అంతరిక్షానికి ప్రయాణం | Farhan Akhtar to Star in Rakesh Sharma is Biopic | Sakshi
Sakshi News home page

అంతరిక్షానికి ప్రయాణం

Published Fri, Aug 7 2020 1:12 AM | Last Updated on Fri, Aug 7 2020 1:12 AM

Farhan Akhtar to Star in Rakesh Sharma is Biopic - Sakshi

ఫర్హాన్‌ అక్తర్‌

అంతరిక్ష ప్రయాణానికి సిద్ధం కాబోతున్నారు ఫర్హాన్‌ అక్తర్‌. వ్యోమగామిగా మారి అంతరిక్షాన్ని చుట్టేయాలనుకుంటున్నారు. అంతరిక్ష ప్రయాణం చేసిన తొలి భారతీయ వ్యోమగామి రాకేష్‌ శర్మ జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. కెమెరామేన్‌ మహేష్‌ మతై ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. త్వరలోనే రష్యాలో ఈ సినిమా షూటింగ్‌ ని ఆరంభించనున్నారని సమాచారం. ఈ బయోపిక్‌ లో రాకేష్‌ శర్మ పాత్రను ఎవరు పోషిస్తారు? అనే వార్తల్లో ఆమిర్‌ ఖాన్, షారుక్‌  ఖాన్, సుశాంత్‌ సింగ్, విక్కీ కౌశల్‌ పేర్లు గతంలో తెర మీదకు వచ్చాయి. చివరికి ఫర్హాన్‌ అక్తర్‌ ఈ పాత్రలో నటించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement