స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ అంతరిక్ష యాత్ర 40వ వార్షికోత్సవం | Celebrating 40 Years Of Rakesh Sharma becoming first Indian in Outer Space | Sakshi
Sakshi News home page

స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ అంతరిక్ష యాత్ర 40వ వార్షికోత్సవం

Published Wed, Apr 3 2024 9:27 PM | Last Updated on Wed, Apr 3 2024 9:27 PM

Celebrating 40 Years Of Rakesh Sharma becoming first Indian in Outer Space - Sakshi

Sanskriti పాఠశాలలో EX-ISRO శాస్త్రవేత్తచే ఆస్ట్రో స్పేస్ టెక్ క్లబ్ ప్రారంభోత్సవం

3 ఏప్రిల్ 1984న భారతదేశ అంతరిక్ష చరిత్రలో ముఖ్యమైన రోజు. ఈ రోజు సోవియట్ యూనియన్ (ఇప్పుడు రష్యా) మద్దతుతో భారతదేశం స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మను అంతరిక్షంలోకి పంపింది. 3 ఏప్రిల్ 2024, అంతరిక్షంలో రాకేశ్ శర్మ చేసిన ఈ చారిత్రాత్మక మిషన్‌కు 40 ఏళ్లు పూర్తయ్యాయి.

రాకేష్ శర్మ ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో పాటు సోయుజ్ T-11 ఎక్స్‌పెడిషన్ ద్వారా 3 ఏప్రిల్ 1984న సాయంత్రం 6.18 IST గంటలకు అంతరిక్షంలోకి దూసుకెళ్లారు.. ప్రయోగించిన తర్వాత Orbital Module రష్యా అంతరిక్ష కేంద్రానికి "Salyut 7" డాక్ చేయబడింది.  రష్యా అంతరిక్ష కేంద్రంలో 7 రోజుల 21 గంటల 40 నిమిషాలు గడిపిన తర్వాత రాకేష్ శర్మతో పాటు మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములు సోయుజ్ T-10 సహాయంతో 11 ఏప్రిల్ 1984న సాయంత్రం 4.18p.m IST సమయంలో భూమికి తిరిగి వచ్చారు.

*ఆస్ట్రో స్పేస్ టెక్ క్లబ్ ప్రారంభించబడింది: రాకేష్ శర్మ యొక్క మిషన్ రాబోయే గగన్‌యాన్ గురించి అవగాహన కల్పించడానికి. ప్లానెటరీ గ్రూప్, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్కృతి స్కూల్‌తో కలిసి పాఠశాల విద్యార్థుల కోసం  ప్రత్యేక సెషన్‌ను నిర్వహించింది.

ముఖ్యంగా NASADIYA(నాసదీయ) అనే ఆస్ట్రానమీ, స్పేస్ టెక్ క్లబ్‌ను రిటైర్డ్ ISRO సీనియర్ సైంటిస్ట్ Er రామకృష్ణ  పాఠశాలలో ప్రారంభించారు. ఎన్.శ్రీ రఘునందన్ కుమార్ డైరెక్టర్ ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియాతో పాటు స్కూల్ డైరెక్టర్లు ఎన్.రేవతి రాజు & యామిని రాజు, ఏజేఎస్ ప్రకాష్ బిజినెస్ హెడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 200 మంది విద్యార్థులు,  క్లబ్ సభ్యులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement