడంతో ఫుల్ జోష్‌లో ఉంది కియరా. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో దెయ్యాల గురించి కియరాను అడగ్గా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. దెయ్యాలంటే భయమా అని అడిగిన ప్రశ్నకు.. 'నాకు దెయ్యాలంటే భయం లేదు. కానీ దెయ్యం సినిమాలు చూడను. రాత్రిపూట ఒక్కదాన్నే నిద్రపోతుంటే భయపడతాను. అందుకే ఆ జోనర్ సినిమాల జోలికి వెళ్లను.' అని తెలిపింది కియరా. అంతేకాకుండా తన కాలేజ్ రోజుల్లో జరిగిన మరో విషయం గురించి తెలిపింది ఈ ముద్దుగుమ్మ. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం ''కాలేజ్ డేస్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి ధర్మశాల టూర్ వెళ్లాను. మంచు ఎక్కువగా కురవడంతో నాలుగురోజులపాటు మేం హోటల్ గదిలోనే ఉండాల్సి వచ్చింది. అప్పుడు కరెంట్ లేదు. తాగేందుకు మంచి నీళ్లు కూడా దొరకలేదు. వేడికోసం ఏర్పాటు చేసుకున్న మంట కూడా ఆరిపోతుందనుకున్నాం. నాలుగోరోజు రాత్రి గదిలో అందరం నిద్రపోతున్నప్పుడు మా పక్కనే ఉన్న కుర్చీకి అనుకోకుండా నిప్పు అంటుకుని మంటలు వ్యాపించాయి. అది చూసిన నా ఫ్రెండ్ మా అందర్నీ నిద్రలేపింది. మేమంతా కేకలు వేయడంతో చుట్టుపక్కవాళ్లు వచ్చి తలుపులు పగలగొట్టారు. ఆరోజు చావుని దగ్గర నుంచి చూసినట్లనిపించింది. అదృష్టం కొద్దీ అక్కడి నుంచి బయటపడ్డాం.' అని కియరా పేర్కొంది. చదవండి: భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు -
‘నా కూతురి కోసం నన్ను బతకనివ్వు’
చావు అంచుల దాకా వెళ్లాను.. నా కూతురి కోసం నన్ను బతికించమని దేవున్ని కోరుకున్నాను. ఆ తర్వాత 5 నిమిషాల్లోనే నా ఆరోగ్య పరిస్థితి మామూలుగా అయ్యింది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజంగానే నేను మరణం అంచుల దాకా వెళ్లి వచ్చాను అంటున్నారు హిందీ సిరీయల్ యాక్టర్, బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్ జుహీ పర్మార్. తనకు ఎదురైన వింత అనుభవం గురించి ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు జుహీ. ‘మొన్న హోలీ పండుగ నాడు నా బెస్ట్ ఫ్రెండ్ ఆష్కా గోరడియా వాళ్ల ఇంట్లో ఉన్నాను. రాత్రి 10.30 - 11 గంటల సమయంలో సడెన్‌గా నా ఆరోగ్యం చెడిపోయింది. వాంటింగ్ వస్తున్నట్లు అనిపించింది. ముక్కు మూసుకుపోయి ఉపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. శరీరంలోంచి ఏదో బయటకు వెళ్లి పోయినట్లు అనిపించింది. ఓ ఐదు నిమిషాల పాటు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ఇక నేను చనిపోతానని అర్థమయ్యింది. నోట్లో నుంచి మాట రావడం లేదు. ఆ సమయంలో ఒక్కసారిగా నా జీవితం అంతా నా కళ్ల ముందు నిలిచింది. అప్పుడు నేను విడాకులు తీసుకున్నానని, సింగిల్ పేరెంట్నని కానీ.. నేను ఎదుర్కోన్న కష్టాలు కానీ ఇవేవి నాకు గుర్తుకు రాలేదు. నా కూతురు నవ్వు మొహం మాత్రమే నాకు కనిపించింది. నేను చనిపోతే తన పరిస్థితేంటనే ఆందోళన ఎక్కువయింది’. ‘పక్కనే ఉన్న నా స్నేహితురాలు ఆష్కా గోరడియాను సైగల ద్వారా పిలిచాను. ఇక నుంచి నా కూతురి బాధ్యత తనదేనని సైగల ద్వారానే చెప్పాను. నా ఆత్మ నా శరీరం నుంచి వేరుపడటానికి సిద్ధంగా ఉంది. నేను నా కూతరికి ఏం చేయలేకపోయాను. ఆ విషయం నాకు గుర్తుకురాగానే నా గుండెను చిక్కబట్టుకున్నాను. ఆ సమయంలో నేను దైవంతో మాట్లాడటం ప్రారంభించాను. ఇదంతా జరుగుతున్నప్పుడు డాక్టర్లు, నర్సులు, నా స్నేహితురాలు