selute
-
ఆర్మీ జవాన్ మృతి.. సైనిక దుస్తుల్లో నాన్నకు సెల్యూట్
సాక్షి, బెంగళూరు: సైన్యంలో పనిచేసే కన్నతండ్రికి సైనిక దుస్తుల్లో నివాళులర్పించిన చిన్నారి తనయుడు అందరినీ కంటతడి పెట్టించాడు. నాగాల్యాండ్‌లో ఆర్మీ జీపు బోల్తా పడి కర్ణాటకలో బెళగావి జిల్లా శివపురకు చెందిన ఆర్మీ జవాన్ (డ్రైవర్) మంజునాథ గౌడన్నవర మరణించారు. ఆయన భౌతికకాయానికి మంగళవారం స్వగ్రామంలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలను నిర్వహించారు. ఆర్మీ యూనిఫాంలో ఆయన తనయుడు స్వరూప్ (5) సెల్యూట్ చేస్తుండగా ఓదారుస్తున్న బెళగావి ఎంపీ మంగళా అంగడి. బాలున్ని ఆ పరిస్థితిలో చూసిన గ్రామస్తుల మనసులు చలించాయి. -
సెల్యూట్‌కి సెలక్టేనా?
‘దంగల్’ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ఫాతిమా సనా షేక్. ఇటీవల ఆమె నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ నటిగా ఆమె కష్టాన్ని గురించారు బాలీవుడ్ దర్శకులు. ఇప్పుడు ఆ కష్టాన్నే గుర్తించి షారుక్ అండ్ టీమ్ ‘సెల్యూట్’ సినిమాలో ఫాతిమాను హీరోయిన్గా తీసుకోవాలని ఆలోచిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. మరి..ఫైనల్‌గా ఆమె హీరోయిన్ ప్లేస్‌ను కన్ఫార్మ్ చేసుకుంటారా? లేక వేరే ఎవరైనా దక్కించుకుంటారా? అనేది వేచి చూడాలి. ఆస్ట్రోనాట్ రాకేశ్ శర్మ జీవితం ఆధారంగా షారుక్ ఖాన్ టైటిల్ రోల్లో ‘సెల్యూట్’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని బాలీవుడ్ టాక్. -
ప్రియాంక పోయి పెడ్నేకర్ వచ్చె?
హాలీవుడ్ నుంచి రిటర్న్ అయ్యాక ప్రియాంకా చోప్రా ‘భారత్, సెల్యూట్’ సినిమాల్లో కనిపిస్తారని ఊహించారంతా. ‘భారత్’ సినిమా షూట్లో జాయిన్ అయ్యి, ఆ తర్వాత తప్పుకున్నారు. కానీ ‘సెల్యూట్’ సినిమా విషయంలో మాత్రం ముందే రేసులో నుంచి తప్పుకున్నారట. దాంతో ఇప్పుడు ప్రియాంక ప్లేస్‌లో భూమి పెడ్నేకర్ వచ్చారని బాలీవుడ్ టాక్. షారుక్ ఖాన్ హీరోగా మహేశ్ మతై దర్శకత్వంలో ‘సెల్యూట్’ అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రోనాట్ (వ్యోమగామి) రాకేశ్ శర్మ బయోపిక్ ఇది. ఈ సినిమాలో మొదట హీరోయిన్గా ప్రియాంకా చోప్రా పేరు వినిపించింది. కానీ ఇప్పుడు భూమి పెడ్నేకర్ పేరు బాగా వినిపిస్తోంది. ఈ సినిమాలో కేవలం రాకేశ్ శర్మ ప్రొఫెషనల్ లైఫ్‌ని మాత్రమే కాకుండా భార్యతో ఆయనకున్న అటాచ్‌మెంట్‌ను కూడా చర్చించనున్నారట. దాంతో హీరోయిన్ పాత్ర కూడా కీలకంగా ఉండనుంది. ‘ధమ్ లగా కే హైశా’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భూమి ‘టాయిలెట్ ఎక్ ప్రేమ్ కథ, లస్ట్ స్టోరీస్’లతో పాపులారిటీ సంపాదించారు. ఇప్పుడు ఏకంగా షారుక్ పక్కన చాన్స్ కొట్టేయడమంటే మెల్లిగా టాప్ లీగ్‌లోకి ఎంట్రీ పాస్ కొట్టేసినట్టే. షారుక్ తాజా చిత్రం ‘జీరో’ పూర్తయిన నేపథ్యంలో త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట. -
సెల్యూట్‌కి గ్రీన్ సిగ్నల్
వివాహం చేసుకున్న తర్వాత కథానాయిక కరీనా కపూర్ ఒక కీలక పాత్రలో నటించిన ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ హీరోగా రూపొందనున్న ఓ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయ్యారని వార్తలు వచ్చాయి. అయితే ఆ చిత్రం గురించి అధికారిక వార్త ఏమీ రాలేదు. ఇప్పుడు షారుక్ ఖాన్ హీరోగా నటించబోయే ‘సెల్యూట్’ సినిమాలో కథానాయిక పాత్ర పోషించడానికి కరీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆస్ట్రోనాట్ రాకేశ్ శర్మ జీవితం ఆధారంగా ‘సెల్యూట్’ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా అక్టోబర్‌లో స్టార్ట్ కానుందని టాక్. షారుక్‌తో కరీనా నటించిన చివరి చిత్రం ‘రా. వన్’. 2011లో ఈ చిత్రం విడుదలైంది. -
స్పేస్‌లోకి..
