సీఎం పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం | To arrange a trip to CM | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం

Published Wed, Aug 6 2014 3:25 AM | Last Updated on Wed, Aug 15 2018 8:12 PM

To arrange a trip to CM

 ఆర్మూర్ టౌన్/నిజామాబాద్‌అర్బన్ : ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈనెల 7న జిల్లా పర్యటిస్తున్నం దున ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లలో మునిగిపోయారు. వ్య వసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మం గళవారం పనులను పర్యవేక్షించారు. శ్రీరాంసాగర్ నుంచి ఆర్మూర్‌కు తాగునీరును అందించే పథకానికి ఆర్మూర్‌లో సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

ఈ పథకం రూ. 114 కోట్లతో చేపట్టనున్నారు. ఆర్మూర్‌లోని మినీ స్టేడియంలో నిర్వహించే బహిరంగసభలో కేసీఆర్ పాల్గొంటారు. తాగు నీటి పథకం శిలాఫలకం, కాకతీయ కళాతోరణం ఏర్పాట్లను మంత్రి పోచారం, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మినీ స్టేడియానికి వెళ్లి సభా వేదిక, వీఐపీ గ్యాలరీ, మీడియా గ్యాలరీలు, ప్రజలు కూర్చునే స్థలాల వివరాలను ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సుకన్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  కేబినెట్ ఆమో దం పొందిన 43 అంశాలను ప్రజలకు తెలియపరుస్తూ సభా ప్రాంగణంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

 సభా వేదికకు వచ్చే వారికి ఇబ్బం దులు తలెత్తకుండా ట్రాఫిక్, పార్కింగ్ సమస్య లేకుండా చూడాలని డీఎస్పీ ఆకుల రామ్ రెడ్డికి సూచించారు.  అనంతరం పట్టణంలోని అం గడి బజార్‌లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలా న్ని, ముఖ్య మంత్రి వచ్చి పోయే మార్గాలను మంత్రి పరిశీలించారు. ఆర్డీవో యాదిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగా గౌడ్, టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేముల సురేందర్ రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు న్యావనంది గంగారెడ్డి తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

కలెక్టర్ రోనాల్డ్‌రాస్, ఎస్పీ తరుణ్‌జోషి సోమవారమే ఆర్మూర్‌లో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం వెళ్లే నిజామాబాద్, ఆర్మూర్ ప్రధాన రహదారి వెంబడి పిచ్చిమొక్కలను తొలగిస్తూ, డ్రైనేజీలను అధికారులు శుభ్రం చేయిస్తున్నారు. బాల్కొండ మండలం పోచంపాడ్‌లో సీఎం కేసీఆర్ బస ఏర్పాట్లను పరిశీలించారు.

 విత్తన పరిశోధన కేంద్రంగా అంకాపూర్
 ఆర్మూర్ అర్బన్: వ్యవసాయ రంగంలో ఆధునిక పరిజ్ఞానాన్ని అవలంబిస్తూ దేశంలోనే ప్రశంసలు అందుకుంటున్న అంకాపూర్ గ్రామాన్ని వ్యవసాయ పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దుతామని  మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పర్యటనలో భాగంగా  కేసీఆర్ గ్రామాభివృద్ధి కమిటీ కమ్యునిటీ హాల్‌లో రైతులతో ముఖాముఖి నిర్వహించే సభాస్థలిని పోచారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఇతర గ్రామాలను అంకాపూర్ తరహాలో అభివృద్ధి చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు.

అంకాపూర్‌ను సీడ్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. తొలిసారి గా విచ్చేస్తున్న సీఎంకు గ్రామ ప్రజలు అఖండ స్వాగతం పలకాలన్నారు. గ్రామంలో వ్యవసాయ క్షేత్రాలను సీఎం పరిశీలిస్తారని చెప్పా రు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ అంకాపూర్‌ను చాలా ఇష్టపడతారన్నారు. గ్రీన్ అగ్రికల్చర్‌ను గ్రామంలో ప్రవేశ పెట్టేందుకు కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలిపారు. గ్రామ రైతాంగం, అభివృద్ధి, భూసారం, జలవనరు లు, తదితరు అంశాలపై సీఎం నేరుగా రైతుల తో చర్చిస్తారన్నారు.

 గ్రామాన్ని పైలట్ గ్రామంగా తీసుకోనున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో అభివృద్ధి చేసేందుకు సీఎం పర్యటన దోహద పడుతుందన్నారు. రూ. 20 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిన రైతు బాంధవుడని అన్నారు. మంత్రి, ఎమ్మెల్యేను గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సల్ల చిన్న అనంత్, మాజీ అధ్యక్షుడు జి రాజన్న, సర్పంచ్ పుష్ప, వీడీసీ సభ్యులు సన్మానించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement