Avoidable Fatalities నిజామాబాద్‌లో సేవ్‌లైఫ్ ఫౌండేషన్ ట్రామా కేర్‌ | SaveLIFE Foundation enhances trauma care in Nizamabad to prevent avoidable fatalities | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌లో సేవ్‌లైఫ్ ఫౌండేషన్ ట్రామా కేర్‌ సెంటర్‌

Published Thu, Mar 6 2025 3:08 PM | Last Updated on Thu, Mar 6 2025 3:30 PM

SaveLIFE Foundation enhances trauma care in Nizamabad to prevent avoidable fatalities

సేవ్‌లైఫ్ ఫౌండేషన్ (SaveLIFE Foundation ) మెర్సిడెస్-బెంజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో భాగస్వామ్యంతో,  జీరో  ఫెటాలిటీ కారిడార్ (Zero Fatality Corridor) కార్యక్రమంలో భాగంగా, తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ట్రామా కేర్ సెంటర్‌లో ఎమర్జెన్సీ  కేర్‌ సౌకర్యాలను అందిస్తోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(CSR) అధునాతన క్రాష్ డేటా విశ్లేషణ, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్, మెరుగైన ట్రామా కేర్ మరియు సామర్థ్య నిర్మాణాన్ని ఉపయోగించి అధిక-ప్రమాదకర రహదారులను సురక్షితమైన కారిడార్‌లుగా మార్చాలని భావిస్తోంది. 

ఇందులో భాగంగా గురువారం(మార్చి 6)న  నిర్వహించిన  ఒక కార్యక్రమంలో  ఆర్మూర్‌లోని ఏరియా హాస్పిటల్‌కి  అధునాతన ట్రామా కేర్ పరికరాలను  అందించారు.   తద్వారా వైద్య సహాయంలో జాప్యాలను తగ్గించడంతోపాటు,  రోగులను ఉన్నత వైద్య కేంద్రాలకు తరలించే లోపు సంభవించే మరణాలను నివారించగల మరణాలను నివారిస్తుందని నిర్వహికులు ఒక ప్రకటనలో తెలిపారు. వాయుమార్గ నిర్వహణ కోసం పునరుజ్జీవన సాధనాలు, శ్వాసకోశ మద్దతు, షాక్ నివారణ, రక్తస్రావం నియంత్రణ, ఫ్రాక్చర్ నిర్వహణకు సంబంధించిన ఆర్థోపెడిక్ సర్జికల్ సాధనాలతో సహా కీలకమైన ట్రామా కేర్‌ను అందిస్తుంది. ఇది  రోగులను తదుపరి చికిత్స కోసం అధునాతన వైద్య కేంద్రాలకు  తరలించేలోపు రోగులను ప్రాణాపాయం నుంచి కాపాడతాయి. అత్యవసర వైద్య అందక సంభవించే  మరణాలను తగ్గిస్తాయి.

ఆర్మూర్‌లోని ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి కుమార్ మాట్లాడుతూ, “సేవ్‌లైఫ్ ఫౌండేషన్ ద్వారా అత్యవసర సంరక్షణ సేవలు, పరికరాలను అప్‌గ్రేడ్ చేయడం మన జిల్లాలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో ఒక ముఖ్యమైన అడుగు అన్నారు.  తద్వారా బాధితులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు, క్లిష్టమైన పరిస్థితుల్లో మనుగడ రేటును మెరుగు పడుతుందన్నారు.  రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడంలో ప్రత్యేక అత్యవసర సంరక్షణ సేవలు కీలకమైనవని సేవ్‌లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సీఈవో పియూష్ తివారీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్‌లోని ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి కుమార్ , ఆర్మూర్‌లోని ఏరియా హాస్పిటల్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమృతం రెడ్డి; భీమ్‌గల్‌లోని ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శివశంకర్,సేవ్‌లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement