సెల్ నంబర్ కోసం టవరెక్కిన యువకుడు
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన సలావుద్దీన్ తాను వినియోగించే సిమ్ నంబర్‌ను తన భార్య నుంచి ఇప్పించాలని డిమాండ్‌చేస్తూ సెల్ టవర్ ఎక్కి కలకలం సృష్టిం చాడు. సలావుద్దీన్, రిజ్వానాబేగం దంపతులు. భార్య చెల్లెలు షబానాబేగం పేరిట బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ కార్డు తీసుకున్నాడు. కార్డు ఐడీ అడ్రస్‌లు ఉన్న సలావుద్దీన్ మరదలు షబానాబేగం గతేడాది మరణిం చింది. మరోవైపు అతని భార్య రిజ్వనాబేగంతో గొడవల కారణంగా వ్యవహారం కోర్టుకు చేరింది. దీంతో సలావుద్దీన్ బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్‌కార్డును అతని భార్య తీసుకొని వెళ్లిపోయింది.
సలావుద్దీన్ బ్యాంకు ఖాతాలకు, ఆధార్‌కార్డు, సిలిండర్ కనెక్షన్‌లకు అదే సెల్ నంబర్ ఇచ్చి ఉండటంతో సిమ్‌కార్డు డీ ఆక్టివేషన్ చేసి అదే నంబర్‌తో తనకు కొత్త కార్డు ఇవ్వాలంటూ ఆర్మూర్ బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. పాత ఐడీ ప్రూఫ్‌లు తీసుకు రావాలని బీఎస్‌ఎన్‌ఎల్ డీఈ శ్రీనివాస్ వివరించాడు. దీంతో సలావుద్దీన్ ఆగ్రహంతో శనివారం ఆర్మూర్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. ఐడీపార్టీ కానిస్టేబుళ్లు అతనితో ఫోన్‌లో మాట్లాడి బుజ్జగించారు.
- ఆర్మూర్