ఐఎస్‌ఎస్‌ చేరిన డ్రాగన్‌ | Sunita Williams rescue team reaches ISS as SpaceX docks with the station Crew-9 successfully | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఎస్‌ చేరిన డ్రాగన్‌

Published Tue, Oct 1 2024 3:32 AM | Last Updated on Tue, Oct 1 2024 3:32 AM

Sunita Williams rescue team reaches ISS as SpaceX docks with the station Crew-9 successfully

వాషింగ్టన్‌: వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌లను వెనక్కు తీసుకొచ్చేందుకు బయల్దేరిన స్పేస్‌ ఎక్స్‌ డ్రాగన్‌ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. సోమవారం ఐఎస్‌ఎస్‌తో విజయవంతంగా అనుసంధానమైంది. కాసేపటికే అందులోని వ్యోమగాములు నిక్‌ హేగ్, అలెగ్జాండర్‌ గోర్బనోవ్‌ ఐఎస్‌ఎస్‌లో ప్రవేశించారు. సునీత, విల్మోర్‌ తదితరులతో కలిసి ఫొటోలు దిగుతూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

 స్పేస్‌ ఎక్స్‌ క్రూ–9 మిషన్‌ను అమెరికాలో ఫ్లోరిడాలోని కేప్‌కెనవెరల్‌ నుంచి శనివారం ప్రయోగించడం తెలిసిందే. జూన్‌లో బోయింగ్‌ తొలిసారి ప్రయోగాత్మకంగా పంపిన స్టార్‌లైనర్‌ క్యాప్సూల్‌లో సునీత, విల్మోర్‌ ఐఎస్‌ఎస్‌ చేరుకున్నారు. 8 రోజుల్లో వారు తిరిగి రావాల్సి ఉండగా స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలతో అక్కడే చిక్కుబడిపోయారు. చివరికి స్టార్‌లైనర్‌ ఖాళీగానే భూమికి తిరిగొచ్చింది. సునీత, విల్మోర్‌ డ్రాగన్‌ క్యాప్సూల్‌లో ఫిబ్రవరిలో తిరిగి రానున్నారు. వారికి చోటు కలి్పంచేందుకు వీలుగా నాలుగు సీట్ల సామర్థ్యమున్న డ్రాగన్‌ క్యాప్సూల్‌లో హేగ్, గోర్బనోవ్‌లను మాత్రమే పంపడం తెలిసిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement