![Indian-origin astronauts Sunita Williams and Butch Wilmore safely dock at the International Space](/styles/webp/s3/article_images/2024/06/8/070620242034-PTI06_07_2024_.jpg.webp?itok=szuEM6Jy)
హూస్టన్: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్‌తో కలిసి గమ్యస్థానం చేరుకున్నారు. బోయింగ్ కంపెనీ అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో బుధవారం అంతరిక్ష ప్రయాణం ప్రారంభించిన ఇద్దరు సాహసికులు గురువారం మధ్యాహ్నం 1.34 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి(ఐఎస్‌ఎస్) విజయవంతంగా అడుగుపెట్టారు. అవాంతరాలను అధిగమించి స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమైంది.
ఐఎస్‌ఎస్‌లో ఇప్పటికే ఏడుగురు వ్యోమగాములుండగా, సునీత, బుచ్ విల్‌మోర్‌తో తొమ్మిదికి చేరారు. కొత్తగా తమ వద్దకు చేరిన సునీతా, విల్‌మోర్‌కు ఏడుగురు అస్ట్రోనాట్స్ ఘన స్వాగతం పలికారు. ఆలింగనం చేసుకున్నారు. సునీత ఆనందంతో నృత్యం చేశారు. వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘‘ఐఎస్‌ఎస్ వ్యోమగాములంతా నా కుటుంబ సభ్యులే. వారిని కలుసుకున్నందుకు వేడుక చేసుకున్నా. ఇదో లిటిల్ డ్యాన్స్ పార్టీ’’ అన్నారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ వారం తర్వాత స్టార్‌లైనర్‌లో భూమిపైకి తిరిగి రానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment