ప్రియాంక పోయి పెడ్నేకర్‌ వచ్చె? | Bhumi Pednekar to star opposite Shah Rukh Khan in Rakesh Sharma’s biopic Salute | Sakshi
Sakshi News home page

ప్రియాంక పోయి పెడ్నేకర్‌ వచ్చె?

Published Sun, Sep 16 2018 1:53 AM | Last Updated on Sun, Sep 16 2018 1:53 AM

Bhumi Pednekar to star opposite Shah Rukh Khan in Rakesh Sharma’s biopic Salute - Sakshi

భూమి పెడ్నేకర్‌

హాలీవుడ్‌ నుంచి రిటర్న్‌ అయ్యాక ప్రియాంకా చోప్రా ‘భారత్, సెల్యూట్‌’ సినిమాల్లో కనిపిస్తారని ఊహించారంతా. ‘భారత్‌’ సినిమా షూట్‌లో జాయిన్‌ అయ్యి, ఆ తర్వాత తప్పుకున్నారు. కానీ ‘సెల్యూట్‌’ సినిమా విషయంలో మాత్రం ముందే రేసులో నుంచి తప్పుకున్నారట. దాంతో ఇప్పుడు ప్రియాంక ప్లేస్‌లో భూమి పెడ్నేకర్‌ వచ్చారని బాలీవుడ్‌ టాక్‌. షారుక్‌ ఖాన్‌ హీరోగా మహేశ్‌ మతై దర్శకత్వంలో ‘సెల్యూట్‌’ అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రోనాట్‌ (వ్యోమగామి) రాకేశ్‌ శర్మ బయోపిక్‌ ఇది. ఈ సినిమాలో మొదట హీరోయిన్‌గా ప్రియాంకా చోప్రా పేరు వినిపించింది.

కానీ ఇప్పుడు భూమి పెడ్నేకర్‌ పేరు బాగా వినిపిస్తోంది. ఈ సినిమాలో కేవలం రాకేశ్‌ శర్మ ప్రొఫెషనల్‌ లైఫ్‌ని మాత్రమే కాకుండా భార్యతో ఆయనకున్న అటాచ్‌మెంట్‌ను కూడా చర్చించనున్నారట. దాంతో హీరోయిన్‌ పాత్ర కూడా కీలకంగా ఉండనుంది. ‘ధమ్‌ లగా కే హైశా’తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన భూమి ‘టాయిలెట్‌ ఎక్‌ ప్రేమ్‌ కథ, లస్ట్‌ స్టోరీస్‌’లతో పాపులారిటీ సంపాదించారు. ఇప్పుడు ఏకంగా షారుక్‌ పక్కన చాన్స్‌ కొట్టేయడమంటే మెల్లిగా టాప్‌ లీగ్‌లోకి ఎంట్రీ పాస్‌ కొట్టేసినట్టే. షారుక్‌ తాజా చిత్రం ‘జీరో’ పూర్తయిన నేపథ్యంలో త్వరలో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుందట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement