Bill Gates Takes A Dig At Jeff Bezos And Elon Musk: గత కొన్ని రోజుల క్రితం వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్ సంస్థలు ప్రైవేటు వ్యక్తుల రోదసి యాత్రలను చేపట్టిన విషయం తెలిసిందే..! ఈ సంస్థల అధినేతలు స్పేస్ టూరిజంను అభివృద్ధి చేయాలనే ఉద్ధేశ్యంతో అడుగులు వేస్తున్నారు. అంతేకాకుండా ఈ సంస్థలు తదుపరి అంతరిక్షయాత్రల కోసం వడివడిగా పనులను జరుపుతున్నాయి. ప్రపంచంలోని బిలియనీర్స్ రోదసి యాత్రలను చేయడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.
చదవండి: బిలియనీర్ల కొంపముంచిన చైనా సంక్షోభం.. ! వందల కోట్లు ఆవిరి..!
భూమ్మీద ఎన్నో సమస్యలున్నాయి..వాటిపై..!
అంతరిక్ష యాత్రలతో స్పేస్ టూరిజంను అభివృద్ధిచేస్తున్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌పై మైక్రోసాఫ్ట్ అధినేత ఓ అమెరికన్ షోలో ఘాటు వ్యాఖ్యలను చేశారు. బిల్ గేట్స్ షోలో మాట్లాడుతూ... ‘భూమ్మీద మనం ఎన్నో సమస్యలతో సతమతమౌతుంటే...రోదసీ యాత్రలపై దృష్టి పెట్టడం సరికాదన్నారు. మలేరియా, హెచ్‌ఐవీ లాంటి వ్యాధులుఇంకా అంతంకాలేదు. నాకు వాటిని భూమ్మీద నుంచి ఎప్పుడు రూపుమాపుతామనే భావన నన్ను ఎప్పుడు వేధిస్తూనే ఉంది. ఈ సమయంలో స్పేస్ టూరిజంపై దృష్టిపెట్టడం సరి కాదు ’ అని అన్నారు.
లేట్ లేట్ షో విత్ జేమ్స్ కోర్డాన్ షోలో పలు అంశాలపై బిల్‌గేట్స్ చర్చించారు . భూగ్రహాన్ని వదిలిపెట్టి ఎప్పుడు ఇతర గ్రహాలకు వెళ్దామనే తపన మీలో లేదని బిల్‌గేట్స్‌ను ఉద్దేశించి షో వ్యాఖ్యత జేమ్స్ కోర్డాన్ పేర్కొన్నారు.
Tonight on our special #ClimateNight episode, Bill Gates shares a very good reason for why you haven’t seen him in a rocket ship 🚀 pic.twitter.com/7C8cKarJl0
— The Late Late Show with James Corden (@latelateshow) September 23, 2021
చదవండి: బ్యాంకులకు భారీ షాక్ ? అప్పులు చెల్లించలేని స్థితికి చేరిన మరో సంస్థ !
Comments
Please login to add a commentAdd a comment