లేగదూడలు ఒక షెడ్‌లో ఏర్పాటు చేసిన దృశ్యం
గౌరీనాథుడి వాకిట.. గోరాజసం
Published Wed, Aug 10 2016 12:06 AM | Last Updated on Tue, Nov 6 2018 4:55 PM
– ప్రత్యేక వైద్యుడి నియామకం
– అదనంగా ఆరు షెడ్లు ఏర్పాటు
– త్వరలో విభూది తయారీ కేంద్రాలు ఏర్పాటు
శ్రీకాళహస్తి:
అక్కడ ఆవులన్నీ గుంపులు, గుంపులుగా తిరిగేవి. ఆ పశువులు మేత కరువు.. రోగాల దరువుతో విలవిలాడుతుండేవి. కొన్ని మృత్యువాత పడేవి. వీటి దుస్థితి చూసి ఆ ముక్కంటీశునికే జాలి కలిగిందేమో మరీ. గోవులను రక్షించమని దేవస్థానం అధికారులను పురమాయించినట్లుంది. ఉన్నట్టుండి శ్రీకాళహస్తీశ్వరాలయాధికారులు ఆవులపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. గోమాతలకు కూడు, గూడు, వైద్య సదుపాయం కల్పించారు. ఫలితంగా ముక్కంటి చెంత గో రాజసం తొణికిసలాడుతోంది.
శ్రీకాళహస్తి దేవస్థానంలోని గోశాలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. నిన్నటి వరకు ఆవులు, ఎద్దులు, పాలిచ్చే ఆవులు, దూడలు అన్నింటినీ కలిపి గుంపులు, గుంపులుగా తోలేవారు. దీంతో అవి కుమ్ముకుని తీవ్రంగా గాయాల పాలయ్యేవి. దీనికితోడు ఆవులకు వ్యాధులు సోకితే పట్టించుకునే వారు కరువవడంతో అవి మృత్యువాత పడేవి. ఈ నేపథ్యంలోనే గత ఏడాదిలో 30 గోవులు మృతి చెందాయి. ఈ విషయమై ఎవరైనా ప్రశ్నిస్తే ఆవులను ఆశ్రమాలకో, మఠాలకో ఇచ్చేస్తామని పాలకులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పలువురు తీవ్రంగా ఖండించారు. దీంతో పాలకుల తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. గోశాలపై దృష్టి సారించారు. దేవస్థానం గోశాలలో గోవుల కోసం ఆరు షెడ్లు ఉన్నాయి. కాగా వారం రోజులుగా వురో ఆరు షెడ్లు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే నాలుగు షెడ్లు పూర్తి చేశారు. వురో రెండు షెడ్లు నిర్మాణంలో ఉన్నాయి. దూడలు, పాలిచ్చే ఆవులు, సూడి ఆవులు, వుుసలి ఆవులు, ఎద్దులను వేరు చేసి, ఒక్కొక్క విభాగానికి ఒక షెడ్డు ఉండేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా రూ.10లక్షలు ఖర్చు చేయించి గోశాల షెడ్ల చుట్టు ప్రహరీగోడను ఏర్పాటు చేశారు. ఇక పచ్చిగడ్డితోపాటు ఎండుగడ్డి అవసరమైన మేరకు సిద్ధం చేశారు. మినరల్ మిక్చర్, ఐపీఎల్ ఫీడ్, తరకల తవుడు ఇలా అనేక పలు రకాల దాణాలను గోవుల కోసం సిద్ధం చేసి ఉంచారు. అంతేకాదు ప్రత్యేకంగా నెల్లూరుకు చెందిన శ్రీనివాస్ అనే వెటర్నరీ డాక్టర్‌కు నెలకు రూ.20 వేలు జీతం చెల్లించి గోశాలలో వైద్యునిగా నియమించారు. గతంలో గోశాలకు డాక్టర్ లేని విషయం తెలిసిందే. ఇక గోశాలలో చేయడానికి 15 వుంది సిబ్బందిని నియమించారు.ఆ ప్రాంతంలోనే ఆలయ భూవుుల్లో నర్సరీని ఏర్పాటు చేయనున్నారు. ఇక విభూది తయారు చేసే కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన సావుగ్రిని కర్నూలు నుంచి తెప్పించారు. మెుత్తం మీద రూ.లక్షలు ఖర్చు చేసి...గోశాలలో అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో గోవులు రోగాల బారి నుంచి బయటపడ్డాయని స్థానికులు అంటున్నారు. అంతేకాదు అభిషేకాలు, అన్నదానానికి అవసరమైన పాలు గోశాల నుంచే వస్తున్నాయి. గతంలో గోశాల నుంచి కేవలం 20 లీటర్లు పాలు వూత్రమే వచ్చేవి.ప్రస్తుతం 126 లీటర్ల పాలు సవుకూరుతున్నాయి.
Advertisement
Advertisement