'మృత్యువును చేరువగా చూశాం' | Ellie Goulding, death experience, Singer, Norway, hollywood, ఎల్లీ గౌల్డింగ్, మృత్యు అనుభవం, గాయని, నార్వే, హాలీవుడ్‌ | Sakshi
Sakshi News home page

'మృత్యువును చేరువగా చూశాం'

Published Wed, Jan 27 2016 9:49 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 PM

'మృత్యువును చేరువగా చూశాం'

'మృత్యువును చేరువగా చూశాం'

లండన్‌: నార్వేలో మంచుగడ్డతో కట్టిన ఓ సరస్సులో తాము ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా తమ వాహనం ప్రమాదానికి గురై.. మంచులోకి మునిగిపోయిందని, ఆ క్షణంలో తాము మృత్యువును చేరువుగా చూశామని అంటోంది ప్రఖ్యాత హాలీవుడ్ గాయని ఎల్లీ గౌల్డిండ్‌.. ఆమె, ఆమె ఫొటోగ్రాఫర్ కానర్ మెక్‌డొనాల్డ్‌ మూడు వారాల కిందట ఈ సరస్సులో ప్రయాణించారు. వారు బెల్ట్‌ వేగన్ వాహనంలో ప్రయాణిస్తుండగా.. వారి కారు ఒక్కసారిగా మంచులోకి కూరుకుపోయి.. బోల్తాపడింది. చుట్టూ రక్తం గడ్డకట్టించే మంచు. అలాంటి పరిసరాల్లో బోల్తాపడిన వాహనం నుంచి అతికష్టం మీద గౌల్డింగ్‌, కానర్ తప్పించుకున్నారు. వాహనం నీటోలోకి మునిగిపోతుండగా చివరిక్షణంలో దాని పైకప్పును తొలగించి తాము బయటపడ్డామని కారన్ వివరించారు. గౌల్డింగ్‌ యూరప్‌ మ్యూజిక్ పర్యటనలో ఆమెతో కలిసి కానర్‌ కూడా ప్రయాణిస్తున్నారు.

మొదట ఈ ఘటన గురించి వెల్లడించవద్దని తాను భావించినట్టు కానర్‌ తెలిపాడు. అయితే ఈ భయానక అనుభవం గురించి ప్రపంచానికి తెలుపకపోతే.. అది పిచ్చితనమే అవుతుందని భావించి వెల్లడిస్తున్నట్టు ఆయన చెప్పాడు. ఆ సమయంలో తీసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. 'లవ్‌ మీ లైక్‌ యూ డూ సింగర్' పాటతో ఎల్లీ గౌల్డింగ్‌ సంగీత అభిమానులను ఉర్రూతలూంగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement