వాషింగ్టన్: రోదసీలోకి విజయవంతంగా తిరిగొచ్చా కా అమెరికా పారిశ్రామికవేత్త, అమెజాన్ వ్యవస్థాప కుడు జెఫ్ బెజోస్ ఒక కొత్త అవార్డును ప్రకటిం చారు. ప్రఖ్యాత చెఫ్ జోస్ ఆండ్రీస్, అమెరికాలో రాజకీయ వార్తల వ్యాఖ్యాత వాన్ జోన్స్‌లకు ఈ అవార్డు దక్కింది. కరేజ్ అండ్ సివిలిటీ పేరిట ఇచ్చే ఈ అవార్డుతోపాటు వీరిద్దరూ దాదాపు చెరో రూ. 745 కోట్ల(10కోట్ల డాలర్లు) నగదు పురస్కారం అందుకోనున్నారు.
మానవాళి ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పోరాడటంతో అవిశ్రాంత కృషిచేస్తున్నందుకు అవార్డును ప్రకటించినట్లు బెజోస్ చెప్పారు. నగదు పురస్కారంగా పొందే ఈ మొత్తాన్ని గ్రహీతలు తమ సొంత అవసరాలకు వాడుకోవచ్చు లేదా స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వవచ్చు. ఆండ్రీస్ ప్రఖ్యాత పాకశాస్త్ర ప్రవీణుడు. 2010లో లాభాపేక్షలేని ‘ వరల్డ్ సెంట్రల్ కిచెన్’ అనే సంస్థను స్థాపించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన చోట్ల భోజన వసతులు కల్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment