భువనేశ్వర్: సృష్టిలో తీయనిది తల్లి ప్రేమ. పేగు తెంచుకుని కన్న బిడ్డలకు ఆదరించి లాలించడం పరిపాటే. తల్లి లేని లోటు ఏ జీవికైన భర్తీ చేయలేనిది. కూనలు కన్ను తెరిచేలోగా ప్రసవించిన తల్లి మేక కన్ను మూసింది. పోషణకు ఆధారమైన తల్లి పాలు లేక అల్లాడుతున్న మేక పిల్లల్ని వీధి కుక్క అక్కున చేర్చుకుంది. నిత్యం క్రమం తప్పకుండా తన పాలుని పంచిపెడుతోంది.
మయూర్‌భంజ్ జిల్లా జమదా మండలం మధుపూర్ గ్రామంలో ఈ విభిన్న మాతృత్వం శుక్రవారం తారసపడింది. రాగా అంకుర్ బాగే పోషించిన మేక 2 పిల్లల్ని ఈనింది. మరుక్షణమే తల్లి మేక కన్ను మూసింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో గంజితో జీవుల ఆకలి తీర్చేందుకు యజమాని చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. వీధుల్లో తిరుగాడుతున్న కుక్కకి తల్లిని కోల్పోయిన మేక పిల్లలు చేరువయ్యాయి. కడుపునిండా పాలు పంచి మేక పిల్లల్ని కుక్క అక్కున తీసుకుని ఆదరించడం స్థానికులను ఆలోచింపజేసింది.
Comments
Please login to add a commentAdd a comment