షారుక్ ఖాన్ బ్యాగ్ సర్దుకొని ఓ రెండు నెలలు పాటు స్పేస్‌లో ఉండబోతున్నారట. అక్కడ తనకు అప్పగించిన ప్రాజెక్ట్‌ను నిర్వర్తించడంలో బిజీ అయిపోతారట. మ్యాటరేంటంటే.. ఈ స్పేస్ సెట్టింగంతా రాకేశ్ శర్మ బయోపిక్ ‘సెల్యూట్’ కోసం. పైలెట్ రాకేశ్ శర్మ పాత్రలో షారుక్ ఖాన్ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు మహేశ్ మతాయి డైరెక్ట్ చేయనున్నారు. సెప్టెంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. రెండు నెలలపాటు గ్యాప్ లేకుండా ప్రత్యేకంగా రూపొందించిన స్పేస్ సెట్లో షూటింగ్ జరపనున్నారు. ఆ తర్వాత నవంబర్, డిసెంబర్లో షారుక్ ప్రెస్టీజియస్ మూవీ ‘జీరో’ను ప్రమోట్ చేయ నున్నారు. ‘సెల్యూట్’ 2019లో విడుదల కానుంది. ‘జీరో’ సినిమా డిసెంబర్ 21న విడుదల కానుంది. -
సెల్యూట్లు... సైరన్లే మిగిలాయి
అధికార టీఆర్ఎస్ నేతల పరిస్థితి కక్కలేక... మింగలేక అన్నట్లు తయారైంది. నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూసీ చూసీ విసిగిపోయిన వీరు నాయకత్వం తీరుపై జోకులు వేసుకుంటున్నారు. ఒకట్రెండు కార్పొరేషన్లు, శుక్రవారం ఓ పది మార్కెట్ కమిటీలకు చైర్మన్లు మినహా నామినేటెడ్ పదవుల పందేరం జరగలేదు. ఒక విధంగా ఇది వారి కడుపు మంటే అయినా, బహిరంగంగా మాత్రం వ్యాఖ్యానించలేకపోతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి గడిచిన పదిహేనేళ్లుగా కొనసాగుతున్న వారిలో చాలా మందికి ఇంకా ఎలాంటి పదవీ యోగం పట్టలేదు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తున్నా... రాజకీయ నిరుద్యోగంతో ఉడికిపోతున్న కొందరు నాయకులు తమకి తాము సర్ది చెప్పుకుంటున్నారు. మరోవైపు ఏ చిన్న పనికూడా కావడం లేదని, తమ వద్దకు పనుల కోసం వచ్చే కార్యకర్తలకు ఏం చెప్పాలో పాలుపోవడం లేదంటూ వాపోతున్నారు. చివరకు ఎమ్మెల్యేలు, మంత్రులకే ఏమీ నడవడం లేదట కదా అని సెటైర్లు పేలుస్తున్నారు. ‘మా నాయకునికి ఇష్టమున్నట్టులేదు. ఉంటే గింటే ఈ పాటికే మాకు పదవులు రాకపోవునా.. అయినా ఆశగా ఎదురుచూడడం తప్ప ఇప్పుడేం చేయలేం. టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి మా పార్టీలోకి వచ్చిన వాళ్లు మాత్రం ఏమన్నా సంతోషంగా ఉన్నారా..? మంత్రులు కూడా మాకు ఏం చేయలేకపోతున్నారు. అయినా... వారికి కూడా సెల్యూట్లు.. సైరన్లే మిగిలాయి..’ అని ఓ నేత వ్యాఖ్యానించారు. పార్టీ నేతల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి గురించి ఎవరూ ఆలోచించడం లేదని పదవులు రాని నేతలంతా గొణుక్కుంటున్నారు..!!