కోర్టు ప్రాంగణంలో దెయ్యాలు, భూతాలు | Strange sightings leave Delhi court complex spooked | Sakshi
Sakshi News home page

కోర్టు ప్రాంగణంలో దెయ్యాలు, భూతాలు

Published Thu, Sep 11 2014 10:54 PM | Last Updated on Sat, Sep 2 2017 1:13 PM

కోర్టు ప్రాంగణంలో దెయ్యాలు, భూతాలు

కోర్టు ప్రాంగణంలో దెయ్యాలు, భూతాలు

న్యూఢిల్లీ: ‘రాత్రయితే చాలు అకస్మాత్తుగా కంప్యూటర్లు ఆన్ అవ్వడం.. గదుల్లో బుడగలు ఎగురుతూ కనిపించడం.. తెల్లని నీడ కాంపౌండ్‌లో తిరుగుతుండటం.. ఇదంతా హరర్ సినిమాలోని దృశ్యాల్లా అనిపిస్తున్నాయి కదూ.. కాదండీ.. కాడ్కడ్‌దూమా కోర్టు ప్రాంగణంలో రోజూ న్యాయవాదులకు ఎదురవుతున్న ఘటనలు.. కోర్టు ప్రాంగణంలో దెయ్యాలు, భూతాలు తిరుగుతున్నాయని న్యాయవాదులు, సిబ్బంది భయంభయంగా చెబుతున్నారు. ఒక తెల్లని ఆకారం రోజూ ప్రాంగణంలో తిరుగాడుతుండటం తాము స్వయంగా చూశామని కొందరైతే ఢంకా భజాయించి చెబుతున్నారు. వీరి వాదనలను  ఒక సీసీటీవీ కెమెరాలో కనిపించిన దృశ్యాలు మరింత బలపరుస్తున్నాయి. షాద్రా బార్ కౌన్సిల్ సంయుక్త కార్యదర్శి రమణ్ శర్మ కథనం ప్రకారం కాడ్కడ్‌దూమా కోర్టు ప్రాంగణంలో అదృశ్య శక్తులు సంచరిస్తున్నాయి.
 
 తూర్పు ఢిల్లీలో నిర్మించిన ఈ పది అంతస్తుల కోర్టు ప్రాంగణంలో న్న లైబ్రరీ, బార్ కార్యాలయంతోపాటు పలు చోట్ల 8 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేశారు. ‘తెల్లారుజామున నాలుగు కంప్యూటర్లు స్విచ్ వేసి ఉండటం కనిపించింది. మేం సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించగా, ముందు రోజు రాత్రి 11.35 నిమిష్లాకు ఒక తెల్లటి నీడ గోడల్లోంచి వచ్చి కంప్యూటర్ల స్విచ్‌లను వేయడం రికార్డు అయ్యింది..’ అని  శర్మ తెలిపారు. మరో ఘటనలో, లైబ్రరీలో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో బుడగలు ఎగురుతూ కనిపించాయి. ఈ దృశ్యాలు కూడా కెమెరాలో రికార్డు అయ్యాయి.. అని శర్మ చెప్పారు. ఇటీవల తన చాంబర్‌లోనే ఒక భూతాన్ని చూసినట్లు ఆయన స్పష్టం చేశారు. కాగా,   ఈ కోర్టులో పనిచేసిన ఒక న్యాయవాది, అతడి కుటుంబం గత యేడాది ఉత్తరాఖండ్ వరదల్లో మృతిచెందారని, అలాగే కొన్ని వారాల కిందట ప్రాంగణంలో కరెంటు పనిచేస్తూ ఒక ఎలక్ట్రీషియన్ మృతిచెందాడని..
 
 వారి ఆత్మలే ప్రస్తుతం కోర్టు ప్రాంగణంలో తిరుగాడుతున్నాయని న్యాయవాదులు కొందరు అంటున్నారు. వారి ఆత్మలు కోర్టు ప్రాంగణంలో తిరుగాడుతుండటం పలు సందర్భాల్లో తాము చూసినట్లు పలువురు నొక్కిచెబుతున్నారు. తాము టీ తాగుతున్నప్పుడు ఒక ఆత్మ తమ పక్కనే వచ్చి కూర్చుందని కొందరు లాయర్లు చెప్పారు. న్యాయవాదులు చెప్పినట్లు ప్రాంగణంలో ఎటువంటి దెయ్యాలు, భూతాలు, ఆత్మల సంచారం లేదని దర్యాప్తు అధికారులు చెప్పారు. సెల్ఫ్ ప్రోగ్రామింగ్ వల్ల కంప్యూటర్లు వాటికవే స్విచ్ ఆన్ అయ్యాయని, కంటికి కనిపించని ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తి వల్ల బుడగలు ఏర్పడ్డాయని దర్యాప్తులో తేలిందని వారు నొక్కి చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement