
షారుక్ నెక్ట్స్ ఏ సినిమా చేస్తున్నాడు? అటు బాలీవుడ్‌లోనూ ఇటు ఆయన అభిమానుల్లోనూ ఆసక్తికరంగా నడుస్తున్న చర్చ ఇది. ‘జీరో’ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోవడంతో కొంచెం ఆలోచనలో పడ్డట్టున్నారీ కింగ్ ఖాన్ రాకేశ్ శర్మ బయోపిక్ నుంచి తప్పుకున్నారు. తర్వాత ఏంటి? అనే ప్రశ్న షారుక్ ముందుంచితే – ‘‘ప్రస్తుతానికి కథలు మాత్రమే వింటున్నాను. ఇంకా ఏమీ డిసైడ్ అవ్వలేదు. జూన్‌లోపు ఏ సినిమా చేయాలో నిర్ణయించుకుంటాను’’ అని పేర్కొన్నారు. ‘డాన్’ సిరీస్‌లో ‘డాన్ 3’, అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా.. ఇలాంటి వార్తలు ప్రస్తుతానికి షికారు చేస్తున్నాయి. మరి.. షారుక్ ఏం చేస్తారో తెలిసేది జూన్ తర్వాతే.
Comments
Please login to add a commentAdd a comment