
కరీనా కపూర్
వివాహం చేసుకున్న తర్వాత కథానాయిక కరీనా కపూర్ ఒక కీలక పాత్రలో నటించిన ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ హీరోగా రూపొందనున్న ఓ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యారని వార్తలు వచ్చాయి. అయితే ఆ చిత్రం గురించి అధికారిక వార్త ఏమీ రాలేదు. ఇప్పుడు షారుక్ ఖాన్ హీరోగా నటించబోయే ‘సెల్యూట్’ సినిమాలో కథానాయిక పాత్ర పోషించడానికి కరీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆస్ట్రోనాట్ రాకేశ్ శర్మ జీవితం ఆధారంగా ‘సెల్యూట్’ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా అక్టోబర్‌లో స్టార్ట్ కానుందని టాక్. షారుక్‌తో కరీనా నటించిన చివరి చిత్రం ‘రా. వన్’. 2011లో ఈ చిత్రం విడుదలైంది.
Comments
Please login to add a commentAdd a comment