అందరు నాకు కొద్ది దూరంలోనే ఉన్నారు. కానీ జరుగుతున్న విషయం గురించి వారికి తెలియడం లేదు. నేను దైవంతో సంభాషించడం మొదలుపెట్టాను. జీవితాన్ని ఆషామాషీగా తీసుకున్నందుకు.. ఫలితం లేకుండా జీవించినందుకు.. ఆశీర్వాదాలు వదిలి.. ఆశ వెంట పరుగులు తీసినందుకు నన్ను క్షమించమని వేడుకున్నాను. కానీ నా కూతురు కోసం నన్ను బతకనికవ్వు అంటూ ప్రాధేయపడ్డాను. ఆ తరువాత మరో ఐదు నిమిషాల్లోనే నా బీపీ, ఈసీజీ, మెడికల్ రిపోర్ట్స్ అన్ని నార్మల్‌గా మారాయి’ అని సుదీర్ఘ పోస్ట్ పెట్టారు జుహీ. అంతేకాక ‘ఇది రాసే సమయానికి నేను నా పాత శరీరంలోనే ఉన్నాను. కానీ నా ఆత్మ మారిపోయింది. నా విషయంలో జరిగిన ప్రతిదానికి నేను సంతోషంగా ఉన్నాను.. కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. దాంతో ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని భావించాను. మన జీవితంలో జరిగే ప్రతి దానికి కృతజ్ఞతలు తెలపడం చాలా మంచిది. ఎందుకంటే నేనైనా, మీరైనా మనందరం మనుషులమే’ అంటూ పోస్ట్ చేశారు. View this post on Instagram Dear Life, I Am Here To Live!!!! A post shared by Juhi Parmar (@juhiparmar14) on Mar 28, 2019 at 8:17am PDT -
మరణ అనుభవాన్ని రుచి చూసింది
షాంఘై : నగరంలోని ఓ రద్దీ రోడ్డును దాటుతున్న క్రమంలో ప్రమాదానికి గురైన ఓ మహిళ చావు అంచుల వరకూ వెళ్లి తప్పించుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. తొలుత రోడ్డును దాటి అవతలి వైపుకు వెళ్లి మహిళ తిరిగి రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో రోడ్డుపై వస్తున్న వ్యాన్‌ను గమనించని ఆమె.. దాన్ని ఢీ కొట్టింది. దీంతో వ్యాన్ ఇరు చక్రాల మధ్య పడింది. మహిళ వాహనాన్ని ఢీ కొట్టడంతో షాక్‌కు గురైన డ్రైవర్ వెంటనే వ్యాన్‌ను నిలిపేశాడు. దీంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. లేకుంటే ఆమె తల వ్యాన్ వెనుక చక్రాల కిందపడి నలిగిపోయేది. ఈ వీడియోను చూస్తే తెలుస్తుంది ఆమె ఎంత అదృష్టవంతురాలో..! -
'మృత్యువును చేరువగా చూశాం'
లండన్: నార్వేలో మంచుగడ్డతో కట్టిన ఓ సరస్సులో తాము ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా తమ వాహనం ప్రమాదానికి గురై.. మంచులోకి మునిగిపోయిందని, ఆ క్షణంలో తాము మృత్యువును చేరువుగా చూశామని అంటోంది ప్రఖ్యాత హాలీవుడ్ గాయని ఎల్లీ గౌల్డిండ్.. ఆమె, ఆమె ఫొటోగ్రాఫర్ కానర్ మెక్‌డొనాల్డ్ మూడు వారాల కిందట ఈ సరస్సులో ప్రయాణించారు. వారు బెల్ట్ వేగన్ వాహనంలో ప్రయాణిస్తుండగా.. వారి కారు ఒక్కసారిగా మంచులోకి కూరుకుపోయి.. బోల్తాపడింది. చుట్టూ రక్తం గడ్డకట్టించే మంచు. అలాంటి పరిసరాల్లో బోల్తాపడిన వాహనం నుంచి అతికష్టం మీద గౌల్డింగ్, కానర్ తప్పించుకున్నారు. వాహనం నీటోలోకి మునిగిపోతుండగా చివరిక్షణంలో దాని పైకప్పును తొలగించి తాము బయటపడ్డామని కారన్ వివరించారు. గౌల్డింగ్ యూరప్ మ్యూజిక్ పర్యటనలో ఆమెతో కలిసి కానర్ కూడా ప్రయాణిస్తున్నారు. మొదట ఈ ఘటన గురించి వెల్లడించవద్దని తాను భావించినట్టు కానర్ తెలిపాడు. అయితే ఈ భయానక అనుభవం గురించి ప్రపంచానికి తెలుపకపోతే.. అది పిచ్చితనమే అవుతుందని భావించి వెల్లడిస్తున్నట్టు ఆయన చెప్పాడు. ఆ సమయంలో తీసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. 'లవ్ మీ లైక్ యూ డూ సింగర్' పాటతో ఎల్లీ గౌల్డింగ్ సంగీత అభిమానులను ఉర్రూతలూంగించింది.