Cambodian
-
'ఖైమర్ అప్సర'గా భారత దౌత్యవేత్త!
భారత రాయబారి దేవయాని ఖోబ్రోగాడే 'ఖైమర్ అప్సర'గా దుస్తులు ధరించి సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను కంబోడియాలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా ఎక్స్‌లో పంచుకుంది. ఖైమర్ న్యూ ఇయర్ సందర్భంగా కంబోడియన్లకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు భారత దౌత్యవేత్త దేవయాని ఇలా కంబోడియన్ సంప్రదాయ దుస్తులను ధరించి ఖైమర్ అప్సరగా కనిపించారు. ఆమెకు ఖైమర్ సంస్కృతి, సంప్రదాయం పట్ల ప్రగాఢమైన అభిమానం ఉంది. అందువల్ల ఆమె ఇలా ఆ దుస్తుల్లో ధరించి ఆ నాగరికత పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ.. కాంబోడియన్ వాసులకు ఖైమర్ నూతర సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాదు మా కాంబోడియా స్నేహితులందరూ ఈ ఖైమర్ నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని కాంబోడియా భారత రాయబార కార్యాలయం అధికారిక సోషల్ మీడియా ఎక్స్‌లో పేర్కొంది. ఈ దౌత్యవేత్త ధరించి సంప్రదాయ కంబోడియన్ వస్త్రధారణ పురాణాల్లో ఉన్న పురాత ఖైమర్ కళకు నిలువెత్తు నిదర్శనంలా ఉంటుంది. ఈ వస్త్రధారణకు తగ్గట్టు ధరించిన ఖైమర్ సాంపాట్ అనే బంగారు ఆభరణం ఒక రకమైన ర్యాప్-ఎరౌండ్ స్కర్ట్‌తో కూడిన కిరీటం మాదిరిగా ఉంది. కాగా, దేవయాని 1999-బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. తన 24 ఏళ్ల కెరీర్లో బెర్లిన్, ఇస్లామాబాద్, రోమ్, న్యూయార్క్‌లోని భారతీయ దౌత్యకార్యాలయాల్లో పనిచేశారు. అలాగే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వంటి దేశాల్లో విదేశాంగ మంత్రిత్వ ప్రధాన కార్యాలయంలో పనిచేశారు. అంతేగాక సెంట్రల్ యూరప్‌లో ఫైనాన్స్ అండ్ సీపీవీ (కాన్సులర్ పాస్‌పోర్ట్, వీసా) విభాగాలతో సహా అనేక విభాగాలలో పనిచేశారు దేవయాని. Ambassador Devyani Khobragade has a deep admiration for Khmer culture and tradition. Embracing the spirit of Khmer New Year, she elegantly dressed as a Khmer Apsara, embodying the rich bond of our civilizations. Wishing all our 🇰🇭 friends a joyous Khmer New Year celebration pic.twitter.com/5SfQ42g5ln — India in Cambodia (@indembcam) April 13, 2024 (చదవండి: ఒడిస్సీ బాలినీస్ నృత్యాల వందేమాతర సంగమం!) -
దెయ్యాలకు బోజనం పెట్టే పండుగ గురించి విన్నారా?
ప్రతీ దేశానికి విభిన్న సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. కానీ కొన్ని దేశాల్లో పండుగలు అత్యంత విచిత్రంగా ఉంటాయి. ఆ సంప్రదాయాలను చూస్తే అవాక్కవ్వల్సిందే. అలాంటి విచిత్రమైన సంప్రదాయమే కంబోడియాలో ఉంది. పైగా ఆ పండుగ చేసుకోవడం కోసం ప్రభుత్వం కూడా రెండు రోజులు సెలవు ప్రకటిస్తుందట. కంబోడియాలో జరుపకునే విచిత్రమైన పండుగ దెయ్యాలకు ఆహారం పెట్టే ఫెస్టివల్. ఇది అక్కడ చాలా ఫేమస్ పండుగ. దీన్ని అక్కడ ప్రజలు 'ఖైమర్ పండుగ' అని కూడా పిలుస్తారు. ఇది 15 రోజులు పాటు జరుపుకునే ఉత్సవం. సెప్టెంబర్-అక్టోబర్ మధ్య కాలంలో జరుపుకుంటారు. ఆకలితో ఉన్న దెయ్యాలు ఆ టైంలో నరక ద్వారం నుంచి బయటకు వచ్చి తమ నివాసల వద్ద సంచరిస్తాయిని విశ్వసిస్తారు కంబోడియా వాసులు. ఆ సమయంలోనే నరక ద్వారాలు తెరచుకుంటాయని, అందువల్లే వివిధ రకాల ఆత్మలు తమ నివాసాల వద్దకు వస్తాయని చెబుతున్నారు. ఈ పండుగ రోజున ప్రజలు దెయ్యాల కోసం వివిధ రకాల పిండి వంటలను తయారు చేసి మరీ పెడతారు. అయితే ఇలా రాత్రి సమయాల్లోనే చేస్తారు. ఎందుకంటే దెయ్యాలకు వెలుతురు ఇష్లం ఉండదు. అవి చీకటిలోనే ఉంటాయి. అందుకని ఉదయం లేచి సూర్యోదయం కాకమునుపే తమ కుటుంబంలో చనిపోయిన బంధువులను తలుచుకంటూ ఆహారం పెడుతుంటారు. ఇలా చేస్తే రాక్షసులు సంతోషిస్తారట. అందువల్ల తమకు ఎలాంటి కీడు వాటిల్లకుండా ఉండటమే గాక సంతోషంగా జీవించగలుగుతామని చెబుతున్నారు. ఈ పండుగ రోజును తమ చనిపోయిన ఏడు తరాల బంధువులను తలుచుకుని భోజనం పెడతారు. దెయ్యాలు ఇలా తమ బంధువుల పేరు మీద పెట్టిన భోజనాన్ని వారి దగ్గర నుంచి తీసుకుని తింటాయని అంటున్నారు. దీన్ని "ఫచమ్ బెన్"గా వ్యవహారిస్తారు. ఈ పండుగు 19వ శతాబ్దం కింగ్ ఆంగ్ డుయోంగ్ కాలం నుంచి ప్రజలు ఆచరిస్తున్నారు. అంతేగాదు ఈ పండుగ చివరి రోజున జరుపుకునే ఉత్సవానికి అక్కడి ప్రభుత్వం సెలవు ఇస్తుంది కూడా. పండుగ చివరి రోజున దెయ్యాల కోసం ఓ పడవలో నిండుగా వివిధ రకాల పిండి పదార్థాలన్ని పెట్టి కొంత దూరం వరకు తీసుకెళ్లి వదిలేస్తారు. అక్కడకు వివిధ ఆత్మలు వచ్చి ఆహారపదార్థాలతో ఆకలి తీర్చుకుని తిరిగి నరకానికి వెళ్లిపోతాయని చెబుతున్నారు కంబోడియా ప్రజలు. ఏదీఏమైనా చాలా విచిత్రంగా ఉంది కదూ ఈ పండుగ. (చదవండి: మిస్టీరియస్ 'భాన్గఢ్కోట‘!..ఆ సమయంలో గానీ కోటలోకి అడుగుపెట్టారో అంతే..!) -
130 ఏళ్ళకు తలను శరీరాన్ని కలిపారు!
పారిస్ గైమెట్ మ్యూజియంలో ఏడవ శతాబ్దం నాటి హిందూ దేవతా విగ్రహం సందర్శకులను ఆకట్టుకుంటోంది. పదమూడు దశాబ్దాల తర్వాత ఆ శిల్పంలో విడిపోయిన తల భాగాన్ని తెచ్చి, ఇప్పటికే మ్యూజియంలో ఉన్నశరీర భాగానికి అతికించి ప్రదర్శనకు ఉంచారు. ఫ్రెంచ్.. వలస రాజ్యంగా ఉన్న సమయంలో హరిహరుల విగ్రహంలోని శిరస్సు భాగం అప్పటి ఫ్రెంచ్ కాలనీగా ఉండే కంబోడియాలో ఇటీవల బయటపడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడా శిరస్సును ఫ్రాన్స్ కు తెచ్చి శరీరంతో జోడించారు. దశాబ్దాల తర్వాత హరి హరుల శిల్పం సంపూర్ణ రూపం దాల్చింది. 130 ఏళ్ళుగా శరీర భాగంమాత్రమే మ్యూజియంలో ప్రదర్శనకు ఉండగా... ఇటీవల కంబోడియాలో బయటపడ్డ శిరస్సు భాగం.. ఫ్రాన్స్ మ్యూజియంలోని శరీరానికి సంబంధించినదిగా గుర్తించారు. దీంతో కంబోడియానుంచీ ఆ 47 కిలోల బరువున్నహరి హరుల శిరస్సును.. ఎట్టకేలకు మాతృదేశానికి చేర్చి శరీర భాగంతో కలిపారు. ఇప్పుడా శివ, విష్ణువుల అద్భుత కళా ప్రతిమ... పారిస్‌లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వాస్తవానికి టకియో ప్రావిన్స్‌లోని నామ్ డా ఆలయం నుంచి అప్పటి కలోనియల్ అడ్మినిస్ట్రేటర్ ఈటియెన్ అయమోనియర్ 1889 లో ఈ హరిహరుల శరీర భాగాన్ని ప్రదర్శన కోసం ఫ్రాన్స్ మ్యూజియం కు తెచ్చినట్లు మ్యూజియం జారీ చేసిన పత్రికా ప్రకటన ద్వారా తెలుస్తోంది. అయితే ఈ శిల్పంలోని ఎక్కువ భాగం ఫ్రాన్స్‌లో ఉండిపోవడంతో నామ్ పెన్ లో ఇటీవల బయటపడ్డ శిరస్సు భాగం నిజానికి దీనిదా కాదా... ఫ్రాన్స్ మ్యూజియంలోని శరీర భాగానికి ఇది సరిగా అతుక్కుంటుందా లేదా అనుకున్నారు. అయితే ఎట్టకేలకు శరీర భాగానికి శిరస్సు సరిగ్గా సరిపోయిందని, కంబోడియా నేషనల్ మ్యూజియమ్ డిప్యూటీ డైరెక్టర్ సియా సోఛీట్ స్థానిక వార్తా పత్రికకు తెలిపారు.