
వ్యాన్ వెనుక చక్రాల ముందు పడివున్న మహిళ
షాంఘై : నగరంలోని ఓ రద్దీ రోడ్డును దాటుతున్న క్రమంలో ప్రమాదానికి గురైన ఓ మహిళ చావు అంచుల వరకూ వెళ్లి తప్పించుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. తొలుత రోడ్డును దాటి అవతలి వైపుకు వెళ్లి మహిళ తిరిగి రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో రోడ్డుపై వస్తున్న వ్యాన్‌ను గమనించని ఆమె.. దాన్ని ఢీ కొట్టింది.
దీంతో వ్యాన్ ఇరు చక్రాల మధ్య పడింది. మహిళ వాహనాన్ని ఢీ కొట్టడంతో షాక్‌కు గురైన డ్రైవర్ వెంటనే వ్యాన్‌ను నిలిపేశాడు. దీంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. లేకుంటే ఆమె తల వ్యాన్ వెనుక చక్రాల కిందపడి నలిగిపోయేది. ఈ వీడియోను చూస్తే తెలుస్తుంది ఆమె ఎంత అదృష్టవంతురాలో..!
Comments
Please login to add a commentAdd a comment