అక్కడ సైడివ్వకుంటే ఇంతే... | Shapes in the form of demons | Sakshi
Sakshi News home page

అక్కడ సైడివ్వకుంటే ఇంతే...

Published Sun, Nov 20 2016 2:26 AM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM

అక్కడ సైడివ్వకుంటే ఇంతే...

అక్కడ సైడివ్వకుంటే ఇంతే...

ఆఫీస్‌లో లేటవడంతో అప్పుడే చిరాక్కుగా కారులో ఇంటికి బయల్దేరారు ఓ వ్యక్తి. అసలే రాత్రి.. ఆపై అమావాస్య

ఆఫీస్‌లో లేటవడంతో అప్పుడే చిరాక్కుగా కారులో ఇంటికి బయల్దేరారు ఓ వ్యక్తి. అసలే రాత్రి.. ఆపై అమావాస్య కావడంతో చిమ్మచీకట్లో భయంభయంగా త్వరగా ఇంటికి వెళ్లాలని వేగంగా కారు నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఇదే సమయంలో అతని ముందర ఒక కారు నెమ్మదిగా వెళ్తూ ఉంది. ఎంత హారన్ మోగించినా సైడ్ ఇవ్వడం లేదు. దీంతో హై బీమ్ లైట్లను వేగంగా డిప్ చేశాడు. ఇక అంతే ఆ వ్యక్తి ముందర దయ్యాలు ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం చైనాలో జరుగుతోందిదే. వెనుక నుంచి వచ్చి హై బీమ్ లైట్లతో విసికించే డ్రైవర్ల పనిపట్టేందుకు అక్కడ కార్ల వెనుక అద్దాలపై భయం కలిగించే వింత వింత ఆకారాలను స్టిక్కర్లుగా వేయిస్తున్నారు.

వెనుక నుంచి హై బీమ్‌లైట్లు వేయగానే అకస్మాత్తుగా దయ్యాల రూపంలోని ఆకారాలు దర్శనమిస్తున్నాయంటా! వాటిని చూసిన డ్రైవర్లు బెంబెలెత్తిపోతున్నారని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ విషయంపై పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారని సమాచారం. ఆ విధంగా స్టిక్కర్లు వేయించుకోవడం తప్పేమి కాదని తద్వారా ప్రమాదాలు సంభవిస్తే అప్పుడు చర్యలు తీసుకుంటామని వారు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement