130 ఏళ్ళకు తలను శరీరాన్ని కలిపారు!
పారిస్ గైమెట్ మ్యూజియంలో ఏడవ శతాబ్దం నాటి హిందూ దేవతా విగ్రహం సందర్శకులను ఆకట్టుకుంటోంది. పదమూడు దశాబ్దాల తర్వాత ఆ శిల్పంలో విడిపోయిన తల భాగాన్ని తెచ్చి, ఇప్పటికే మ్యూజియంలో ఉన్నశరీర భాగానికి అతికించి ప్రదర్శనకు ఉంచారు. ఫ్రెంచ్.. వలస రాజ్యంగా ఉన్న సమయంలో హరిహరుల విగ్రహంలోని శిరస్సు భాగం అప్పటి ఫ్రెంచ్ కాలనీగా ఉండే కంబోడియాలో ఇటీవల బయటపడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడా శిరస్సును ఫ్రాన్స్ కు తెచ్చి శరీరంతో జోడించారు.
దశాబ్దాల తర్వాత హరి హరుల శిల్పం సంపూర్ణ రూపం దాల్చింది. 130 ఏళ్ళుగా శరీర భాగంమాత్రమే మ్యూజియంలో ప్రదర్శనకు ఉండగా... ఇటీవల కంబోడియాలో బయటపడ్డ శిరస్సు భాగం.. ఫ్రాన్స్ మ్యూజియంలోని శరీరానికి సంబంధించినదిగా గుర్తించారు. దీంతో కంబోడియానుంచీ ఆ 47 కిలోల బరువున్నహరి హరుల శిరస్సును.. ఎట్టకేలకు మాతృదేశానికి చేర్చి శరీర భాగంతో కలిపారు. ఇప్పుడా శివ, విష్ణువుల అద్భుత కళా ప్రతిమ... పారిస్లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వాస్తవానికి టకియో ప్రావిన్స్లోని నామ్ డా ఆలయం నుంచి అప్పటి కలోనియల్ అడ్మినిస్ట్రేటర్ ఈటియెన్ అయమోనియర్ 1889 లో ఈ హరిహరుల శరీర భాగాన్ని ప్రదర్శన కోసం ఫ్రాన్స్ మ్యూజియం కు తెచ్చినట్లు మ్యూజియం జారీ చేసిన పత్రికా ప్రకటన ద్వారా తెలుస్తోంది. అయితే ఈ శిల్పంలోని ఎక్కువ భాగం ఫ్రాన్స్లో ఉండిపోవడంతో నామ్ పెన్ లో ఇటీవల బయటపడ్డ శిరస్సు భాగం నిజానికి దీనిదా కాదా... ఫ్రాన్స్ మ్యూజియంలోని శరీర భాగానికి ఇది సరిగా అతుక్కుంటుందా లేదా అనుకున్నారు. అయితే ఎట్టకేలకు శరీర భాగానికి శిరస్సు సరిగ్గా సరిపోయిందని, కంబోడియా నేషనల్ మ్యూజియమ్ డిప్యూటీ డైరెక్టర్ సియా సోఛీట్ స్థానిక వార్తా పత్రికకు తెలిపారు.