
ఫాతిమా సనా షేక్
‘దంగల్’ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ఫాతిమా సనా షేక్. ఇటీవల ఆమె నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ నటిగా ఆమె కష్టాన్ని గురించారు బాలీవుడ్ దర్శకులు. ఇప్పుడు ఆ కష్టాన్నే గుర్తించి షారుక్ అండ్ టీమ్ ‘సెల్యూట్’ సినిమాలో ఫాతిమాను హీరోయిన్‌గా తీసుకోవాలని ఆలోచిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. మరి..ఫైనల్‌గా ఆమె హీరోయిన్ ప్లేస్‌ను కన్ఫార్మ్ చేసుకుంటారా? లేక వేరే ఎవరైనా దక్కించుకుంటారా? అనేది వేచి చూడాలి. ఆస్ట్రోనాట్ రాకేశ్ శర్మ జీవితం ఆధారంగా షారుక్ ఖాన్ టైటిల్ రోల్‌లో ‘సెల్యూట్’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని బాలీవుడ్ టాక్.
Comments
Please login to add a commentAdd a comment