స్పేస్‌లోకి.. | Shah Rukh Khan to start shooting astronaut Rakesh Sharma's biopic | Sakshi
Sakshi News home page

స్పేస్‌లోకి..

Published Fri, Jul 6 2018 12:52 AM | Last Updated on Fri, Jul 6 2018 12:52 AM

Shah Rukh Khan to start shooting astronaut Rakesh Sharma's biopic - Sakshi

షారుక్‌ ఖాన్‌

షారుక్‌ ఖాన్‌ బ్యాగ్‌ సర్దుకొని ఓ రెండు నెలలు పాటు స్పేస్‌లో ఉండబోతున్నారట. అక్కడ తనకు అప్పగించిన ప్రాజెక్ట్‌ను నిర్వర్తించడంలో బిజీ అయిపోతారట. మ్యాటరేంటంటే.. ఈ స్పేస్‌ సెట్టింగంతా రాకేశ్‌ శర్మ బయోపిక్‌ ‘సెల్యూట్‌’ కోసం.  పైలెట్‌ రాకేశ్‌ శర్మ పాత్రలో షారుక్‌ ఖాన్‌ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు మహేశ్‌ మతాయి డైరెక్ట్‌ చేయనున్నారు.

సెప్టెంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. రెండు నెలలపాటు గ్యాప్‌ లేకుండా ప్రత్యేకంగా రూపొందించిన స్పేస్‌ సెట్లో షూటింగ్‌ జరపనున్నారు. ఆ తర్వాత నవంబర్, డిసెంబర్‌లో షారుక్‌ ప్రెస్టీజియస్‌ మూవీ ‘జీరో’ను ప్రమోట్‌ చేయ నున్నారు. ‘సెల్యూట్‌’ 2019లో విడుదల కానుంది. ‘జీరో’ సినిమా డిసెంబర్‌ 21న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement