
ఆర్మూర్ టౌన్: ఆర్మూర్ పట్టణంలోని రాజారాంనగర్ కాలనీలో గల శ్మశాన వాటికలో క్షుద్రపూజలు చేస్తున్న వారిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. పట్టణంలోని ప్రియాంక క్లీనిక్‌కు చెందిన ఆయుర్వేద వైద్యుడు సమీర్ రాయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో శ్మశాన వాటికలో క్షుద్రపూజలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన స్థానికులు కొందరు అటువైపు వెళ్లి చూశారు. విషయం తెలిసి ఆగ్రహంతో చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కలకత్తాకు చెందిన సమీర్‌రాయ్ కుటుంబం పదిహేనేళ్ల క్రితం ఇక్కడకు వలస వచ్చింది. తమ ఇంట్లో తరచూ కలహాలు చోటు చేసుకుంటుండడంతో పురోహితుని సలహా మేరకు పూజలు చేసి నట్లు సమీర్ రాయ్ నమ్మించే ప్రయత్నం చేశారని స్థానికులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment